ముఖ్యంగా కొన్ని రకాల మెడిసిన్స్ (Medicines)వ్యక్తుల శృంగార (Sex) సామర్ధ్యాన్ని తగ్గిస్తాయని వైద్య నిపుణులు గుర్తించారు. వాటిలో టాప్‌లో ఉన్నాయ్ పెయిన్ కిల్లర్లు (Pain Killers).. ఇందులో అనేక రకాలు ఉంటాయ్. ఎలాంటి నొప్పినైనా దూరం చేయగలిగే శక్తి వీటికి ఉంటుంది. అయితే పెయిన్‌కిల్లర్లు అధికంగా వాడితే.. లైంగిక సామర్థ్యం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. అందుకే డాక్టర్ల (Doctors) సలహా ప్రకారం, అవసరమైన మోతాదులోనే వీటిని వాడాలి. ఇక ఆ తర్వాత యాంటీ డిప్రెసెంట్స్ (Anti Depressents).. డిప్రెషన్‌కు (Depression) చికిత్స చేయడానికి ఈ మందులను ఉపయోగిస్తారు. వీటిని లిబిడో కిల్లర్స్ (Libido Killers) అని పిలుస్తారు. ఇవి ఎక్కువ వాడితే.. సెక్స్‌పై (Sex) ఆసక్తి కోల్పోవడం, భావప్రాప్తి కలగకపోవడం, పురుషులలో అంగస్తంభన లోపం.. వంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు.
బర్త్ కంట్రోలింగ్ పిల్స్‌తోనూ (Birth Controlling Pills) ఇలాంటి సమస్యలే ఉంటాయ్. పిల్లలు పుట్టకుండా, గర్భాన్ని వాయిదా వేసే మాత్రలు మహిళల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయ్. స్టాటిన్స్ (Statins), ఫైబ్రేట్స్ (Fibrates) మందులను ప్రధానంగా అధిక కొలెస్ట్రాల్ (Cholesterol) చికిత్సకు ఉపయోగిస్తారు. అయితే వీటివల్ల సెక్స్ హార్మోన్ల (Sex Hormones) ఉత్పత్తి తగ్గిపోవచ్చు. ఈ మెడిసిన్స్ టెస్టోస్టెరాన్ (Testosterone), ఈస్ట్రోజెన్ (Estrogen), ఇతర సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిలో జోక్యం చేసుకోవచ్చు. పురుషుల్లో అంగస్తంభన సమస్యలకు ఇవి కారణమవుతాయని స్టడీలో తేలింది.
ఇక బెంజోడియాజిపైన్స్ అనే మత్తుమందులతోనూ ఇదే సమస్య. ఆందోళన, నిద్రలేమి, కండరాల నొప్పులకు చికిత్స చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. ఈ మందులు ఎక్కువగా వాడేవారికి సెక్స్‌లో సంతృప్తి లేకపోవడం, అంగస్తంభన సమస్యలు లాంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. బీపీ మందులు కూడా పడక సుఖానికి దూరం చేస్తాయని స్టడీలో గుర్తించారు. అధిక రక్తపోటుతో బాధపడేవారు శృంగార జీవితాన్ని ఆస్వాదించలేకపోవచ్చు. అలాగే హైబీపీకి వాడే మందులు.. మోతాదుకు మించితే.. అటు మహిళలకు, ఇటు పురుషులకు లైంగిక సమస్యలు తెచ్చిపెడతాయి.