చేసే పని ప్యాషన్‌తో చేయాలి కానీ సక్సెస్ మన వెనక కుక్కపిల్లా వచ్చేస్తుంది. ఇష్టం లేకుండా ఎన్ని లక్షలు వచ్చే జాబ్ చేసినా.. అది మెకానికల్‌గానే ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రూవ్ చేసి చూపించింది ఓ యంగ్ లేడీ. తన మనసుకు నచ్చని జాబ్‌ను వదిలేసి తాను ఇష్టపడే వ్లాగింగ్‌ను ఎంచుకుంది. నాలుగు ఏళ్లు కష్టపడి సంపాదించే మొత్తాన్ని ఒకే ఏడాదిలో సింపుల్‌గా సంపాదించి ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది. ఆమే యూట్యూబర్ నిశ్చా షా. 12 ఏళ్ల పాటు లండన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పనిచేసిన ఆమె సంవత్సరానికి 2 కోట్లు సంపాదించేవారు. కానీ తన కెరీర్ అర్థవంతంగా లేదని, కొత్తగా ఏదో సాధించాలని తపన పడ్డారు.
బ్యాంకింగ్ రంగంలో తాను కేవలం కార్పొరేషన్లకు, ప్రభుత్వాలకు మాత్రమే సహాయపడుతున్నానని, ఇంకా ఎక్కువ మందికి తన వల్ల ప్రయోజనం కలగాలని అనుకున్నారు. దీంతో 2023 జనవరిలో ఉద్యోగాన్ని వదిలేసి, పర్సనల్ ఫైనాన్స్‌లో ఫుల్ టైమ్ కంటెంట్ క్రియేటర్‌గా మారారు. అప్పటి నుంచి ఈ ఏడాది మే నెల వరకు 8 కోట్లు సంపాదించారు. యూట్యూబ్ మానెటైజేషన్ ఆదాయం, కోర్సులు, ప్రొడక్ట్స్ అమ్మడం, కార్పొరేట్ చర్చలు నిర్వహించడం, ప్రముఖ బ్రాండ్లతో భాగస్వామి కావడం ద్వారా ఈ డబ్బు సంపాదించారు. మనసుకు నచ్చిన పని చేశాను కాబట్టే ఈ సక్సెస్ సాధించాను అని చెప్తున్నారు షా..
ఇప్పుడు డబ్బు వెంట పరుగులు తీయకుండా, కేవలం తనకు నచ్చినదానిని, తనకు ఇష్టమైనదానిని చేయడం ద్వారా సంపాదిస్తున్నానని చెప్పారు. అయితే యూట్యూబ్ ప్రారంభించిన తొలినాళ్లలో నిశ్చా చాలా కష్టపడ్డారట. దాదాపు 11 నెలల వరకూ తనకు వెయ్యి మంది సబ్‌స్క్రైబర్లు మాత్రమే అయ్యారట. 2022 సెప్టెంబర్‌లో తాను చేసిన వీడియో వైరల్ కావడంతో సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 50 వేలకు చేరుకుందట. అప్పటి నుంచి ఇక తాను వెనక్కు తిరిగి చూడలేదని.. ఏడాదిలో ఈ స్థాయికి చేరానని చెప్పారు షా. కేవలం ఒకే ఉద్యోగం మీదే ఆధారాపడకుండా వివిద ఇన్‌కం సోర్స్‌లను పెంచుకోవాలనేది నిశ్చా సూక్తి. ఇప్పుడు నిశ్చా సాధించిన ఈ సక్సెస్ సోషల్ మీడియాలో చాలా మందికి ఇన్స్‌పిరేషన్ అవుతోంది.