SMART PHONE: లేవగానే మొబైల్ చూస్తున్నారా..? ఆ రోజు ఏమవుతుందో తెలుసా ?

బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక ఈ సర్వేను బయటపెట్టింది. పొద్దున లేస్తూనే మొబైల్ చూడటమే కాదు.. రోజులో మెలకువ ఉన్న టైమ్‌లో 31శాతం స్మార్ట్ ఫోన్‌తోనే గడుపుతున్నారు. రోజుకు సగటున 80 సార్లు కస్టమర్లు తమ మొబైల్స్ చెక్ చేస్తున్నట్టు సర్వేలో తేలింది.

  • Written By:
  • Updated On - February 17, 2024 / 01:39 PM IST

SMART PHONE: కొందరు అర్థరాత్రి దాకా మేల్కొని ఉండి, అదే పనిగా మొబైల్ చూస్తూనే నిద్రపోతారు. ఇక.. పొద్దున లేచీ లేవగానే మళ్లీ స్మార్ట్ ఫోన్‌ను తెగ చూస్తున్నారు. ఇలా నిద్ర లేచిన పావు గంటలో 84శాతం మంది స్మార్ట్ ఫోన్ చూస్తున్నారట. ఇది ఏదో ప్రపంచానికి చెందిన సర్వే కాదు. మన భారత్‌కు చెందినదే. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక ఈ సర్వేను బయటపెట్టింది. పొద్దున లేస్తూనే మొబైల్ చూడటమే కాదు.. రోజులో మెలకువ ఉన్న టైమ్‌లో 31శాతం స్మార్ట్ ఫోన్‌తోనే గడుపుతున్నారు.

Baba Vanga: ఈ ఏడాది భయానకం.. ప్రపంచమంతా చీకట్లు! నీళ్ళుండవ్ ! వంగా చెప్పింది జరుగుతుందా..?

రోజుకు సగటున 80 సార్లు కస్టమర్లు తమ మొబైల్స్ చెక్ చేస్తున్నట్టు సర్వేలో తేలింది. కంటెంట్ స్ట్రీమింగ్ చేయడానికి దాదాపు 50శాతం మంది వాటిని వాడుతున్నారు. 2010లో స్మార్ట్ ఫోన్ ను రోజుకు 2 గంటలు మాత్రమే గడిపితే.. కానీ ఇప్పుడు దాదాపు 5 గంటల దాకా వాడుతున్నారు. గతంలో స్మార్ట్ ఫోన్లను మాట్లాడటానికి, టెక్ట్స్ మెస్సేజ్‌లు చేయడానికే ఎక్కువ ఉపయోగించారు. కానీ ఇప్పుడు మాత్రం సెర్చింగ్, గేమింగ్, షాపింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు, వార్తల కోసం ఎక్కువగా వాడుతున్నారని సర్వే చెబుతోంది. ఇక 18-24 యేళ్ళ యూత్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ లాంటి చిన్న వీడియోలపై ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. నిద్ర లేవగానే.. కళ్ళు తెరవగానే.. మొబైల్ చూడటం వల్ల దాని ప్రభావం ఆ రోజంతా ఉంటుందని అంటున్నారు వైద్య నిపుణులు. నిద్ర లేవగానే.. పాజిటివ్ వైబ్రేషన్స్‌కి బదులు నెగిటివ్ థాట్స్ పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. పొద్దున్నే మొబైల్ చూస్తే.. మనస్సు ఆందోళనతో నిండిపోతుంది.

దాని ప్రభావం మెదడుపై పడుతుంది. మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రోజంతా కూడా పరధ్యానంగా ఉండిపోతారని అంటున్నారు. అంటే మూడీ మోడ్‌లోకి వెళ్ళిపోతారట. స్మార్ట్ ఫోన్లు ఎక్కువసేపు చూడటం వల్ల కళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. నెక్ సిండ్రోమ్, అధిక బరువు, నిద్రలేమి లాంటి సమస్యలు తలెత్తుతాయని స్టడీస్ చెబుతున్నాయి. ఫోన్ వాడితే క్యాన్సర్, ట్రాఫిక్ యాక్సిడెంట్స్, విద్యుదయస్కాంత వికిరణాలు, మెదడు కార్యకలాపాల్లో మార్పులు, నిద్ర విధానాలు లాంటి వాటిపై ఎలా ప్రభావం పడుతుంది అన్నదానిపైనా పరిశోధకులు స్టడీ చేస్తున్నారు. అందుకే నిద్రపోయే ముందు.. నిద్ర లేచాక కూడా స్మార్ట్ ఫోన్ అస్సలు చూడవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు.