MICHAUNG EFFECT: మిచౌంగ్ తీరం దాటింది ! 100 కిమీ వేగంతో ఈదురుగాలులు

తుఫాన్ తీరం దాటినా.. జనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. మిచౌంగ్ తుఫాన్ తీరం దాటిన తర్వాత 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

  • Written By:
  • Publish Date - December 5, 2023 / 05:49 PM IST

MICHAUNG EFFECT: మిచౌంగ్.. డేంజర్ తుఫాన్ ఏపీలోని బాపట్ల దగ్గర్లో తీరం దాటింది. ఈ ప్రభావంతో తీరం వెంట గంటకు 90 నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. రాబోయే 2 గంటల్లో తుఫాన్ బలహీనపడుతుంది. ఆ తర్వాత మరో 6 గంట్లో వాయుగుండంగా మారుతుంది. తుఫాన్ తీరం దాటినా.. జనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. మిచౌంగ్ తుఫాన్ తీరం దాటిన తర్వాత 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Vijayashanthi: ఇప్పుడైనా సరిగ్గా ఉండండి.. బీఆర్ఎస్‌కు రాములమ్మ కౌంటర్‌..

తీరం దగ్గర 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ గాలులకు పెద్ద పెద్ద చెట్లు నేల కూలే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. పశ్చిమగోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పంట, ఆస్తి నష్టం ఎక్కువగా ఉంది. వరి, పొగాకు, పసుపు, అరటి, వేరుశెనగ, మినుము పంటలు బాగా దెబ్బతిన్నాయి. రాయలసీమ జిల్లాల్లో కొన్ని ఏరియాల్లోనే తుఫాన్ ప్రభావం కనిపించింది. చాలాచోట్ల విద్యుత్ స్థంభాలు, చెట్లు నేలకూలాయి. కన్ని ఏరియాల్లో రోడ్డుకి అడ్డంగా చెట్లు కూలడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణ జిల్లాల్లోనూ కనిపిస్తోంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే ఛాన్సుంది.

బుధవారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి, చెన్నైతో పాటు ఏపీలోకి కొన్ని ఏరియాలకు విమానాలు నడవడం లేదు. అటు తమిళనాడులోనూ భారీగా వర్షాలు పడుతున్నాయి. చెన్నైలో వివిధ సంఘటనల్లో ఇప్పటి వరకూ ఐదుగురు చనిపోయారు. తుఫాన్ వల్ల చాలామంది నిరాశ్రయులయ్యారు. తుఫాను ప్రభావిత ప్రజలకు సాయం చేసేందుకు సినీ హీరోలు సూర్య, కార్తి ముందుకొచ్చారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఇద్దరూ కలిసి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. గతంలో కూడా సూర్య, కార్తీ ఇలాంటి సాయమే ప్రకటించారు. చెన్నై వరదల్లో చిక్కుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ ను రెస్క్యూ దళాలు రక్షించారు. గత అక్టోబర్ నుంచి ఆమీర్ ఖాన్.. చెన్నైలోని కరపక్కం ఏరియాలో ఉంటున్నారు.

Rajini Saichand: కాంగ్రెస్‌లోకి సాయిచంద్‌ భార్య!? అందుకే పదవికి రాజీనామా చేయలేదా..

తన తల్లి జీనత్ హుస్సేన్ కి చెన్నైలో వైద్యం చేయిస్తున్నారు. కరపక్కం ఏరియాను వరదలు చుట్టుముట్టడంతో రెస్క్యూదళాలు ఆయన్ని బోటులో సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇదే ఏరియాలో ఉంటున్న తమిళ నటుడు విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తాను కూడా బోటులో తరలించారు. మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తమిళనాడు, ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశాపైనా చూపిస్తోంది.