Deep Fake Videos : డీప్‌ ఫేక్‌ వీడియోలపై మొదటిసారి స్పందించిన మోదీ..

ఏఐ వీడియోల గురించి మొదటిసారి స్పందించారు ప్రధాని మోదీ (Modi) . వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్‌ తొలి సెషన్‌లో.. ప్రధాని మోదీ వర్చువల్‌గా స్పీచ్‌

డీప్‌ ఫేక్‌ (Deep Fake) . ప్రస్తుతం సొసైటీని తెగ టెన్షన్‌ పెడుతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (Artificial Intelligence) టూల్‌ ఇది. వేరే వ్యక్తులు మొహాలను హీరోయిన్స్‌ (Mohanu Heroines) మొహాలతో మార్ఫింగ్‌ చేసి వీడియోలు చేస్తున్నారు కొందరు దుర్మార్గులు. రీసెంట్‌గా రష్మిక మందనా డీప్‌ఫేక్‌ వీడియోతో ఇండియా వైడ్‌గా డీప్‌ఫేక్‌ మరోసారి పెద్ద ఇష్యూగా మారింది. దీని తరువాత మరికొందరు హీరోయిన్స్‌ ఫొటోలు, వీడియోలు కూడా ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యాయి. కేవలం సెలబ్రెటీలు మాత్రమే కాదు.. సామన్య వ్యక్తులు కూడా ఈ డీప్‌ఫేక్‌ వీడియోల ద్వారా సమస్యలు ఎదుర్కుంటున్నారు. కొందరు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై కఠిన చర్యలు ప్రారంభించింది. వీడియో మాత్రమే కాకుండా ఆడియో ఏఐ వీడియోలు కూడా ఈ మధ్య తెగ వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా మోదీ వాయిస్‌తో చేస్తున్న వీడియోస్‌కు సోషల్‌ మీడియాలో లక్షల్లో వ్యూస్‌ వస్తున్నాయి.

ఇది కూడా చదవండి : Ramulamma, Vijayashanti : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాములమ్మకు కీలక బాధ్యతలు..!

ఇలాంటి ప్రమాదకర ఏఐ వీడియోల గురించి మొదటిసారి స్పందించారు ప్రధాని మోదీ (Modi) . వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్‌ తొలి సెషన్‌లో.. ప్రధాని మోదీ వర్చువల్‌గా స్పీచ్‌ ఇచ్చారు. ఈ స్పీచ్‌లో డీప్‌ఫేక్‌ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలంటూ మీడియాను కోరారు. డీప్ ఫేక్ చాలా పెద్ద సమస్య అని.. ఈ వీడియోలపై చాట్ జీపీటీ టీమ్ కూడా తమ కంటెంట్‌లో యూజర్లను అప్రమత్తం చేసే సూచనలు చేయాలంటూ కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను, టెక్నాలజీని బాధ్యతాయుతంగా ఉపయోగించాలని చెప్పారు. ఈ డీప్‌ఫేక్‌ టూల్స్‌ చాలా మందికి అందుబాటులో ఉన్న కారణంగా దీన్ని కంట్రోల్‌ చేయడం పెద్ద సమస్యగా మారిందని చెప్పారు మోదీ. ఇప్పటికే డీప్‌ఫేక్‌ వీడియోలు చేస్తే వేసే శిక్షను కూడా ఖరారు చేశామని చెప్పారు. ఇలాంటి టెక్నాలజీని కేవలం అభివృద్ధి కోసం మాత్రమే వినియోగించాలంటూ చెప్పారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ప్రపంచ దేశాలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని చెప్పారు మోదీ.