ప్రపంచ దేశాలన్నీ యుద్దాలు, అభివద్ది, ఆర్థిక వ్యవస్థ బలోపేతం, పారిశ్రామికీకరణ అంటూ ముందుకు అడుగులు వేస్తున్నాయి. అయితే వివాహం అనేది జీవితంలో పెద్ద చిక్కుగా భావిస్తున్నారు దక్షిణ కొరియా దేశీయులు. దీనికి కారణం ఇటీవలె కాలంలో పెళ్లి చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పడిపోయిందట. ఇదే ఇక్కడి ప్రదాన సమస్యగా చెబుతున్నారు. దీని ప్రభావం జనాభా మీద పడబోతుందని గణాంకాలు సూచిస్తున్నాయి. అసలు ఈ లెక్కలు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అనే అనుమానం మీలో కలుగవచ్చు. ఒకప్పుడు జనాభాను, ప్రస్తుత జనాభాను దశాబ్దాల కాలంతో పోల్చి చూసినప్పుడు క్రమక్రమంగా దక్షిణ కొరియా జనాభా తగ్గుతూ వస్తోందట. ఇలా జనాభా తగ్గుదలకు ప్రధాన కారణం పెళ్లి చేసుకోకకపోవడం. ఇక్కడి యువతీ యువకులు మూడు పదుల వయసు దాటినప్పటికీ పెళ్లికి ఆసక్తి చూపించడం లేదు. దీనికి వారి నుంచి వచ్చిన కారణాలు చాలానే ఉన్నాయి. వీరి కారణాలు తెలుసుకునే ముందు దేశంపై ఎలా ప్రభావం చూపిస్తుందో చూద్దాం. అలాగే దక్షిణ కొరియా జనాభా పెరుగుదలకు ఎలాంటి చర్యలు చేపట్టిందో తెలుసుకుందాం.
ఈదేశం 1970 నుంచి కొన్ని ఆదేశాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా ఎవరు పెళ్లి చేసుకున్నా వారి నమోదు తప్పని సరి చేసింది. అలా చేసిన తరుణంలో గత దశాబ్థం క్రితం పెళ్లి చేసుకున్న వారి గణాంకాలను బయటకు తీసింది. 2012లో వాటి సంఖ్య 3లక్షలా 27వేలుగా నమోదైంది. అయితే గత సంవత్సరం 2022లో జరిపిన గణాంకాల లెక్కలు చూస్తే లక్షా 92వేలుగా నమోదైంది. అంటే ఈ దశాబ్ధకాలంలో వివాహాలు చేసుకునే వారి సంఖ్య 40శాతం పైగా పడిపోయిందని తెలిపింది. ఇలా నివ్వెరపోయే అంకెలను చూసి దక్షిణ కొరియాకు శంఖ తిరిగింది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.
ఇలా ప్రతి పదేళ్లకొకసారి జనాభా తగ్గుతూ కనిపించినప్పటికీ దీనిని అధిగమించేందుకు సాయశక్తులా కృషిచేస్తూనే ఉంది. దీని ప్రభావాన్ని ముందుగా పసిగట్టి కొన్ని సహాయక చర్యలను చేపట్టింది. పెళ్లి చేసుకునే వారికి రాయితీలు, పథకాల పేరుతో కొంత లబ్థి చేకూర్చేలా ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా 2006 సంవత్సరం నుంచి 213 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తూ వస్తుంది. మన భారత్ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ. 17లక్షల కోట్లుగా చెప్పవచ్చు. ఇలా ఎన్ని ప్రయోజనాత్మక ప్రయోగాలు చేసినప్పటికీ జనాభా సంక్షోభం నుంచి బయటకు రాలేక సతమతమౌతోంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ జనాభా కలిగిన దేశంగా రికార్డు సృష్టిస్తుంది. ప్రభుత్వాలు ఎన్ని సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ప్రజల్లో స్వతహాగా కలిగే అవగాహన ముందు ఇవన్నీ చిన్నబోక తప్పదని మరోసారి రుజువైంది.
ఇక ఇలాంటి పరిస్ధితులు యువతలో కలగడానికి గల కారణాలను తెలుసుకుందాం. ప్రస్తుతం పెళ్లిచేసుకునే వారి సగటు వయసు 33-34 సంవత్సరాలుగా పెరిగిపోయింది. ఇది పురుషుల వయసు మాత్రమే. అదే అమ్మాయిల విషయానికొస్తే 31-32 సంవత్సరాలకు పెరిగింది. అలాగే గత సంవత్సరం జరిగిన వివాహాల సంఖ్య లక్షా 90వేలు. అందులో 80శాతం మందికి పైగా మొదటి వివాహం చేసుకున్న వాళ్లే కావడం గమనించదగ్గ అంశం. ఇది ఇలాగే కొనసాగితే ప్రస్తుతం ఉన్న జనాభా 5.2కోట్ల నుంచి భవిష్యత్తులో అనగా 2067 నాటికి ఇది 3.9కోట్లకు పడిపోయే ప్రమాదం ఉందని అంచనా వేసింది.
యువతీ యువకులు వివాహానికి మక్కువ చూపకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి.
ప్రభుత్వాలు పథకాల పేరుతో డబ్బుల వెచ్చించడం వల్ల జనాభా సంక్షోభంతోపాటూ ఆర్థిక సంక్షోభం కూడా భవిష్యత్తులో తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే వారికి కావల్సింది పాలకులు ఇచ్చే లబ్థి, భృతి కాదు. స్వేచ్ఛ, ఉద్యోగం, ఉపాధి, ధరల నియంత్రణ, పని గంటలు తగ్గించేలా ప్రత్యేక ఆదేశాలు. తద్వారా కార్మికులలో పని ఒత్తిడి తగ్గి ఇంటికి సమయం కేటాయించేలా చేయడం. జీవన ప్రమాణాలు పెరిగినంత వేగంగా పనిచేసేవారి జీతభత్యాలు పెరిగేలా చర్యలు చేపట్టడం. పురుషులకు కూడా స్త్రీలతో సమానంగా ఉపాధి అవకాశాలు కల్పన వంటి విప్లవాత్మక మార్పులు చేసినట్లయితే మరో రెండు దశాబ్దాలలో 40శాతం పడిపోయిన పెళ్లిళ్ల శాతం 20శాతానికి వచ్చే అవకాశం ఉంటుంది.
T.V.SRIKAR