ఒకటి రెండు కాదు.. 75 ఏళ్లు.. అక్షరాల 75 ఏళ్లు దాటింది ఆ గుడిలోని దేవత పూజలు అందుకొని. ఇదేదో వేరే దేశంలో ఉన్న హిందూ దేవాలయం కాదు. మన దేశంలో.. పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకున్ పీవోకేలో ఉన్న శారదాపీఠం. వందల ఎళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయంపై రెండు సార్లు దాడి జరిగింది. 14 శతాబ్ధంలో సికిందర్ అనే రాజు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నప్పడు ఈ దేవాలయంపై దాడి చేశాడు. ఆ తరువాత గుడిని మళ్లీ నిర్మించారు.
1948లో కశ్మీర్‌ను పాకిస్థాన్ ఆక్రమించుకున్నప్పుడు ఈ గుడి పీవోకేలో కలిసిపోయింది. కేవలం ఆక్రమించుకోవడమే కాకుండా బాంబులు వేసి గుడిని ధ్వంసం చేసింది పాకిస్థాన్. అప్పటి నుంచి పాడుబడ్డ శిలలా మిగిలిపోయింది ఈ గుడి. దీన్ని పట్టించుకున్నవాళ్లు లేరు. దేవతకు పూజలు చేసినవాళ్లు లేరు. ఏళ్ల నుంచి జీవచ్ఛంలా పడిఉన్న ఈ గుడికి ఇప్పుడు పూర్వ వైభవం వచ్చింది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ గుడిని తిరిగి నిర్మించాలని నిర్ణయించింది బీజేపీ ప్రభుత్వం. స్వయంగా పీవోకే కు అధికారులను పంపి గుడి పునఃనిర్మాణాన్ని ప్రారంభించింది.
పాకిస్థాన్ నుంచి ఎలాంటి ఒత్తిడి వచ్చినా పట్టించుకోకుండా గుడి నిర్మాణం పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ రక్షణ కల్పించింది. ఏళ్ల నాటి చరిత్ర ఉన్న ఈ దేవాలయంలో మళ్లీ పూజలు మొదలయ్యాయి. మొదటి పూజ ప్రధాని నరేంద్ర మోదీ చేశారు. దేవీ నవరాత్రుల సందర్భంఆ ప్రస్తుతం ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శత్రుచెరలో ఉన్న దేవాలయాన్ని మళ్లీ నిర్మించాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తున్నాయి.