BIGG BOSS 7: మీ మట్టి బిడ్డ.. మీ కూలి బిడ్డ.. రేయ్‌ ఎవర్రా మీరంతా..

పల్లవి ప్రశాంత్‌ కామన్‌మ్యాన్‌ అనే సెంటిమెంట్‌తో కొట్టి టైటిల్‌ గెలుచుకున్నాడు. రైతు బిడ్డ.. రైతు బిడ్డ అంటూ.. సెలబ్రిటీస్‌ని కూడా పక్కకు నెట్టి విజేతగా నిలిచాడు. దీంతో ఇప్పుడు చాలా మంది పల్లవి ప్రశాంత్‌నే ఫాలో అవుతున్నారు.

  • Written By:
  • Publish Date - December 22, 2023 / 04:38 PM IST

BIGG BOSS 7: తెలుగులో ఇప్పటి వరకూ వచ్చిన బిగ్‌బాస్‌ సీజన్స్‌ అన్నిటిలో సీజన్‌ 7 చాలా ప్రత్యేకం. గేమ్‌ పరంగానే కాదు.. సీజన్‌ కంప్లీట్‌ అయ్యాక కూడా.. స్టేట్‌లో ఈ సీజన్‌ సెట్‌ చేసిన ఫైర్‌ అంతా ఇంతా కాదు. సీజన్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ కామన్‌మ్యాన్‌ అనే సెంటిమెంట్‌తో కొట్టి టైటిల్‌ గెలుచుకున్నాడు. రైతు బిడ్డ.. రైతు బిడ్డ అంటూ.. సెలబ్రిటీస్‌ని కూడా పక్కకు నెట్టి విజేతగా నిలిచాడు.

PALLAVI PRASHANTH: అందుకే అరెస్ట్ ! చేసిందంతా పల్లవి ప్రశాంతే !

దీంతో ఇప్పుడు చాలా మంది పల్లవి ప్రశాంత్‌నే ఫాలో అవుతున్నారు. ప్రశాంత్‌ టైటిల్‌ కొట్టగా లేనిది.. మేం జస్ట్‌ షో వరకు వెళ్లలేమా అనుకుంటున్నారో ఏమో.. వరుసబెట్టి ఇన్‌స్టాగ్రాంలో రీల్స్‌ చేస్తున్నారు. ఒకడు మట్టి బిడ్డ అంటే.. ఇంకొకకు కూలి బిడ్డ అంటూ స్క్రీన్‌ ముందు కమల్‌ హాసన్‌ రేంజ్‌ పర్మార్మెన్స్‌ ఇస్తున్నారు. మేం కూడా బిగ్‌బాస్‌కు వెళ్లి మా జీవితాలు మార్చుకుంటాం మాకు అవకాశం ఇవ్వండి అంటూ ఆడియన్స్‌ను కోరుతున్నారు. వీళ్ల రీల్స్‌ నచ్చి కామెంట్స్ చేస్తున్నారో.. లేక సరదాకి వాళ్లను చెట్టెక్కిస్తున్నారో తెలియదు కానీ.. నెటిజన్లు కూడా వీళ్లకు మంచి రెస్పాన్స్‌ ఇస్తున్నారు. మీలాంటి వాళ్లు ఇక్కడ ఉండకూదు.. మీరు కూడా బిగ్‌బాస్‌కి వెళ్లి మీరేంటో ప్రపంచానికి తెలిసేలా చేయాలి అంటూ వాళ్లను ఎంకరేజ్‌ చేస్తున్నారు. ఒకప్పుడు బిగ్‌బాస్‌ రేంజ్‌ వేరేలా ఉండేది.

బిగ్‌బాస్‌ అంటేనే సెలబ్రిటీ గేమ్‌ షో. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి అది కాదు. సోషల్‌ మీడియాలో ఎవరు వైరల్ ఐతే వాళ్లు బిగ్‌బాస్‌కు వెళ్లిపోతున్నారు. కాదు కాదు.. వాళ్లనే బిగ్‌బాస్‌ మేనేజ్‌మెంట్‌ సెలెక్ట్‌ చేస్తోంది. టీఆర్పీ కోసం వాళ్లతోనే గేమ్‌ ఆడిపిస్తున్నారు కూడా. అందుకే బిగ్‌బాస్‌కు వెళ్లాలి అనుకునేవాళ్లు ముందు సోషల్‌ మీడియాలో ఫేమ్‌ పెంచుకుంటున్నారు. కామన్‌ మ్యాన్‌ కూడా బిగ్‌బాస్‌కు వెళ్తే మంచిదే. కింది స్థాయి నుంచి సెలబ్రిటీ స్థాయికి వెళ్తే సంతోషమే. కానీ.. బిగ్‌బాస్‌ కోసమే పుట్టాం అన్నట్టుగా కెరీర్‌లు పాడు చేసుకుంటేనే అసలు సమస్య.