అది మెక్సికో నగరం. ఇక్కడి ఓప్రాంత మేయర్ కు ఆడ మొసలితో వివాహం జరిపించారు స్థానికులు. దీనికి కారణం చొంటల్, హువే అనే ఇరు సమూహాల మధ్య ఎలాంటి పొర పొచ్చులు, విభేదాలు తలెత్తకూడదని ఈ చర్యకు పాల్పడ్డారు. దక్షిణ మెక్సికోలోని విక్టర్ హ్యూగో సోసా అనే మేయర్ శాంతి నెలకోల్పాలనే ఉద్ధేశ్యంతో అలీసియా అడ్రియానా అనే ఆడమొసలితో పెళ్లికి సిద్దమయ్యారు. ఇది సుమారు 230 ఏళ్లుగా తమ పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయంగా తెలిపారు. అందుకే ఈ ఆచారాన్ని క్రమం తప్పకుండా పాటిస్తామన్నారు. ఈ రకంగా పెళ్లి చేసుకోవడం వల్ల తమ ప్రాంత ప్రజలకు మరింత అదృష్టం కలిసి వస్తుందని వీరి నమ్మకం.
ఇక పెళ్లి కొడుకుకు చొంటల్ రాజుగా ఈ మొసలిని రాణిగా భావిస్తారు. పెళ్లికి ముందు ఈ మొసలిని స్థానికులు తమ ఇంటికి తీసుకెళ్లి ప్రత్యేకంగా ఒక నృత్యాన్ని చేస్తారు. ఆ తరువాత పెళ్లి వస్త్రాలతో అందంగా ముస్తాబు చేసిన మొసలి నోటికి దారంతో కడతారు. నోరు తెరువకుండా ఉండేందుకు భద్రత దృష్ట్యా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ ప్రాంతంలోని మత్యకారులు వలలను పట్టుకొని చిందులు వేస్తారు. చివరిగా పెళ్లి కొడుకు మొసలిని ఎత్తుకొని అంటే స్వయంగా వధువును ఎత్తుకున్నట్లు భావించి డ్యాన్స్ చేస్తారు. ఆ తరువాత దాని నుదుటిపై ముద్దుపెడతారు. ‘మేం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం.. నేను నా భార్యపట్ల మంచిగా పూర్తి బాధ్యతతో మెలుగుతాను’ అని మేయర్ సోసా తెలపడంతో ఈ వేడుక ముగుస్తుంది.
T.V.SRIKAR