Ganesh Nimajjanam: వినాయక నిమజ్జనం అంటే అందరికీ గుర్తొచ్చేది ట్యాంక్‌బండ్. నిమజ్జనం రోజు రాష్ట్రం మొత్తం ఫోకస్ ఇక్కడే ఉంటుంది. ఇసకెస్తే రాలనంత జనం, భారీ విగ్రహాలు, భక్తుల సెలబ్రేషన్స్.. అబ్బో.. చూసేందుకు రెండు కళ్లు చాలవు. అంతా బాగానే ఉన్నా.. భారీ స్థాయిలో వినాయక విగ్రహాలు ట్యాంక్‌బండ్‌లో వేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. తరువాత వాటిని క్లియర్ చేయడం సిబ్బందికి పెద్ద టాస్క్. ముఖ్యంగా పీఓపీ విగ్రహాలతో అయితే పని పెరగడంతో పాటు కాలుష్యం కూడా పెరుగుతోంది.
అందుకే ఈ సారి నిమజ్జనం విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి పీఓపీతో తయారైన విగ్రహాలు ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేసేందుకు అనుమతి నిరాకరించింది. కేవలం మట్టి విగ్రహాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది. మిగిలిన విగ్రహాలను కృత్రిమంగా కుంటలు ఏర్పాటు చేసుకుని నిమజ్జనం చేసకోవాలని సూచించింది. ఇది చాలా మందికి షాకింగ్ విషయమని చెప్పొచ్చు. ఇక ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు.
నెక్లెస్ రోడ్ చుట్టూ చిన్న చిన్న ఘాట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జనంలో భక్తులంతా చాలా జాగ్రత్తగా ఉండాలటూ చెప్తున్నారు. ఇప్పటికే నిమజ్జనం ప్రారంభమైంది. కొందరు గణపతి విగ్రహాల్ని ట్యాంక్‌బండ్‌తోపాటు సమీప చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తున్నారు.