Supreme court: ఎద్దు కళ్లలో కారం కొట్టిన ‘న్యాయం’! జంతు హింస ఆచారమెలా అవుతుంది?

సుప్రీంకోర్టులో బెంచ్‌ మారిన ప్రతీసారి న్యాయం తలకిందులువుతుంది. ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరూ విమర్శకు అతీతులు కారు...! అది ప్రధానులు కావొచ్చు... సీఎంలు కావొచ్చు.. తీర్పులు చెప్పే న్యాయస్థానాలు కావొచ్చు. హేతుబద్ధమైన విమర్శలను ఎవరైనా అంగీకరించాల్సిందే! ఇది రాజ్యాంగం కల్పిస్తోన్న హక్కు!

  • Written By:
  • Publish Date - May 18, 2023 / 06:32 PM IST

కబడ్డీ మన సంప్రదాయ క్రీడా.. ఈ ఆటలో సాధారణంగా దెబ్బలు తగులుతుంటాయి.. కొన్నిసార్లు అది ప్రాణాల వరకు తీసుకువస్తుంది కూడా..! నిజానికి ఏ ఆటలోనైనా ఇది జరుగుతుంది. అయితే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఏ ఒక్కరికీ ఎవరూ కూడా హాని తలపెట్టరు. ఇప్పుడు కొన్నీ రాష్ట్రాలు చెప్పుకునే సంప్రదాయ క్రీడాల గురించి మాట్లాడదం. ఓ ఎద్దు పరిగెడుతూ ఉంటుంది. దాని వెనక కండలు తిరిగిన యువకులు పరిగెడుతూ ఉంటారు. దాన్ని అదే పనిగా రెచ్చగొడుతూ ఉంటారు. కొన్నిప్రాంతాల్లో దాన్ని తోక కత్తిరించి కూడా ఉంటారు. ఎద్దు బరిలోకి దిగేముందు కొంతమంది వాటి శరీరంలో డ్రగ్స్‌ ఇంజెక్షన్లు కూడా పొడుస్తారు. కళ్లలో కారం కూడా కొడతారు. ఇదంతా తమిళనాడు ప్రజలు తమ సంప్రదాయ క్రీడగా చెప్పుకునే జల్లికట్టు గురించి. అసలు హింసే ఉండదని..ఇదంతా మా సంప్రదాయమేనని చెప్పుకునే తమిళ మీడియా, అక్కడి సెలబ్రిటీలు, అక్కడి ప్రజలు నిజం అంగీకరించరు. ఎందుకంటే శాంతి, మంచి కంటే తమ సంప్రదాయలకే విలువిచ్చే ప్రజలు తమిళులు. అందుకే సుప్రీంకోర్టు కూడా న్యాయాన్ని పక్కనపెట్టి వాళ్ల ఆచారానికి విలువనిచ్చే తీర్పు ఇచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ హింసాత్మక క్రీడాకు సుప్రీంకోర్టు అడ్డుచెప్పకపోవడంపై జంతుప్రేమికులు పెదవి విరుస్తున్నారు.

9ఏళ్లలో ఏం మారలేదు.. తీర్పు తప్ప:

త‌మిళ‌నాడులో సంప్రదాయ క్రీడా జ‌ల్లిక‌ట్టుపై 2014 మేలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది. జంతు చట్టాల‌ను ఉల్లంఘించిన‌ట్లు కోర్టు తీర్పునివ్వడం అప్పట్లో తమిళనాట తీవ్ర నిరసనలకు కారణమైంది. ఇక పీసీఏ చ‌ట్టం(Prevention of Cruelty to Animals Act) నుంచి జ‌ల్లిక‌ట్టు ఆట‌ను తొల‌గిస్తూ 2016లో కేంద్ర స‌ర్కార్ కొత్త నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఆ త‌ర్వాత 2017లో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కొత్త జంతు చ‌ట్టాన్ని రూపొందించింది. ఆ చట్టంపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..తమిళనాడు ప్రభుత్వ వాదనలో ఏకీభవించింది. తమిళనాడు చట్టాన్ని సమర్థిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.

ధర్మం సంగతి సరే..న్యాయమేది?

సుప్రీంకోర్టు తీర్పును జంతుప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2014 నుంచి 2023మధ్య జల్లికట్టు ఆడే విధానంలో ఏ మార్పులేదు. అలాంటప్పుడు అప్పుడు తప్పుగా అనిపించింది ఇప్పుడు ఒప్పుగా ఎలా అనిపించిందో ఈ తీర్పునిచ్చిన న్యాయమూర్తులే చెప్పాలి. సాంస్కృతిక వారసత్వానికి జల్లికట్టు చిహ్నమని.. వారసత్వ పరిరక్షణకు చట్టాలు చేసే అధికారం రాష్ట్రానికి ఉందని సుప్రీం కోర్టు చెప్పడమేంటో అర్థంకావడం లేదు. ఆచారం, సంప్రదాయం పేరిట జంతువులను హింసించడమేంటో..దాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించడమేంటో అర్థంకాని దుస్థితి దాపరించింది. అంతేకాదు కంబాల , ఎడ్ల పందాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టానికి తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక చేసిన సవరణలు చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇక మిగిలింది మన ఏపీలోని కోడి పందెలు మాత్రమే. అక్కడ బెట్టింగ్ జరగదని హామి ఇస్తే అది కూడా న్యాయబద్ధం కావొచ్చు..! లేకపోతే బెట్టింగ్‌ కూడా మహాభారతంలో జరిగిందని.. అది కూడా మా సంప్రదాయమేనని చెప్పుకోవచ్చు.. కొళ్లు చస్తే మాకేంటి..కుక్కలు చస్తే మాకేంటి అని భావించినా తప్పేలేదు.. ఎందుకంటే ఆదివారం అందరూ అవే తింటున్నారని..సో అవి కొట్టుకుంటే తప్పేంటో చెప్పాలని వాదించేవాళ్లూ ఎలాగో ఉన్నారు. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొడి పందెలపై ఓ చట్టం చేసుకుంటే సరిపోతుంది. ఏ జీవి ఎలా హింసకు గురయితే మాకేంటి..మనం హ్యాపీగా ఉంటే చాలు కదా! ఇది సంప్రదాయవాదుల లెక్క! ఇవ్వని బయటమాట్లడకండి.. వాళ్లకి ఎక్కడలేని కోపం రావొచ్చు.. అది మీపై చూపిస్తే మీరు కూడా జల్లికట్టులో ఎద్దుల్లాగా పరిగెత్తాల్సి ఉంటుంది.