New Adeno virus: భారత్ లో మరో కొత్త రకం వైరస్ – 24 గంటల్లో 7 మంది మృతి

వైరస్ అంటేనే ఉలిక్కిపడేలా చేసింది కరోనా. రకరకాల వైరస్ లు చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించింది మాత్రం కోవిడి 19 అని చెప్పాలి. దీనిని అంటిపెట్టుకొనే మన్నటి వరకూ జాంబీ వైరస్ భయానికి గురిచేసింది. తాజాగా మరో వైరస్ భారత్ లో కలకలం రేపుతోంది. అదే అడోనోవైరస్‌. గడిచిన 24గంటల్లో ఏడుమంది పిల్లల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది.

  • Written By:
  • Updated On - March 2, 2023 / 05:12 PM IST

సాధారణంగా వైరస్ అంటే చిన్న చిన్న లక్షణాలతో ప్రారంభమై చివరికి చితి పేర్చేలా చేస్తుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా చాలా రకాల వైరస్ లు వాటి విశ్వరూపాన్ని చూపించాయి. వీటన్నింటికీ ప్రస్తుతం వ్యాక్సిన్లు వచ్చేశాయి. తాజాగా అడోనో పేరుతో సరికొత్త లక్షణాలతో వెలుగులోకి వచ్చింది ఈవైరస్. దీని ప్రభావం చాలా వేగంగా విస్తరించేలా కనిపిస్తుంది. ఇలా చెప్పేందుకు ప్రదాన కారణం ఒక్కరోజులో ఏడు మంది ప్రాణాలను బలికొంది అంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. కోల్‌కతాలోని (Kolkata) ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐదుగురు, బంకురా సమ్మిలాని మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో (Bankura Sammilani Medical College and Hospital) ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మనదేశంలో కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటి వరకూ దీని బారినపడి చనిపోయిన వారి సంఖ్య 12గా నమోదైంది. మరో ఎనిమిది మంది చికిత్స అందజేస్తున్నట్లు డాక్టర్లు తెలుపుతున్నారు. అయితే మెరుగైన చికిత్స అందిస్తున్నప్పటికీ కొందరిలో పలు రకాల సమస్యలు ఎదురవుతున్నాయంటున్నారు. ఈవ్యాధి కేవలం రెండేళ్లలోపు చిన్నారులకు రావడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం.

ముఖ్యమంత్రి సమావేశం:

ఈవైరస్ లక్షణాలతో బాధపడుతున్న పిల్లల శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు. వీటికి సంబంధించిన ఫలితాలు రావల్సి ఉందట. దీనికి కారణం ఇతర దేశాల నుంచి వచ్చిన వారేనేమో అనే కోణంలో దర్యాప్తు చేపట్టానున్నారు అధికారులు. ఈ కొత్త రకం వైరస్ పరిస్థితిని గురించిన వివరాలను తెలుసుకునేందుకు ఆరాష్ట్ర ము‎ఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee ) అత్యవసర సమావేశన్ని ఏర్పాటు చేశారు. వైద్యఆరోగ్య శాఖ ఉన్నత అధికారుతో మాట్లడి పిల్లల ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుపుకున్నాట్లు సమాచారం. ఈ రకమైన వైరస్ లు పెరుగుతున్నందున అత్యవసరం అయితే 1800-313444-222 నెంబర్లకు సంప్రదించాలన్నారు. వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు.

అడెనో వైరస్‌ లక్షణాలు:

ఈ వైరస్ సోకడం వల్ల మనిషిలో చాలా రకాలా లక్షణాలు ఉంటాయని డాక్టర్లు పేర్కొన్నారు. అడెనోవైరస్ (Adenovirus) వల్ల తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దీంతోపాటూ జలుబు, జ్వరం, దగ్గు, కండ్లకలక, కడుపులో మంట, గొంతు నొప్పి ప్రదానమైన లక్షణాలు. కొందరిలో అయితే గ్యాస్ సమస్యలు, ఇమ్యూనిటీని తగ్గి బలహీనంగా కనిపిస్తారు. శ్వాసకోశతో పాటూ గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారైతే తీవ్రమైన అనారోగ్యంపాలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ వైరస్ కు వయసుతో సంబంధం లేదట. అన్ని రకాలా వయస్కుల వారికీ సోకే ప్రమాదం ఉందని చెబుతున్నారు. రోగులు దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ఆతుంపర్ల ద్వారా లేదా వారిని ప్రత్యక్షంగా తాకడం, మలమూత్ర ఇంన్ఫెక్షన్ ద్వారా కూడా ఈవైరస్ సోకే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. చిన్న పిల్లలకు సోకితే ఇంట్లోనే చికిత్స చేయవచ్చని వైద్యులు తెలిపారు. పిల్లల్లో, అడెనోవైరస్ సాధారణంగా శ్వాసకోశ, ప్రేగులలో తలెత్తే ఇన్ఫెక్షన్ల ద్వారా వ్యాప్తి చెందుతుందని వివరించారు.

దీని బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

కోవిడ్ లాగా తరచూ చేతులు సబ్బుతో లేదా శానిటైజర్ తో శుభ్రపరుచుకోవడం ఉత్తమం. తద్వారా వైరస్ వ్యాప్తి అధికం అవ్వకుండా నివారించవచ్చంటున్నారు. దీనికి సరైన మందులు అందుబాటులో లేవని తెలిపారు. లక్షణాలు తగ్గేందుకు మాత్రలను ఇచ్చినప్పటికీ అంతగా ప్రభావం చూపడం లేదని తెలిపారు.

 

 

 

T.V.SRIKAR