Pm Modi Getup: గుజరాత్ లో ప్రధాని నరేంద్రమోదీని పోలినట్లుగా ఓవ్యక్తి

  • Written By:
  • Updated On - February 13, 2023 / 12:50 PM IST

సాధారణంగా సినిమాకు చెందిన కొందరు రీల్ హీరోలకు ధీటుగా డూప్ హీరోలను చూస్తూ ఉంటాం. వారి ప్రోగ్రాంలు వస్తే చాలు టీవీలకు అతుక్కొని పోయే సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. గతంలో ఇలా చాలా మంది ప్రాచుర్యం పోందారు. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ సినీ పరిశ్రమలో కూడా ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, దీపికా పదుకొనే వంటి డూప్ హీరో హీరోహిన్లను కూడా చూశాం. మన తెలుగులో ఉల్లసంగా ఉత్సాహంగా హీరోహిన్ స్నేహా ఉల్లాల్ ఐశ్వర్యారాయ్ లాగా ఉన్నారనే వార్తలు వినిపించాయి. అంతే కాకుండా క్రికెట్ ఆటగాడు కోహ్లీని పోలిన మనుషులు కూడా ఉన్నారు. ఈ వీడియోలన్నీ ఒకప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రెండింగా మారాయి. అయితే ఇప్పుడు రాజకీయ నాయకులకు సంబంధించిన వారిలాగా ఉండే వీడియోలు వెలుగులోకి రావడం ఆసక్తికరమైన విషయం. గతంలో చంద్రబాబు నాయుడుని పోలినట్లుగా ఓ వ్యక్తి హోటల్ లో సర్వ్ చేస్తూ కనిపించారు. ఆర్జీవీ ఇతనిని పిలిపించి లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో అవకాశం ఇస్తానని పిలిస్తే అతను ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు కథనాలు వినిపించాయి.

ఇప్పుడు మరోసారి ఇలాంటి వీడియోతో ఒకవ్యక్తి ట్రెండింగా మారారు. ఆయనే గుజరాత్ రాష్ట్రంలోని కి చెందిన ఆనంద్ జిల్లా వల్లభ్ విద్యానగర్‌కు చెందిన అనీల్ భాయ్ ఠక్కర్. ఇతను దేశప్రధాని నరేంద్రమోదీలాగా కనిపిస్తున్నారు. సైడ్ ఫేస్, డ్రస్సింగ్ స్టైల్ అంతా నరేంద్రమోదీని పోలినట్లుగా కనిపించడం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ఈయన పానీపూరీ వ్యాపారం చేస్తున్నారు. ప్రజలు ఈయన పానీపూరీకి ముగ్ధులైపోవడంతో నేను ఇక్కడే ఉండిపోయానని తెలిపారు. అంతేకాదు ఆయన ఛాయ్ వాలా అయితే నేను పానీపూరీ వాలా అంటూ పోలికలు కూడా చెప్పుకొచ్చారు. ఇతని షాప్ కి వచ్చి పానీపూరీ తినేవాళ్లు చెబుతూ ఉంటారట. కాకా మీరు పానీ పూరీ అమ్మడం వల్ల ఇక్కడే ఉండిపోయారు. అదే ఛాయ్ అమ్మి ఉంటే మీరు కూడా గొప్ప స్థానంలో ఉండేవారు అని. ఇతను 15 సంవత్సరాలుగా ఈ వ్యాపారాన్ని చేసుకొని జీవనం సాగిస్తున్నా అని చెప్పుకొచ్చారు. ఇతను ఈ వ్యాపారం ప్రారంభించినప్పుడు పావలాకి పానీ పూరీ ఇచ్చేవారట. ప్రస్తుతం పానీపూరీ, భేల్ పూరీ, దహీ పూరి, సేవ్ పూరీ, బాస్కెట్ చాట్ ఇలా ఐదురకాలా పూరీలను విక్రయిస్తున్నానని అన్నారు. ఈ వ్యాపారంలో కోటిరూపాయల ఆదాయం లభిస్తుందని చెప్పుకొచ్చారు.

ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే మోదీలాగా కనిపించడమే కాకుండా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారవడం. ఈవీడియోని ఇప్పటి వరకూ 82 లక్షల మంది చూడగా.. 6లక్షలకు పైచిలుకు లైకులు వచ్చాయి. దీంతో ఈయన పాపులర్ స్టార్ గా మారిపోయారు.