RAIN ALERT: తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడతాయని చెప్పింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పిన వాతావరణ శాఖ అధికారులు.. ఒకటి రెండు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం కూడా ఉందని తెలిపారు.
YS JAGAN: ఎంపీ రఘురామ పిటిషన్‌పై సీఎం జగన్‌కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్‌లోనూ వచ్చే 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పగటి ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని.. రాత్రి కూడా చలి తీవ్రత తక్కువగానే ఉంటుందని అన్నారు. ఈనెల 26 వరకు వర్షాలు ఉంటాయని, భారీ వర్షాలకు మాత్రం ఆస్కారం లేదని వివరించారు. ఏపీ తీరంలోని కొమరెన్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు నిన్న తూర్పుగాలులకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వైపు తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయ్. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
25న రాష్ట్రంలో తేలికపాటి నుంచి నుంచి కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఇక అటు హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలో ఉదయం పూట పొగమంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 21 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు ఉండదని, రాత్రి కూడా చలి తక్కువగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు.