ఏప్రిల్‌లో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఈసారి ఫిబ్రవరిలోనే నమోదు కావడంతో.. వందేళ్ల తర్వాత ఇంత ఎక్కువగా నమోదుకావడం ఇదే తొలిసారి. ైతే అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు వాతావరణం చల్లబడిన మళ్లీ వెడెక్కింది. వేసవి తాపానికి వృద్ధులు, పిల్లలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. రాబోయే ఐదు రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని.. భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
దేశవ్యాప్తంగా 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే చాన్స్ ఉందని అంటోంది. ఈ సమయంలో జనాలంతా అప్రమత్తంగా ఉండి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంటోంది. రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ మీదుగా వేడిగాలులు వీచే అవకాశముందని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే ఉత్తమమని ఐఎండీ అంటోంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని అప్రమత్తం చేసింది. బిహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది.. వేడిగాలుల తీవ్రత అధికంగా ఉండొచ్చు.. ఉరుములు, పిడుగులు, బలమైన గాలులు వీస్తాయని అధికారులు అంటన్నారు.
ఉష్ణోగ్రతల ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయ్. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింతగా పెరుగుతుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. తెలంగాణలోనూ ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయ్. రానున్న రోజుల్లో పొడి వాతావరణం, ఎండలు ఎక్కువగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నగరంలో ఇప్పటికే ఉన్న అధిక ఉష్ణోగ్రతలు వర్షం లేకుండా మరింత పెరిగే అవకాశం ఉండటంతో జనాలు పగటిపూట బయటకు వెళ్లడం కష్టంగా మారింది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు జాగ్రత్తగా ఉండాలనీ, వడదెబ్బ బారినపడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వసంత రుతుపవనాల చివరి వర్షం ముగియడంతో పగటి ఉష్ణోగ్రతలు 36డిగ్రీలకు చేరుకోవచ్చని అంటున్నారు.