ఫోన్ వచ్చిన తరువాత వ్యక్తికి వ్యక్తికి దూరం చాలా దగ్గరగా మారిపోయంది. బంధాలకు, బంధుత్వాలకు దూరం పెరిగిపోయింది. దీనికి కారణం అవసరం. మనిషి చేసే ప్రతి అవసరం ఫోన్ చేస్తుంది. ఇది కూడా ఇలా చేయాలంటే దీనితో మనం రిలేషన్ మెయింటెన్ చేయాలి. దీనిపై నిర్వహణ, నియంత్రణ లేకపోతే అవి మనమాట వినవు. మన మాట వినేలా చేసుకోవడానికి మనవద్ద ఉన్న ఒకే ఒక్క మార్గం అప్డేట్. ఇలా ఫోన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటేనే అవి మన ఆధీనంలో ఉంటాయి. మనం చెప్పిన పనిని వేగవంతంగా చేస్తాయి. లేకుంటే సాప్ట్ వేర్ కు సరైన సమాచారం అందక మనల్ని తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. అందుకే ఫోన్ ఆపరేటింగ్ సిస్టం అప్డేట్ అడిగిన వెంటనే చేయడం ఉత్తమమైన చర్య. అలాగే వాటికి సహకరిచి మనకు ఉపయుక్తమైన యాప్ లను కూడా ప్రతి వారానికి ఒకసారైనా అప్డేట్ అడుగుతుందా లేదా అని గమనించుకుంటూ ఉండాలి.
గతంలో బిజిబిజి బ్రతుకుల, గజిబిజి ఉరుకుల పరుగులలో అని వేటూరి చెప్పిన విధంగా ప్రతిఒక్కరూ ఈ జీవన శైలినే అవలంబిస్తున్నారు. ఈ యాంత్రిక యుగంలో మనిషి కూడా యంత్రంలాగా గడిపేస్తున్నాడు. యంత్రం పనిచేయాలన్నా వాటిపై కనీస స్పృహను కలిగి ఉండాలి. ఫోన్ అప్డేట్ చేయకుంటే అవి సరైన తీరును కనబరకపోవటమే కాకుండా అనేక అనర్థాలకూ దారితీస్తుంది. అవేంటో ఇప్పుడు గమనిద్దాం.
అనుక్షణం వాడే చరవాణీ సాధనాలు మంచి బ్యాటరీ లైఫ్ వచ్చేలా చూసి అధిక ధరలను వెచ్చించి కొనుగోలు చేస్తాం. అవి కొన్ని సందర్భాల్లో మనకు కావల్సిన స్థాయిలో, అనుకున్నంతగా పనితీరును కనబరచకపోవచ్చు. వాటికి ప్రదాన కారణం కంపెనీ వారు సాఫ్ట్ వేర్ అప్డేట్ చేయమని అడిగిన వెంటనే చేయకపోవడం. ఇలా అడిగిన వెంటనే అప్డేడ్ చేయడం వల్ల మీ ఫోన్ లైఫ్ ఎక్కువకాలం మన్నిక వస్తుంది. ఫోన్ బ్యాటరీ డెడ్ అవ్వడం వంటి సమస్యలు తలెత్తవు. అలాగే త్వరగా ఛార్జింగ్ దిగిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తవు.
బ్యాటరీ మన్నికతో పాటూ మనకు కావల్సింది వేగం. మనం అడిగిన వెంటనే అది సమాధానం ఇవ్వగలగాలి. అలా కాకుండా క్షణాల్లో రావల్సిన సమాచారం నిమిషాల్లో వస్తే ఫోన్ వేగంలో క్రియాశీలకమైన మర్పులు తలెత్తినట్లు చెప్పాలి. వాటిని అధిగమించడం కోసం అప్పుడప్పుడూ ఆపరేటింగ్ సిస్టంతో పాటూ ప్లే స్టోర్ లోని యాప్ లను అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే వాటిలోని ఫీచర్లు మార్పు చెంది రోజురోజుకూ అందుబాటులో ఉన్న ఆధునికతను అందిపుచ్చుకుంటాయి. అప్పుడు మనకు కావల్సిన సమాచారం వీలైనంత త్వరగా అందించేందుకు దోహదపడతాయి. శరీర పనితీరులో గుండె, రక్తం ఎలాగో సెల్ ఫోన్ లో ఆపరేటింగ్ సిస్టం, యాప్ లు అంతే కీలకం.
మరొకటి సేప్టీ, సెక్యూరిటీ. అందరి ఫోన్లో ప్రస్తుతం చాలా ముఖ్యమైన డేటాను భద్రపరుచుకుంటారు. వీటిని ఎవరూ చూడకుండా ఉండేందుకు రకరకాలా సాఫ్ట్ వేర్ లను ఉపయోగించి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా పాస్ వర్డ్ గా పెట్టుకుంటారు. అలాంటివాటిని మరింత ముఖ్యంగా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. లేదంటే అప్డేట్ లో ఇచ్చిన సెక్యూరిటీ ఫీచర్లు మన ఫోన్లో అందుబాటులో లేకుండా సైబర్ నేరాలకు గురయ్యై అవకాశం ఉంటుంది. మన విలువైన సమాచారాన్ని వేరేవాళ్లు తస్కరించే ప్రమాదానికి మీరు చేసిన జాప్యమే కారణం అవ్వచ్చు. అలాగే నగదు సంబంధిత యాప్ లు ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. వాటిని వీలైనంత వరకూ గమనించుకుంటూ అవసరమైనప్పుడు అవి అడిగిన విధంగా నడుచుకోవడం వల్ల నగదు లావాదేవీలు సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. అప్డేట్ చేయకపోవడం వల్ల సెక్యూరిటీ సెన్సార్లు, ఫీచర్లు మన ఫోన్లో లోడ్ అవ్వవు. తద్వారా ఇలాంటి అనర్ధాలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
మరోక చివరి అంశం ఫోన్ కెమెరా పనితీరు కూడా దీనిమీద ఆధారపడి పనిచేస్తుంది. మనం కొనుగోలు చేసినప్పటి సెన్సార్లు, ప్రస్తుతం వాడకంలో ఉన్న సెన్సార్ల మధ్య కంపెనీ వారు ప్రతిరోజూ ఏదో ఒక మార్పును చేస్తూ ఉంటారు. దీనికి కారణం పోటీ సమాజంలో వచ్చే రకరకాల అడ్వాన్స్డ్ ఫీచర్లే. అవి మన మొబైలో ఆటోమేటిక్ గా రావాలంటే మన ఫోన్ ఐఎంఐ నెంబర్తో అనుసంధానం చేసి ఉంచుతారు కంపెనీవారు. అందుకే వారుచెప్పిన వర్షన్లను అప్డేట్ చేయడం వల్ల ఫోటో క్వాలిటీ, క్లారిటీ, రంగుల మధ్య తేడాలు అన్నింటినీ అధిగమించవచ్చు. తీసి లొకేషన్ ఎలా అయితే ఉంటుందో అలాగే నేచురల్ లుక్ కనిపించేలా మెరుగు పరుచుకోవచ్చు.
ఇలా పైన తెలిపిన సూచనలను పాటిస్తూ మన మొబైల్ ను ఆధునీకంగా తీర్చిదిద్దుకోవడమే కాకుండా ఎలాంటి సమస్యలకు, ఇబ్బందులకు, అనర్థాలకు గురికాకుండా పరిరక్షించుకోవచ్చు.
T.V.SRIKAR