SANKRANTHI BANGLES: ఒక్క కొడుకు తల్లి.. ఇద్దరు కొడుకుల తల్లి దగ్గర గాజులు తీసుకోవాలా.. సంక్రాంతికి నిజంగానే కీడు ఉందా..?

ఒక్క కొడుకు ఉన్న మహిళలు.. ఇద్దరు కొడుకులు ఉన్న తల్లుల దగ్గర డబ్బులు అడుక్కొని.. గాజులు వేసుకోవాలని ప్రచారం జరుగుతోంది. పల్లెలు, పట్టణాలన్న తేడా లేకుండా.. ఇప్పటికే ఈ ప్రచారం ప్రతీ ఇంటికీ చేరింది.

  • Written By:
  • Publish Date - January 9, 2024 / 06:07 PM IST

SANKRANTHI BANGLES: సంక్రాంతి పండగకు తెలుగు రాష్ట్రాలు సిద్ధం అవుతున్నాయ్. ఏపీలో అయితే మరింత భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయ్. ఇలాంటి సమయంలో ఓ ప్రచారం మాత్రం.. తల్లులను భయపెడుతోంది. ఈ సంక్రాoతి పండుగకు గాజుల గండం దడ పుట్టిస్తోంది. ఊహించని విధంగా మహిళలు.. గాజుల దుకాణాల వైపు పరుగులు పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. త్వరలో సంక్రాంతి పండుగ రాబోతున్న వేళ కొత్త పుకార్లు జోరందుకున్నాయ్.

REVANTH REDDY: ఇదీ రేవంత్‌ అంటే.. కానిస్టేబుల్‌ భార్యకు ఉద్యోగం.. ఇది కదా ప్రజా పాలన అంటే..

ఒక్క కొడుకు ఉన్న మహిళలు.. ఇద్దరు కొడుకులు ఉన్న తల్లుల దగ్గర డబ్బులు అడుక్కొని.. గాజులు వేసుకోవాలని ప్రచారం జరుగుతోంది. పల్లెలు, పట్టణాలన్న తేడా లేకుండా.. ఇప్పటికే ఈ ప్రచారం ప్రతీ ఇంటికీ చేరింది. దీంతో ఇద్దరు కొడుకులు ఉన్న తల్లుల దగ్గరకు.. ఒక్క కొడుకున్న తల్లులు పరుగులు పెడుతున్నారు. వారి దగ్గర డబ్బులు తీసుకొని గాజులు వేసుకొని కీడు తొలగిపోవాలని వేడుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి కీడు వచ్చిందని అందుకోసమే ఒక్క కొడుకు ఉన్న మహిళలు, ఇద్దరు.. అంతకంటే ఎక్కువమంది కొడుకులు ఉన్న మహిళల దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలని.. ఆ డబ్బుతో వారు ఐదు రకాల గాజులు కొనుక్కుని వాటిని వేసుకోవాలని ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి పండుగలోపు ఐదు రకాల గాజులు ధరించాలని.. లేకుంటే చెడు తప్పదనే ప్రచారం సోషల్‌ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అలా తాము ధరించిన గాజులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఏమీ తెలియని వాళ్లు ఇలా చేస్తున్నారంటే ఏదో అనుకోవచ్చు. బాగా చదువుకున్న వాళ్లు కూడా కీడు భయంతో ఇదే ఫాలో అవుతున్నారు. పెద్దలు చెప్పిన సాంప్రదాయాన్ని ఆచరించాల్సిందే అంటున్నారు.

ఐతే ఇవన్నీ మూఢ నమ్మకాలని.. ఎవరూ పాటించాల్సిన అవసరం లేదని.. వేద పండితులు, పురోహితులు సూచిస్తున్నారు. పండుగలకు కీడు వస్తుందని.. ఇలాంటి గాజులు ధరిస్తే ఆ కీడు పోతుందని ఏ శాస్త్రంలో లేదని కొట్టి పారేస్తున్నారు. ఇదంతా ఎవరో కావాలని చేసిన ప్రచారమని కొట్టి పారేస్తున్నారు. అలా చేయాలని జ్యోతిష్యంలో ఎక్కడా లేదని వివరిస్తున్నారు. ఇలాంటి భయాందోళనలు ఏవీ పెట్టుకోవద్దని అంటున్నారు. కొందరు వ్యాపారులు తమ స్వలాభం కోసమే ఇలా పుకార్లు పుట్టించారనే టాక్‌ వినిపిస్తోంది.