COVID 19: కరోనా కొత్త వేరియెంట్.. కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుందా..?

కరోనా ఒమిక్రాన్ వేరియెంట్‌కు సంబంధించి బీఏ 2.86 లేదా పిరోలా రూపం విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ కోవిడ్ వేరియంట్ గత జూలైలో బ్రిటన్‌లో వ్యాపించింది.

  • Written By:
  • Publish Date - November 18, 2023 / 05:02 PM IST

COVID 19: కరోనాను ప్రపంచం జయించింది. మానవజాతికి కరోనా తీవ్ర నష్టం కలిగించినప్పటికీ.. చివరకు ప్రపంచం మాత్రం కరోనాపై నెగ్గింది. అయితే, కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదంటున్నారు వైద్య నిపుణులు. కారణం.. కరోనా వైరస్ ఎప్పటికప్పుడు కొత్త రూపం సంతరించుకోవడమే. దీంతో కరోనా రూపం మార్చుకుంటూ కొత్త వేరియెంట్‌గా ముందుకొస్తోంది.

BRS SENTIMENT: బీఆర్ఎస్సా.. టీఆర్ఎస్సా ? జాతీయ పార్టీని మడత పెట్టేశారా..?

కరోనా ఒమిక్రాన్ వేరియెంట్‌కు సంబంధించి బీఏ 2.86 లేదా పిరోలా రూపం విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ కోవిడ్ వేరియంట్ గత జూలైలో బ్రిటన్‌లో వ్యాపించింది. దీనివల్ల కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. అయితే, అప్పుడు బ్రిటన్‌ను వణికించిన ఈ వేరియెంట్ ఇప్పుడు ఇండియాను కూడా వణికించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌పై ఈ వేరియెంట్ ప్రభావం ఉంటుందని, కానీ, తీవ్రంగా ఉండే అవకాశాలు లేవంటున్నారు.

దీనివల్ల ప్రజలు వివిధ రోగ లక్షణాలతో ఇబ్బందిపడే అవకాశం ఉందంటున్నారు. వీటి లక్షణాలు భిన్నంగా ఉండొచ్చు. సాధారణంగా కోవిడ్ సోకిన వారిలో జ్వరం, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ, బీఏ 2.86 లేదా పిరోలా సోకితే.. అతిసారం, ముక్కు కారటం, అధిక జ్వరం, అలసట, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వేరియెంట్ ప్రభావం ముందుగా ముఖంపై కనిపిస్తుంది. కళ్లలో మంట, చర్మంపై దద్దుర్లు రావొచ్చు. శ్వాసకోస వ్యవస్థపై కూడా దీనిప్రభావం ఉంటుంది. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది.

Salaar: సలార్ కష్టాలు.. ఒక్కోసారి క్రేజ్ కూడా శాపమే..

ఒకసారి ఈ వేరియెంట్ సోకడం మొదలైతే.. కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. బ్రిటన్‌లో ఈ వేరియెంట్ ఎక్కువైన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. టీకాల కార్యక్రమం చేపట్టింది. ప్రజలు ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.