Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిర గర్భ గుడి ఇదే.. చూసేందుకు రెండు కళ్లు చాలవు..

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిర నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇక రామమందిరం ప్రారంభోత్సవం తేదీ కూడా ఖరారైపోయింది. వచ్చే ఏడాది జనవరి 22న దేవతామార్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి.. ఆలయాన్ని ప్రారంభించబోతున్నారు.

  • Written By:
  • Updated On - January 12, 2024 / 11:00 AM IST

Ayodhya Ram Temple: బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన కీలక అంశాల్లో ఒకటి అయోధ్య రామమందిర నిర్మాణం. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిర నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇక రామమందిరం ప్రారంభోత్సవం తేదీ కూడా ఖరారైపోయింది. వచ్చే ఏడాది జనవరి 22న దేవతామార్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి.. ఆలయాన్ని ప్రారంభించబోతున్నారు. అలాగే ఈ ఆలయ ప్రారంభోత్సవానికి రావాలంటూ ప్రధాని మోదీని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు కలిసి ఆహ్వానాన్ని కూడా అందించారు.

Seethakka: హరీష్ రావుకు మంత్రి సీతక్క మాస్‌ కౌంటర్

ప్రధాని మోదీ కూడా వారి ఆహ్వానాన్ని ఆనందంగా అంగీకరించారు. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌, కోహ్లీ, అమితాబ్‌ లాంటి ప్రముఖులను కూడా ఈ ప్రారంభోత్సవానికి వస్తున్నారు. దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఈ రామ మందిరానికి సంబంధించిన ఓ ఫొటో బయటకు వచ్చింది. ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ ఆలయ గర్భగుడి ఫొటోను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ట్విటర్‌లో షేర్ చేశారు. గర్భగుడిలో లైటింగ్ పనులతో సహా అన్ని పనులూ దాదాపు పూర్తయ్యాయంటూ చెప్పారు. ఈ విషయాన్ని అందరితో పంచుకునేందుకు చాలా సంతోషంగా ఉందంటూ రెండు ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి.

అయోధ్యలోనే 3 శిల్పుల బృందాలు, 3 వేర్వేరు ప్రదేశాలలో రాముడి విగ్రహాన్ని చెక్కుతున్నాయి. ఈ మూడింటిలో ఏ విగ్రహం బాగుంటే ఆ విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించబోతున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ధర్మకర్తలు విగ్రహాన్ని ఎంపిక చేస్తారు. 22 జనవరి 2024, పౌస శుక్ల పక్ష ద్వాదశి తేదీన, అభిజిత్‌ ముహూర్తంలో విగ్రహాన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రతిష్టించబోతున్నారు.