Amphibious vehicle : నేలపై కారులా.. నీటిలో పడవలా సాగిపోదాం.. ( ఉభయచర వాహనం )

మీరు ఎప్పుడైనా ఒకే వాహనంలో భూమి నుండి నేరుగా నీటి రవాణా సౌకర్య అనుభూతిని పొందారా.. అసలు అలాంటి వాహనం ను ఎప్పుడైనా చూశారా.. అయితే ఇప్పుడు చూడబోతున్నారు.. వాహనం ఎక్కి విహరించబోతున్నారు.

సీల్వాన్‌లు భూమిపై, నీటిలో ప్రయాణించగల ఒక ఉభయచర వాహనం. ఇది భూమిపై క్యాంపింగ్ చేసే అవకాశం, బాహ్య ఇంజిన్‌తో నీటిలో ప్రయాణించే ఆనందం రెండింటినీ అందిస్తుంది. అంటే ఇంత వరకు మనం చెరువు వరకు.. సరస్సు వరకు.. నది వరకు.. సముద్రం వరకు.. వెళ్లాము. అక్కడి నుంచి మరో వాహనం బోటు సహయంతో నీటిపై తేలుతు విహరించాము.. కానీ ఇప్పుడు అలా కాదండోయ్.. నేరుగా భూమిపై నుంచి నీటి పైకి వెళ్లబోతున్నాం. ఏంటి నమ్మట్లేదు కాదు అందుకే నేరుగా చూపించేస్తున్న..

మీరు ఎప్పుడైనా ఒకే వాహనంలో భూమి నుండి నేరుగా నీటి రవాణా సౌకర్య అనుభూతిని పొందారా.. అసలు అలాంటి వాహనం ను ఎప్పుడైనా చూశారా.. అయితే ఇప్పుడు చూడబోతున్నారు.. వాహనం ఎక్కి విహరించబోతున్నారు.

ఇది రోడ్డు మీద పరుగులు తీసేటప్పుడు వ్యాను. నీటిలో ప్రయాణించేటప్పుడు బోటు. నేల మీదనే కాదు నీటిలోనూ ప్రయాణించగల ఉభయచర వాహనం ఇది. జర్మనీకి చెందిన వాహనాల తయారీ సంస్థ సీల్ వ్యాన్స్ ఈ విచిత్ర ఉభయచర వాహానాన్ని రూపొందించింది. నేల మీద పరుగులు తీసేటప్పుడు ఇది 50 హార్స్ పవర్ హోండా మోటారు సాయంతో పనిచేస్తుంది. నీటిలో ప్రయాణించేటప్పుడు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ తో పనిచేస్తుంది. ఇది 4.20 మీటర్ల మోడల్ లోనూ .7.50 మీటర్ల మోడల్ లోను దొరుకుతుంది.

దీంతో ఎంత మంది ప్రయాణిస్తారు..?

సీల్ వ్యాన్స్ 4.20 మీటర్ల వాహనంలో ఇద్దరు ప్రయాణించడానికి వీలవుతుంది. ఇక 7.50 మీటర్ల మోడల్ లో ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

ఇంటి సౌకర్యంతో.. ఉభయచర వాహనం

ఈ వాహనంలో ఇంట్లో ఉన్నట్లు ఓ వంటగది సౌకర్యం ఉంది. మీకు చలువ పంటను అక్కడే క్షణలో తయారుచేసుకునే రూపొందించారు. అంతేకాకుండా వాటిని నిల్వ చేయడానికి ఫ్రిజ్ కూడా ఉంది. మీరు ప్రకృతిని ఆస్వాదించినప్పుడు అడవి/సముద్ర వీక్షిస్తున్నప్పుడు.. మీ భోజనాన్ని మీరే సిద్ధం చేసుకోవచ్చు. ఆనందంగా గడపవచ్చు. ఇది ఒక విలాసవంతమైన బోట్ కారవాన్, ఇది రాత్రిపూట రెండు వేర్వేరు బెడ్‌రూమ్‌లుగా విభజించబడుతుంది. మ్యూచువల్ డైనింగ్ ఏరియా, సిట్టింగ్ ఏరియా, నలుగురు వ్యక్తులు హాయిగా విహరించవచ్చు. స్త్రీలు స్నానం చేయుటకు విశాలమైన బాత్రూం కూడా నిర్మించారు. దీంతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని మీరు పొందవచ్చు.

వెంటిలేషన్ సౌకర్యం..

మనం ఎక్కడికైనా విహారయాత్రకు వెళితే అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ.. పగటి పూట పచ్చని ప్రకృతిని విక్షిస్తాము.. అంతేనా రాత్రి సమయంలో ఆ ఆకాశాన్ని చూస్తూ ఉండిపోతాము. అసలు ప్రకృతి ని చూసేదే రాత్రి సమయంలో అప్పడు మనం కూర్చున్న నోటు నుంచే చూస్తే ఏలా ఉంటుంది. ఆ సౌకర్యం కూడా ఇందులో ఏర్పాటు చేశారు. అదే రూప్ టాప్ వెంటిలేషన్.. ఈ వాహనం పై ఉన్న కిటికీని పూర్తిగా తెరిచి చూస్తే ఆకాశం అద్భుతాలు మన కంటికి కనిపిస్తాయి. అలాగే ఉదయం వచ్చే ఆ లేత కిరణాలను చూసేందుకు ఈ వాహనానికి చిన్న చిన్న కీటికిలు కూడా ఉన్నాయి.

దీనికి లైసెన్స్ అవసరం ఉందా..?

యూరోప్ లో దీనికి లైసెన్స్ అవసరం లేదు. వాహనబీమా తప్పనిసరి కాదు. నీటిలో ఇద గంటకు 13 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. దీని ధర మోడల్ బట్టి మారుతుంది. 30,500 డాలర్లు (రూ.25.25 లక్షలు) ఉంటుంది. 63.800 డాలర్లు అంటే మన దేశంలో ( రూ.49.86 లక్షలు ) వరకు దీని ధర ఉంటుంది.
ఈ వాహనం కావాలంటే మనం కూడా ఇండియా తెప్పించుకోవచ్చు. కానీ అందుకు అదనపు ఖర్చులు అవుతాయి. ఇంత వరకు అక్కడ వీటికి ఎలాంటి లైసెన్స్ లేదు గానీ ఇక్కకికొచ్చేసరికి (భారత్) వాటికి లైసెన్స్ అవసరం ఉంటుంది. మరీ ఎందుకు అలస్యం ప్రకృతి ప్రేమికుల, ఒక్కసారి ఈ వాహనంను ట్రై చేసి చూడండి.

మోడల్ ఇప్పుడు మీరు సెలవు కోసం మీ ఇంటి నుండి బయలుదేరినప్పుడు మీ కొత్త సూట్‌కేస్ అవుతుంది. అందమైన సరస్సు దగ్గర, సరస్సుపై, అడవిలో క్యాంప్‌ సైట్‌లో అద్భుతమైన వీక్షణను ఆస్వాదిస్తూ చక్కని వారాంతం గడపడానికి మీరు సిద్ధం అవ్వండి. మీరు చేయాల్సింది ఒక్కటే లాంగ్ లీవ్ తీసుకోండి ఇండియా మ్యాప్ గాని.. మీ రాష్ట్రం మ్యాప్ గాని తీసుకొని అందులో మీకు నచ్చిన ప్లేస్ ను ఎంపిక చేసుకోని.. వెల్లండి. ప్రకృతి జలాలు మీ కోసం వేచి ఉన్నాయి.

S.SURESH