Minister Seethakka: అంగన్వాడీలకు గుడ్‌ న్యూస్‌.. మంత్రి సీతక్క తొలి సంతకంతో వాళ్ల జీవితాల్లో వెలుగు

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సీతక్క తొలిసంతకం అంగన్వాడీలకు సంబంధించిన ఫైల్‌ మీద చేశారు. ఇప్పటి వరకూ మినీ అంగన్వాడీలుగా ఉన్న కేంద్రాలను ప్రధాన అగన్వాడీలుగా మారుస్తూ రూపొందించిన ఫైలుపై తొలి సంతకం చేశారు.

  • Written By:
  • Publish Date - December 14, 2023 / 05:48 PM IST

Minister Seethakka: తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఇవాళ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్‌లో వేదమంత్రోచ్చరణల మధ్యలో తొలి ఫైల్‌ మీద సంతకం పెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ సెక్రటేరియట్‌కు రాని స్మితా సబర్వాల్‌ కూడా సీతక్క కోసం వచ్చారు. అయితే మంత్రిగా సీతక్క మొదటి సంతకం చేసింది ఏ ఫైల్‌ మీద అనే విషయం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Smita Sabharwal: సెక్రటేరియట్‌కు వచ్చిన స్మిత.. సీతక్కతో భేటీ..

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సీతక్క తొలిసంతకం అంగన్వాడీలకు సంబంధించిన ఫైల్‌ మీద చేశారు. ఇప్పటి వరకూ మినీ అంగన్వాడీలుగా ఉన్న కేంద్రాలను ప్రధాన అగన్వాడీలుగా మారుస్తూ రూపొందించిన ఫైలుపై తొలి సంతకం చేశారు మంత్రి సీతక్క. ఆమె నిర్ణయంతో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారాయి. ఇది మాత్రమే కాదు. అంగన్వాడీ టీచర్లకు కూడా తీపి కబురు చెప్పారు. అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచుతూ నిర్ణయించిన ఫైల్‌ మీద కూడా సీతక్క సంతకం పెట్టారు.

దీంతో ఇప్పటికే వరకూ 7,500 జీతం అందుకున్న అంగన్వాడీ టీచర్లు.. ఇప్పుడు రూ.13,500 జీతం అందుకోబోతున్నారు. మొదటి సంతకంతోనే తమ జీతాలు పెంచడంపై అగన్వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.