Kedarnath temple open : కేదార్ నాథ్ ఆలయ తలుపులు ఓపెన్.. కేదార్ నాథ్ కు పోటెత్తిన యాత్రికులు

ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో అగ్రస్థానం అయిన కేదార్నాథ్ ఆలయం నేడు శుక్రవారం అక్షయ తృతీయ పండుగ రోజున ఉదయం 7 గంటలకు వేద పండితుల మంత్రోచ్చారణ మద్య ఆలయ ప్రధాన అర్చకులు.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆలయ తలుపులు తెరిచారు. హెలికాప్టర్ నుంచి ఆలయంపై పూల వర్షం కురిపించారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది.

 

కేదార్నాథ్ (Kedarnath) భారతదేశంలో హిమాలయాల్లో (Himalaya) ఉన్న రెండోవ శివుని ఆలయం.. ద్వాపర యుగంలో నిర్మించిన ఆలయం.. కేధార్ నాథ్ దాదాపు 6 నెలల తర్వాత నేడు అక్షయ తృతీయ పండుగ సంద్భంగా ఆలయ ద్వారాలు తెరవబడ్డాయి. నేడు కేధార్ నాథ్ తో పాటు మరో గంగోత్రి, యమునోత్రి ఆలయ తలుపులు కూడా తేరుచుకున్నాయి.

ఇక విషయంలోకి వెళితే..
ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో అగ్రస్థానం అయిన కేదార్నాథ్ ఆలయం నేడు శుక్రవారం అక్షయ తృతీయ పండుగ రోజున ఉదయం 7 గంటలకు వేద పండితుల మంత్రోచ్చారణ మద్య ఆలయ ప్రధాన అర్చకులు.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆలయ తలుపులు తెరిచారు. హెలికాప్టర్ నుంచి ఆలయంపై పూల వర్షం కురిపించారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. అనంతరం కేదార్ నాథ్ కు 6 నెలల తర్వాత తొలి పూజలు చేయించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కుటుంబ సమేతంగా తొలి పూజలు చేశారు. కాగా బద్రీనాథ్ (Badrinadh) ఆలయంలో దర్శనం మే 12 నుంచి ప్రారంభమవుతుంది.

  • శివనామస్మరణతో మార్మోగిన కేధార్ నాథ్.. 

కేదారేశ్వరుడిని దర్శించుకోవడాని దాదాపు 16 వేల మంది భక్తులు కేదార్నాథ్ కు చేరుకున్నారు. కేదారేశ్వరుని దర్శనం కోసం భారీగా భక్తులు తరలిరావటంతో రద్దీ నెలకొంది. భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో 15 వేలకు పైగా భక్తులు గౌరి కుండ వద్ద నిలిపివేశారు. కాగా, నిన్న సాయంత్రం వరకుదర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారని అంచనా వేసిన పర్యాటక శాఖ.. మరోవైపు వివిధ స్టాప్‌లలో 35 వేల మందికి పైగా యాత్రికులు బస చేస్తున్నారు అని పర్యటక శాఖ వెల్లడించింది.

నేడు కేదార్నాథ్ తో పాటుగా గంగోత్రి, యమునోత్రి, ఆలయాల తలుపులు తెరుచుకున్నాయి. గంతోత్రి, యమునోత్రి ఆలయాలకు కూడా ఇదే స్థాయిలో భక్తుల తాకిడి ఉందని ఉత్తరాఖండ్ దేవదాయ శాఖ వెల్లడించింది.

  • యాత్రికులకు కేధార్ నాథ్ – బద్రినాథ్ ఆలయ కమిటీ హెచ్చరిక జారీ..

కేదార్ నాథ్ కు వచ్చే భక్తులు హెచ్చరికలు జారీ చేసింది.. కేదార్నాథ్ – బద్రీనాధ్ ఆలయ కమిటీ
కేధార్ నాథ్ లో పగటిపూటనే ఉష్ణోగ్రతలు 0 – 3 వరకు ఉంటుందని అధికారులు సూచించారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలని యాత్రికులకు సూచించారు. అంతేకాదు కేధార్ నాథ్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని డెహ్రాడూన్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉష్ణోగ్రతలు -0 డిగ్రీల కన్న పడిపోతే.. తేలికపాటి మంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాలు అయిన గౌరీకుండ్, సోన్ మార్గ్ వంటి ప్రాంతాల్లో వడగళ్ల వాన, బలమైన గాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

  • చార్ ధామ్ యాత్ర అంటే ఏమిటి..?

కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఈ నాలుగు పుణ్యక్షేత్రాలు చోట చార్ ధామ్ యాత్రలు అంటారు. భారతదేశంలోని రెండు ప్రముఖ ప్రచార యాత్రలు ఉన్నాయి. ఒకటి బయ చార్ ధామ్ యాత్ర, రెండోవది చోట చార్ ధామ్ యాత్ర

బడా చార్ ధామ్ యాత్ర : నాలుగు దిక్కుల్లో ఉన్న నాలుగు ప్రముఖ ద్వాపర, త్రేతాయుగం నాటి క్షేత్రాలు అయిన బద్రినాథ్, పూరీ జగన్ నాధ్ ఆలయం, రామేశ్వరం ఆలయం, ద్వారక ఆలయం ఇలా నాలుగు క్షేత్రాలు యాత్రలు ఉంటాయి.

చోట చార్ ధామ్ యాత్ర : ఇక ఈ యాత్రలో గంగోత్రి, యమునోత్రి, కేధార్ నాథ్, బద్రినాధ్ క్షేత్రాలను చోట చార్ ధామ్ యాత్రలు అని అంటారు. చాలా మంది యాత్రికులు మొదటగా ఈ చోట చార్ ధామ్ యాత్రనే చేస్తుంటారు.

Suresh SSM