TCS NQT: టీసీఎస్ ఎన్‌క్యూటీ.. ఒక్క పరీక్షలో నెగ్గితే చాలు.. 1.6 లక్షల ఉద్యోగాలకు అర్హత..!

ఈ పరీక్ష కోసం అర్హత కలిగిన విద్యార్థులు, యువత నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. టీసీఎస్ ఎన్‌క్యూటీలో అర్హత సాధిస్తే.. టీసీఎస్, జియో, ఏసియన్ పెయింట్స్, టీవీఎస్ మోటార్స్ వంటి దాదాపు 2,700కుపైగా ఉన్న ఐటీ, నాన్ ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు పొందే వీలుంది.

  • Written By:
  • Publish Date - November 15, 2023 / 07:14 PM IST

TCS NQT: ఐటీ, నాన్ ఐటీ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న యువతకు గుడ్ న్యూస్. త్వరగా ఉద్యోగాలు సంపాదించేందుకు ఒక కొత్త విధానం అందుబాటులోకి రానుంది. బీటెక్, డిగ్రీ, పీజీ పూర్తి చేసి.. ఉద్యోగాణ్వేషణలో ఉన్నవారికి మంచి అవకాశం అందిస్తోంది ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీస్). ఆఫ్ క్యాంపస్ హైరింగ్ కోసం టీసీఎస్ ఎన్‌క్యూటీ (TCS NQT) పరీక్షను ప్రవేశపెట్టబోతుంది. టీసీఎస్ ఎన్‌క్యూటీ అంటే టీసీఎస్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్.

ASSEMBLY ELECTIONS: మా సంగతేంటి..?.. స్కూల్ ఫీజులు.. హాస్పిటల్ బిల్లులపై ప్రశ్నిస్తున్న మిడిల్ క్లాస్..!

ఈ పరీక్ష కోసం అర్హత కలిగిన విద్యార్థులు, యువత నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. టీసీఎస్ ఎన్‌క్యూటీలో అర్హత సాధిస్తే.. టీసీఎస్, జియో, ఏసియన్ పెయింట్స్, టీవీఎస్ మోటార్స్ వంటి దాదాపు 2,700కుపైగా ఉన్న ఐటీ, నాన్ ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు పొందే వీలుంది. వివిధ కార్పొరేట్ సంస్థల్లో మొత్తంగా 1.6 లక్షలకుపైగా ఉద్యోగాలకు ఈ పరీక్ష ద్వారా అర్హత సాధించవచ్చు. అలాగే.. ఎంపికైన వారికి గరిష్టంగా రూ.19 లక్షల వరకు ప్యాకేజీ పొందే వీలుంది. టీసీఎస్ ఎన్‌క్యూటీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత వీరికి పరీక్ష నిర్వహిస్తారు. అందులో మంచి స్కోరు సాధిస్తే.. ఈ స్కోరు ఆధారంగా కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ కంపెనీలు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. వచ్చే నెలలో ఈ పరీక్ష జరగబోతుంది.

ఈ నెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 9న పరీక్ష జరుగుతుంది. 2018-2024 మధ్య బీటెక్ పాసౌట్ స్టూడెంట్స్, అలాగే ఫైనలియర్ ఎగ్జామ్స్ రాస్తున్న యూజీ, పీజీ, డిప్లొమా విద్యార్థులు, రెండేళ్లకు మించని ఎక్స్‌పీరియెన్స్ కలిగిన వాళ్లు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. 17 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు వయసు వాళ్లు మాత్రమే అర్హులు. ఈ పరీక్షలో సాధించిన స్కోరుకు రెండేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. ఇంగ్లీష్‌లో ఉండే ఈ పరీక్షలో నెగెటివ్ మార్కులుండవు. ఇక.. ఈ పరీక్ష జాబ్‌కు ఎలాంటి హామీ ఇవ్వదు. https://learning.tcsionhub.in/hub/national-qualifier-test/ పై దరఖాస్తు చేసుకోవచ్చు.