RAIN ALERT: ఇన్నాళ్లూ జాడలేకుండా పోయిన వరుణుడు.. మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్నాడు. హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచేత్తుతోంది. పిడుగులు కూడా పడే చాన్స్ ఉంది. ఈ అంశంపై వాతావరణ శాఖ అధికారులు తాజాగా హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే నగరం మొత్తం వర్షం మొదలుకాగా.. నెలాఖరు వరకు ఈ వానలు కొనసాగే అవకాశాలు ఉన్నాయ్. వానల మధ్యలోనే గణేష్ నిమజ్జనం జరగనుంది. సెప్టెంబరు 28న నాడు గణేష్ నిమజ్జనం జరగనుంది.
హైదరాబాద్‌లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ హెచ్చరిక సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికితోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో అక్టోబర్ 1వరకు రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయ్. ఈ సర్క్యులేషన్ వల్ల గురు, శుక్ర, శనివారాల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా. రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, వికారాబాద్, సిద్దిపేట, యాదాద్రి, వనపర్తి, జనగాం సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వానలు కురిసే చాన్స్ ఉంది.
జనాలు అప్రమత్తంగా ఉండాలని, రాబోయే వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు కోరారు. గణేష్ నిమజ్జనం రోజు సమీపిస్తున్నందున నిర్వాహకులు పాల్గొనే వారందరి భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇందులో వాతావరణ అప్‌డేట్‌లను పర్యవేక్షించడం, నీటితో నిండిన ప్రాంతాల వైపు వెళ్లకపోవడం, స్థానిక అధికారులు జారీ చేసే ఏవైనా సలహాలు లేదా హెచ్చరికలను అనుసరించడం వంటివి ఉంటాయ్.