LTTE Prabhakaran: రాజీవ్ హత్యలో ప్రభాకరన్ కీలక పాత్ర – ఇతని క్రేజ్ వెనుక కారణం తెలుసా?

అనగనగా శ్రీలంక ఆ లంకలో ఓ పులి.. ఆపులి పేరు వేలుపిళ్లై ప్రభాకరన్. కొందరి దృష్టిలో తమ జాతి అభ్యుదయం కోసం పుట్టిన నాయకుడు అంటారు. మరికొందరైతే వేటానే చిరుత అంటాడు. ఈయనను దగ్గర నుంచి చూసిన వారైతే శ్రీలంకలోని పలువురు రాజకీయ నాయకుల ప్రాణాలను హరించి ఆ దేశానికి ముచ్చమటలు పట్టించిన మానవ మృగంగా చెబుతారు.

  • Written By:
  • Updated On - February 14, 2023 / 03:57 PM IST

శ్రీలంకలోని జాఫ్నా ద్వీపకల్పం సమీపంలోని వెల్వెట్టిథురైలో నవంబర్ 26, 1954లో ప్రభాకరన్ జన్మించాడు. ఈయన తండ్రి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసేవారు. ఆయనకు నలుగురు సంతానం. వీరందరిలోకి చిన్నవాడు ప్రభాకరన్. నిజానికి బాల్యంలోని తొలినాళ్లలోనే ఈయన చదువును పక్కన పెట్టి శ్రీలంకలో నివసించే తమిళ ప్రజల హక్కుల కోసం పోరాటం చేసేవాడు. అక్కడి స్థానిక రాజకీయాల్లో, సభల్లో, సమావేశాల్లో పాల్గొనేవాడు. చిన్నతనంలో మార్షలార్ట్స్ శిక్షణ కూడా తీసుకున్నాడు. నెపోలియన్, అలెగ్జాండర్ వంటి గొప్పవారిపై ఇష్టాన్ని పెంచుకున్నారు. చెగువేర, బోస్, భగత్ సింగ్ లే ఇలా అవ్వడానికి ప్రేరణ కలిగించారట. అప్పట్లో తమిళులకు కనీస అవసరాలైన విద్య, వైద్యం, ఉపాధి కల్పించడంలో శ్రీలంక ప్రభుత్వం వివక్ష చూపించేది. దీంతో పోరాట మార్గాన్ని ఎంచుకొని వీరికి న్యాయం చేయవచ్చని ఈ మారణ హోమానికి ఒడిగట్టాడు.

అసలు ప్రభాకరన్ ఎవరు..?
మొట్టమొదటిసారి 1972లో శ్రీలంకలోని తమిళుల కోసం ఒక సంస్థను ప్రారంభించాడు. దీనిపేరే తమిళ్ న్యూటైగర్ (TNT). దీనిని నెలకొల్పిన కొద్దిరోజులకి ఆ దేశంలోని ఈశాన్యప్రాంత తమిళులను ఒక సమూహంగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరందరితో వేర్పాటువాద ఉద్యమానికి నాంది పలికాడు. ఉద్యమం ప్రారంభంలోనే జాఫ్నా మేయర్ గా విధులు కొనసాగాస్తున్న ఆల్ఫ్రెడ్ దురైయప్పను 1975లో చాలా దగ్గర నుంచి కాల్చి చంపాడు. ఆతరువాత తమిళ్ న్యూ టైగర్ గా ఉన్న(TNT)ని కాస్త లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE)గా మార్చేశారు. 1976లో ఈ సంస్థకు నాయకుడుగా వ్యవహరించారు. అప్పటి నుంచి ప్రభాకరన్ అరాచక రక్తపాతం ప్రారంభమైంది. తనకు, తన సిద్దంతాలకు అడ్డు తగిలిన వారిని హత్య చేస్తూ వచ్చాడు. ఈ (LTTE) మరింత ఉగ్రరూపం దాల్చుకొని గెరిల్లా దళంగా ఎదిగింది. దాదాపు 35ఏళ్లపాటూ సాగిన ఈ మారణకాండలో దాదాపు 65వేల మందికి పైగా తన పోట్టన పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ దెబ్బతో ప్రపంచంలోని తీవ్రవాద సంస్థల్లో అత్యంత శక్తివంతమైన సంస్థగా ఎదిగింది. ఎక్కడైతే తమిళుల హక్కులు భంగం కలుగుతాయో అక్కడ వచ్చి వాలిపోయేవారు. వీరికి టైగర్లు, సముద్ర టైగర్లు, ఎయిర్ టైగర్లతో కూడిన త్రివిధ దళాలు ఉండేవి. ఉత్తర శ్రీలంకలోని వన్నీ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని ఈ పోరాటాన్ని సాగించేవారు. వీరితో పాటూ బ్లాక్ టైగర్స్ పేరుతో మరో ప్రత్యేక టీం ఉండేది. దురదృష్టవశాత్తు వీరు ప్రత్యర్థులకు దొరికిపోతే వెంటనే తమంతతాము ఆత్మహత్య చేసుకునేందుకు సైనైడ్ మందును లాకెట్ లో ధరించే వారు. ఈ దళంలో మహిళలు ఎక్కువగా ఉండటం గమనించదగ్గ అంశం. దాదాపు 30ఏళ్లు శ్రీలంకకు ఊపిరాడకుండా చేశారు.

రాజీవ్ హత్యకు కారణం:
తమిళుల పోరాటానికి శ్రీలంకలో సింహణిలు చేస్తున్న దాడులను ఖండిస్తూ LTTE సంస్థ మద్దతు తెలిపింది. ఇందులో తమిళులకు DMK, AIDMK కూడా మద్దతు తెలిపింది. గతంలో ఇందిరా గాంధీ LTTE ప్రభాకరన్ కు ఆయుధాలు సరఫరా చేస్తూ మద్దతు ఇచ్చేది. అలాగే రాజీవ్ గాంధీ కూడా ప్రధాని అయిన తరువాత ఇతనికి మద్దతు ఇచ్చారు. అదే సమయంతో సింహణిలు ప్రభాకరన్ ఆర్మీని క్రమక్రమంగా స్వాధీనం చేసుకుంటూ ఉండేది. అంతేకాకుండా శ్రీలంక ప్రభుత్వం వారికి భోజనాలు, మంచి నీళ్లు ఇవ్వకుండా బంధించింది. అప్పుడు రాజీవ్ గాంధీ తన IPKF ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ను రంగంలోకి దింపి కొన్ని వేల టన్నుల ఆహారాన్ని బంధించిన LTTE ప్రజలకు ఇచ్చారు. ఇది గుర్తించిన శ్రీలంక ప్రభుత్వం రాజీవ్ ను పిలిపించి చర్చలు జరిపింది. శ్రీలంకతో రాజీవ్ ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అందులో శ్రీలంక ప్రభుత్వం చెప్పిన అంశాలు చాలా ఉన్నాయి. తమిళులకు ప్రత్యేక దేశం మినహా మిగిలిన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అని ప్రతిపాదించారు. దీనికి రాజీవ్ అంగీకారం తెలుపుతూ సంతకం చేసి ఒప్పందం కుదుర్చుకున్నారు. వెంటనే LTTE బలగాల వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకోమని రాజీవ్ గాంధీ IPKF సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఒప్పంద పత్రాన్ని చదివిన ప్రభాకరన్ దీనికి అంగీకరించలేదు. మన వద్ద ఉన్న ఆయుధాలు ఇచ్చేస్తే ఇంతకాలం మనం చేసిన పోరాటం నీరుగారిపోతుందని, ఇదే అదునుగా మనల్ని శ్రీలంక వాళ్లు చంపేస్తారని రాజీవ్ చేసుకున్న ఒప్పందాన్ని తోసిపుచ్చారు. దీంతో రాజీవ్ ఆర్మీ బలగాలను పెంచి గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీలంకలోని సింహణిలకు, IPKF వారికి దొరకకుండా ప్రభాకరన్ అడవుల్లో తలదాల్చుకున్నారు. అతనిని వెతికే క్రమంలో చాలామంది సైనికులతో పాటూ ప్రభాకరన్ మనుషులకు కూడా చనిపోయారు.

ఆగ్రహానికి గురైన LTTE నాయకుడు:
ఆతరువాత 1989న వి.పి. సింగ్ నేతృత్వంలో భారత్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ప్రధాని అయిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో లేదు. అప్పటికే శ్రీలంకపై ప్రభాకరన్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అవకాశం దొరికితే సింహణిలను అంతమొందించేందుకు సిద్దమయ్యారు. ఆసమయంలోనే భారత్ శ్రీలంకకు సపోర్ట్ చేసినందుకు రాజీవ్ గాంధీ మీద కోపంగా ఉన్నిన్నారు. ఇండియన్ ఇన్వాల్ మెంట్ శ్రీలంక ప్రజలకు కూడా నచ్చలేదు. ఇందుకు కారణం భారత్ సైన్యం తమకు మద్దతుగా నిలవడం. దీనివల్ల ప్రభాకరన్ తమ దేశీయులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుండటం. ఇవన్నీ గమనించిన శ్రీలంక ప్రభుత్వం ఇండియన్ ఆర్మీని తమ దేశం నుంచి వెళ్లిపొమ్మని ఆదేశించింది. ఇలాంటి పరిస్థితుల్లో మేము చూస్తూ ఉండలేమని అన్నారు రాజీవ్. 1989లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధాని అయ్యాక మన సైన్యాన్ని శ్రీలంక నుంచి వెనక్కు పిలిపించారు. ఆతరువాత శ్రీలంకతో ఎలాంటి సంప్రదింపులు చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఆదేశ పరిస్థితులను అస్సలు పట్టించుకోలేదు.

రాజీవ్ హత్యకు వ్యూహం:
ఇంతలో కూటమిలో విభేదాల కారణంగా విపి సింగ్ ప్రభుత్వం రద్దయ్యింది. ఆతరువాత మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఈ అస్థిరత్వ ప్రభుత్వ పాలనలో విసిగిపోయిన ప్రజలు తరువాత రాజీవ్ నే ప్రధాని చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిని ముందుగా గ్రహించిన ప్రభాకరన్ 1987లో కూడా బలవంతపు శాంతి ఒప్పందాన్ని కుదిర్చారు. ఇక 1991లో ఎన్నికైతే మరోసారి తమను ఇబ్బందులనకు గురిచేస్తారని ఆలోచించారు. ఇలాగనుక జరిగితే తమ ప్రాణాలకే ప్రమాదం అని తెలుసుకున్నారు. అప్పటికే రాజీవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశం మొత్తం సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ముందుగా విశాఖపట్నంలో పర్యటన ముగించుకొని షెడ్యూల్ ప్రకారం తమిళనాడులో ప్రచారం చేస్తారన్న విషయాన్ని ముందుగా తెలుసుకున్నారు LTTE అధ్యక్షుడు. ఆసమయంలో మద్రాసు కేంద్రంగా 5మంది సభ్యులతో ఒక టీంను ఏర్పాటు చేసుకొని రాజీవ్ ను హత్య చేసేందుకు వ్యూహం రచించారు. థానో అనే అమ్మయిని ఎన్నుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడేలా శిక్షణ ఇచ్చారు. అక్టోబర్ 21 1991 లో తమిళనాడులోని శ్రీపెరంబూర్ లోని ఎన్నికల ప్రచారంలో చేరుకొన్నారు ఆ మహిళ. రాజీవ్ కు పూల మాల వేసేందుకు ముందుకు వచ్చినట్లు వచ్చి కాళ్లమీద పడబోతున్నట్లు నటించి తన నడుముకు చుట్టుకున్న మానవబాంబు బటన్ ను నొక్కారు. కొన్ని క్షణాల వ్యవధిలో రాజీవ్ సహా చాలామంది మరణించారు.

రాజీవ్ తో పాటూ పలువురి హత్యలు:
ఒకప్పుడు సిక్కులను నమ్మి ఆపై వ్యతిరేకించినందుకు ఇందిర సిక్కుల ద్వారా మరణం కొని తెచ్చుకున్నట్లు.. రాజీవ్ కూడా తమిళులకు మద్దతు ఇస్తూ మళ్లీ ఉపసంహరించుకొని తమిళ మద్దతు బలగాల ద్వారా మరణించారు. ఈ హత్య తరువాత మరింత మందిని చంపేశారు. 1991లో శ్రీలంక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రంజన్ విజేరత్నేను, 1993లో శ్రీలంక దేశాధ్యక్షుడు ప్రేమదాసను అతి దారుణంగా హత్య చేశారు. 2005లో కూడా ఆదేశ విదేశాంగ మంత్రి లక్ష్మణ్ కదిర్ గమర్ తో సహా చాలా మంది LTTE సైన్యానికి బలైయ్యారు. అందుకే ఇంతటి ఆదరణ లభించింది.

మరణించిన ప్రభాకరన్ మళ్లీ ఎలా వచ్చాడు.?
శ్రీలంక ప్రభుత్వం 2009లో LTTE సైన్యాన్ని గుర్తించడం కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అడవుల్లో కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ప్రభాకరన్ చనిపోయినట్లు ప్రకటించింది. అప్పటి ప్రభుత్వ ఇలాంటి కీలక ప్రకటన చేసిన తరుణంలో దాదాపు పుష్కర కాలం దాటిన తరువాత ప్రభాకరన్ చనిపోలేదు ఇంకా బ్రతికే ఉన్నాడని తమిళ జాతీయోద్యమనేత ఒకరు ప్రకటించడం కొంత ఆసక్తిని, ఆందోళనను రేకెత్తిస్తుందని చెప్పాలి.

 

T.V.SRIKAR