Space tourism : అంతరిక్ష విహారానికి స్పేస్ బెలూన్.. అంతరిక్ష పర్యాటన 

ఈ భూమి మీద చాలా చాలా అద్భుతాలు ఉన్నాయి. మనం మన పనున్నులో నిమిత్తం అయ్యి ఆ అందాలను చూడడానికి కొందరు తమ జీవితంలో కొంత సమయాన్ని కేటాయిస్తారు.

ఈ భూమి మీద చాలా చాలా అద్భుతాలు ఉన్నాయి. మనం మన పనున్నులో నిమిత్తం అయ్యి ఆ అందాలను చూడడానికి కొందరు తమ జీవితంలో కొంత సమయాన్ని కేటాయిస్తారు. మనం ఇప్పటి వరకు ఎడారుల్లో మంచు పర్వతాలు.. సాహస యాత్ర (adventure trip) .. నదిజలాల్లో విహార యాత్రలు(Excursions) .. సముద్ర భూగర్భం (Seabed) జల యాత్రలు వంటివి చూసాం.. చేసాం.. కానీ ఇప్పుడు వినబోతుంది.. చూడబోతుంది.. చేయబోతుంది అలాంటి ఇలాంటి యాత్ర కాదు.. సర్వగం లోకి వెల్లే యాత్ర.. అవునండి స్వర్గపు యాత్ర.. అదే లేండి అంతరిక్షంలో విహారయాత్ర(Space Trip)

ఇక విషయంలోకి వెలితే..
ఇప్పటి వరకు అంతరిక్షంలోకి మనుషుల కన్నా జంతువులు వెళ్లాయి. అందులో మొదటి సారిగా 1961లో చింపాంజీని పంపించారు శాస్త్రవేత్తలు..ఆ తర్వతా లైకా అని కుక్కను పంపించింది రష్య దేశం. ఇక ఆ తర్వాత మనుషులు వెళ్లడం మొదలైంది. కాగా చరిత్రలోనే ఇప్పుడు జరగబోయేది అద్భుతం అని చెప్పవచ్చు.

మొట్టమొదటి సారిగా.. అంతరిక్షంలో విహార యాత్రను ప్రారంభించింది ఓ జపాన్ కంపెనీ. అంతరిక్ష విహారయాత్ర లను ప్రోత్సహించేందుకు మరింత సులభతరం చేసే లక్ష్యంతో జపానీస్ కంపెనీ ‘ఇవాయా గికెన్’ (Iwaya giken) స్పేస్ బెలూన్ (Space balloon) ను రూపొందించింది. ఇద్దరు వ్యక్తులు ప్రయాణించేందుకు వీలుగా కంపెనీ నిపుణులు దీనిని రూపొందించారు. చుట్టూ అద్దాలతో గాజుగోళంలా కనిపించే ఈ స్పేస్ బెలూన్ ను ‘ఇవియా గికెన్’ సీఈవో ప్రారంభించారు. కాగా అంతరిక్ష విహారయాత్రలు తక్కువ ఖర్చుతో, సురక్షితంగా చేయడానికి ఇది పూర్తిగా అనువైన వాహనం అని ఇవాయా వెల్లడించారు. ఈ అంతరిక్ష విహార యాత్రకు.. అందులో ప్రయాణించే పర్యటకులకు ఎలాంటి శిక్షణ గానీ.. భాషా గానీ.. నైపుణ్యాం గానీ ఉండాల్సిన అవసరం లేదని కంపెనీ యాజమన్యం తెలిపింది. ఇది భూమికి పదిహేను మైళ్ల ఎత్తు వరకు చేరుకోగలదు.

మరో విధంగా చెప్పాలంటే స్ట్రాటోస్ఫియర్ (Stratosphere) మధ్యభాగం వరకు చేరుకుని చక్కర్లు కొట్టగలదు. అంతరిక్షంలోకి ఈ వాహనం రెండు గంటల పాటు 25 కిలోమీటర్లు (15 మైళ్ళు) వరకు ప్రయాణిస్తుంది. స్పేస్ లోకి వెళ్లిన వాహన.. భూమి చూసేందుకు గాజు గ్లాజ్ తో పెద్ద కిటికీలను కలిగి ఉంటుంది. ఇక్కడ భూమి వక్రరేఖను స్పష్టంగా చూడవచ్చు. అక్కడి నుంచి భూమిని తిలకించడం అంతరిక్ష పర్యాటకులకు (Space tourism) అద్భుతమైన అనుభూతినిస్తుంది. కాగా ఈ ప్రాజెక్ట్ ను ఇవాయూ గికెన్ సంస్థ 2012 ప్రారంభించగా.. అది గత ఏడాది (2023) చివర్లో పూర్తి అయ్యింది. ఇందులో ప్రయాణానికి అయ్యే ఖర్చు దాదాపు 1.80 లక్షల డాలర్ల వరకు (రూ.1.49 కోట్లు) ఉంటుంది.