ఆకాశంలో అద్భుతం..
అక్టోబర్ 14 అంటే శనివారం.. ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. శనివారం వచ్చే సూర్యగ్రహణం చాలా అరుదు. 178 ఏళ్ల తర్వాత ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం రెండవ, చివరి సూర్యగ్రహణం.. అక్టోబర్ 14 సర్వ పితృ అమావాస్య రోజు జరుగుతోంది. నవరాత్రికి ముందు కనిపించే ఈ గ్రహణం.. కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది. సూర్యగ్రహణం సమయంలో బుధుడు, సూర్యుడు కన్యారాశిలో ఉంటారు. దీంతో పాటు బుద్ధాదిత్య యోగం ఏర్పడుతుంది. శనివారం వస్తున్న అమావాస్య కావడంతో.. దీన్ని శని అమావాస్య అని పిలుస్తారు.
పూర్వీకులకు తర్పణం చేయడం మంచి ఫలితాలు ఉంటాయి. శనివారం రాత్రి 8 గంటల 34 నిమిషాలకు ప్రారంభమై.. తెల్లవారుజామున 2 గంట 25 నిమిషాల కంటే ముందే సూర్యగ్రహణం ముగియనుంది. ఐతే ఈ గ్రహణ ప్రభావం కారణంగా.. మేష రాశి, కర్కాటక, తుల, మకర రాశివారు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. సూర్య గ్రహణ ప్రభావం భారత దేశంలో లేకపోయినా.. గ్రహణ సమయంలో పూజ గదిలో దేవతల ను తాకడం.. ఆలయం తెరవడం లాంటి పనులు చేయొద్దని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. శనివారం ఏర్పడబోయే గ్రహణం.. చాలా చాలా స్పెషల్.
ఇలాంటి గ్రహణం చూడాలంటే 23 ఏళ్లు ఆగాల్సిందే. హిందూ ధర్మంలో గ్రహణాలకు ప్రాముఖ్యత ఉంది. గ్రహణం వెనుక ఒక ఆధ్యాత్మిక కారణం ఉంటుందని చాలా మంది నమ్ముతారు. సైన్స్ ప్రకారం భూమి, సూర్యుని మార్గం మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది.అక్టోబర్ నెలలో రెండు వారాల వ్యవధిలోనే సూర్య, చంద్ర గ్రహణాలు జరగనున్నాయి. శనివారం ఏర్పడే గ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. గ్రహణ సమయంలో భూమి, సూర్యుని మధ్యకు చంద్రుడు వెళ్లే సమయంలో.. సూర్యుని దూరం సగటు కంటే ఎక్కువగా ఉండటం కారణంగా.. సూర్యుడు అతి చిన్నగా కనిపిస్తాడు. దీంతో సూర్యుని బయటి భాగం మాత్రమే కనిపిస్తుంది. మధ్య భాగం పూర్తిగా చంద్రునిచే కప్పబడి రింగ్ ఆఫ్ ఫైర్ ప్రభావాన్ని క్రియేట్ చేస్తుంది.