LPG Cylinder: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడ్డ పథకాల్లో గ్యాస్ సబ్సిడీ కూడా ఒకటి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.500లకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటూ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల్లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఈ స్కీమ్ ఎంతగానో ఆకట్టుకుంది. ఫలితంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఇచ్చిన మాట ప్రకారం 5 వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు అర్హులను ఎంపిక చేసే విధానాన్ని రూపొందించే పనిలో పడింది రేవంత్ సర్కార్.
CM Revanth Reddy : హరీష్, కేటీఆర్ ప్రజల రక్తపు కూడు తిన్నారు.
ఈ విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అటు పౌరసరఫరాల శాఖ కూడా సీఎంకు కీలక సూచనలు చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే పథకం అమలు చేస్తే బాగుటుందని సూచించింది. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి మాత్రమే పథకం అమలు చేసి.. కొత్త గ్యాస్ కనెక్షన్లు తీసుకునేవాళ్లకు నిలిపివేయాలని నిర్ణయించింది. మొదట రేషన్ కార్డులతో సంబంధం లేకుండా.. ప్రతీ ఒక్కరికీ పథకం అమలు చేయాలని భావించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈ ప్రక్రియ చాలా గందరగోళంగా ఉండటంతో రేషన్ కార్డునే పథకం అమలుకు ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే చాలా మంది కమర్షియల్ గ్యాస్‌లకు బదులు వ్యాపారాల్లో డొమెస్టిక్ సిలిండర్లను వాడుతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్లపై లిమిట్ విధించబోతున్నట్టు సమాచారం.
సంవత్సరానికి ఆరు గ్యాస్‌సిలిండర్లు ఇవ్వాలా లేక 12 ఇవ్వాలా అన్న విషయంలో అధికారులతో చర్చించారు సీఎం. దీనికి సంబంధించి కూడా త్వరలోనే అధికారికి ప్రకటన రాబోతోంది. ఇక డిసెంబర్ 28 నుంచి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలో అమలు చేసే ప్రతీ పథకానికి.. దాదాపుగా ఈ రేషన్ కార్డులే ప్రామాణికం కాబోతున్నాయి.