Underwater Drone : గాల్లో ఎగిరే డ్రోన్ కాదండోయ్.. నీటిలో సుయ్ సుయ్ అని ఈదే డ్రోన్ ఇది..

డ్రోన్ ఇంతవరకు డ్రోన్ అంటే గాలిలో ఎగిరేది .. ఫోటోస్, విడియోస్ తిసేది, పంట పోలాల్లో మందలు చల్లేవి, ఆర్టీలో పనిచసే డ్రోన్ గురించి ఇన్నాలు విన్మారు.. చూశారు. ఇప్పుడు మీరు వినబోయేది, చూడబోయేది.. అలాంటి ఇలాంటి డ్రోన్ కాదు. నీటిలో చేపలాగ ఇదే డ్రోన్.. పక్షిలా గాలిలో విహరిస్తూ ఫొటోలూ, వీడియోలూ తీసే డ్రోన్‌లనే మనం చూశాం. కానీ నీటిలో చేపలా ఈదుతూ అక్కడి అందాలను బంధించే డ్రోన్‌లూ ఇప్పుడు వస్తున్నాయి.

డ్రోన్ ఇంతవరకు డ్రోన్ అంటే గాలిలో ఎగిరేది .. ఫోటోస్, విడియోస్ తిసేది, పంట పోలాల్లో మందలు చల్లేవి, ఆర్టీలో పనిచసే డ్రోన్ గురించి ఇన్నాలు విన్మారు.. చూశారు. ఇప్పుడు మీరు వినబోయేది, చూడబోయేది.. అలాంటి ఇలాంటి డ్రోన్ కాదు. నీటిలో చేపలాగ ఇదే డ్రోన్.. పక్షిలా గాలిలో విహరిస్తూ ఫొటోలూ, వీడియోలూ తీసే డ్రోన్‌లనే మనం చూశాం. కానీ నీటిలో చేపలా ఈదుతూ అక్కడి అందాలను బంధించే డ్రోన్‌లూ ఇప్పుడు వస్తున్నాయి.

చైనీస్ తయారీదారుడు యూకాన్ ఆవిష్కరణ ఈ డ్రోన్ రిమోట్..

చైనీస్ తయారీదారు యూకాన్ రోబోటిక్స్.. పారిశ్రామిక బలం ఓమ్నిడైరెక్షనల్ అండర్ వాటర్ డ్రోన్, ఓషన్ ఐ ని ఆవిష్కరించింది. ప్రోస్యూమర్-ఓరియెంటెడ్ BW స్పేస్ ప్రో అండర్ వాటర్ డ్రోన్‌ ‘ఓషన్‌ఐ’ పేరుతో యు కేన్‌ రోబోటిక్స్‌ సంస్థ రూపొందించింది.

ఓషన్ ఐ డ్రోన్ ప్రత్యేక ఏమిటంటే.. పెద్ద పెద్ద మహా సముద్రపు నీటి అడుగున కు వెళ్లి అక్కడి నీటి ఒత్తిడిని సైతం తట్టుకుని దీనికి ఉన్న 4కె రిజల్యూషన్ కెమెరాతో పాటు, హై లో బీమ్ ల ఎల్ యీడీ లైట్లతో చీకటి ప్రదేశాల్లో కి వెల్లి అక్కడి మసక మసక గా ఉన్న దృశ్యాలను స్పష్టంగా తీసి పంపిస్తుంది. ఈ డ్రోన్ ను మనం నీటి ఒడ్డున ఉండి జాయ్ స్టిక్ లాంటి రిమోట్ సాయంతో నియంత్రిచవచ్చు. 360 డిగ్రీల కోణంలో డ్రోన్ తిరిగి కావలసిన ఫుటేజీని చిత్రికరించి మనకు పంపిస్తుంది. ఇందులో 64 జీబీ మెమరీ ఉంటుంది.

‘ఓషన్‌ఐ’ డ్రోన్ ప్రత్యేకతలు..

‘ఓషన్‌ఐ’ యొక్క అత్యంత ప్రత్యేక లక్షణాలలో ఒకటి దాని నాలుగు థ్రస్ట్-వెక్టరింగ్ మోటార్ పాడ్‌లు. (దాని కాళ్లు) డ్రోన్‌కు 360-డిగ్రీల తిరిగే ఫీచర్ ఉంది. దానికి ఉన్న ఎనిమిది మోటార్‌ల కోసం ప్రతి ఒక్కటి దానికి ఎదురుగా రెండు మోటార్‌లను కలిగి ఉంటుంది. క్రాఫ్ట్ సెకనుకు 2 మీటర్లు (6.6 అడుగులు) టాప్ ఫార్వర్డ్ వేగంతో లోపలికి వెలుతుంది. 100 మీటర్లు నుంచి 328 అడుగులు లోతు వేళ్లే విధంగా డ్రోన్ తయారు చేశారు. నీటి నుండి బయటకు వచ్చినప్పుడు, డ్రోన్ 5.6 కిలోల (12.3 పౌండ్లు) బరువు ఉంటుంది. ఈ డ్రోన్ -10 నుండి 40 ºC (14 నుండి 104 ºF) వరకు నీటి ఉష్ణోగ్రతలలో తట్టుకోగలుగుతుంది. దాని 10,000-mAh లిథియం బ్యాటరీ యొక్క ఒక ఛార్జ్ 30 నిమిషాల నుండి ఒక గంట రన్‌ టైమ్ వరకు ఉంటుందని.. అంతవరకు ఎలాంటి అంతరాయం లేకుండా పని చేస్తుంది అని తెలిపారు.

డ్రోన్ ద్వారా నీటి అడుగున అన్వేషణలు..

UAV డ్రోన్ నీటి అడుగున భూభాగాల సర్వేలు చేయడానికి ఎంతో ఉపయోగం పడుతుంది. చమురు గ్యాస్ పైప్‌లైన్ తనిఖీలు, వంతెన, డ్యాం తనిఖీలు, నౌకాశ్రయ తనిఖీలు, హల్ ఫౌలింగ్ తనిఖీలు, నీటి అడుగున రెస్క్యూ, నది, సరస్సు పర్యవేక్షణ, నీటి అడుగున ఉన్న వస్తువులను తిరిగి పొందడం, ఉపయోగ పడుతుంది. అంతే కాకుండా సముద్రంలో అరుదైన మత్స్య సంపదను గుర్తించడం కోసం, అరుదైన జంతు జాలం గుర్తించడం కోసం మనుషులు వెళ్లలేని చీకటి ప్రాంతాలకు వెళ్లి అక్కడ అన్వేషణ చేసి మనకు కావలిసిన సమాచారం అందిస్తుంది.

ఈ డ్రోన్ ధర ఎంత..?

‘ఓషన్‌ఐ’ అండర్ వాటర్ డ్రోన్‌  Youcan Robotics website  వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. నలుపు /ఆరెంజ్ కలర్ లో డ్రోన్ అందుబాటులో ఉన్నాయి – 4k ప్రైమ్ లెన్స్ వేరియంట్ ధర US$5,499, 4k జూమ్ లెన్స్ వేరియంట్ ధర US$5,999. వరకు ధరలు ఉన్నాయి. ధర రూ.4.6 లక్షలు.. ఖరీదు చేయవచ్చు.

S.SURESH