Summer Mangos: మామిడి పండ్లు కొంటున్నారా ? ఐతే ఇది చూడండి..

అసలే మార్కెట్‌లో అన్నీ కల్తీ ఐపోయాయి. ఏది కొనాలన్నా భయం. ఏది ఒరిజినల్‌ ఏది నకిలీ గుర్తుపట్టలేని పరిస్థితి. అంతో ఇంతో ఫ్రూట్స్‌ మాత్రం ఫ్రెష్‌గా దొరుకుతున్నాయి అనుకుంటే ఇప్పుడు ఆ ఫ్రూట్స్‌ను కూడా కల్తీ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు.

  • Written By:
  • Publish Date - May 18, 2023 / 12:51 PM IST

సమ్మర్‌ వచ్చిందంటే ప్రతీ ఒక్కరూ మామిడిపండ్లు కొంటారు. సమ్మర్‌ సీజన్‌లో విరివిగా దొరికే పండు ఇది. సాధారణంగానే మామిడిపండ్లను కింగ్‌ ఆఫ్‌ ఫ్రూట్‌ అంటారు. ప్రజలు వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఇక ఎండాకాలంలో వీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. సిటీలో మామిడిపండ్ల అమ్మకాలు పెరగడంతో దాన్ని క్యాష్‌ చేసుకుందామనుకున్నారు కొందరు నీచులు. మామిడిపండ్లు త్వరగా పండేందుకు వాటిపై ఇథీలీన్‌ పౌడర్‌ జల్లి మాగపెడుతున్నారు.

సాధారణంగా పండ్లు చెట్టుమీద పండితే టేస్ట్‌ బాగుంటుంది, మంచి పోషకాలు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాటిని పెట్టెల్లో పెట్టి కూడా మాగబెడతారు. ఎలాంటి కెమికల్స్‌ వాడకుండా ప్రకృతిసిద్ధంగా మాగపెడితే మంచిదే. పోషకాలు మిస్‌ అవ్వవు. కానీ దీనికి కొంత సమయం పడతుంది. కానీ వీటిని ఇథిలీన్‌ పౌడర్‌ జల్లి మాగబెట్టడం ద్వారా మామిడి కాయలు త్వరగా పండ్లు అవుతాయి. కానీ ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. ఎవరి ప్రాణం పోయినా మాకు డబ్బు వస్తే చాలు అనుకునే కొందరు వ్యాపాలురు ఇప్పుడు హైదరాబాద్‌లో ఇదే పని చేస్తున్నారు. మామిడి కాయలు త్వరగా పండ్లు అయ్యేందుకు వాటిని ఇథిలీన్‌ పౌడర్‌లో మాగబెట్టి అమ్మేస్తున్నారు. 15 రోజుల్లో 9 ప్రాంతాల్లో ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. 9 ప్రాంతాల్లో ఇథిలీన్‌ ప్యాకెట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నగర వాసులు మామిడిపండ్లు కొనే విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు.