APPSC Exams : ఆడపిల్లలు అని తండ్రి వదిలేశాడు.. ఆ ముగ్గురూ సరస్వతులయ్యారు..

ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే చాలా మంది అదృష్టంగా భావిస్తారు. మహాలక్ష్మి వచ్చిందని సంతోషిస్తారు. వీళ్లకు సమానంగా మరో దిక్కుమాలిన బ్యాచ్‌ ఉంటుంది. ఆడిపిల్లలు అంటే మనుషులే కాదు అన్నట్టుగా.. వాళ్లు పుట్టగానే ఏదో భారం మీద పడ్డట్టుగా ఫీల్‌ అవుతుంటారు. అలాంటి ఓ దిక్కుమాలినోడి గురించే ఈ స్టోరీ. ఏపీలోని శృంగవరపుకోటలోని శ్రీనివాస కాలనీలో ఉండే మాచిట్టి బంగారమ్మకు ముగ్గురు ఆడపిల్లలు.

 

 

 

ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే చాలా మంది అదృష్టంగా భావిస్తారు. మహాలక్ష్మి వచ్చిందని సంతోషిస్తారు. వీళ్లకు సమానంగా మరో దిక్కుమాలిన బ్యాచ్‌ ఉంటుంది. ఆడిపిల్లలు అంటే మనుషులే కాదు అన్నట్టుగా.. వాళ్లు పుట్టగానే ఏదో భారం మీద పడ్డట్టుగా ఫీల్‌ అవుతుంటారు. అలాంటి ఓ దిక్కుమాలినోడి గురించే ఈ స్టోరీ. ఏపీలోని శృంగవరపుకోటలోని శ్రీనివాస కాలనీలో ఉండే మాచిట్టి బంగారమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. పెళ్లయ్యాక వరుసగా ముగ్గురూ ఆడపిల్లలే పుట్టడంతో బంగారమ్మను వదిలేశాడు ఆమె భర్త. ముగ్గురు ఆడపిల్లలను తాను పెంచలేనని.. వాళ్ల పెళ్లిళ్లు చేయలేనని బంధాన్నే తెంచుకున్నాడు.

పిల్లలతో పాటు భార్య కూడా వద్దంటూ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. బంగారమ్మ నిజంగా బంగారం. భర్త వదిలేసినా ఏ మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ముగ్గురు పిల్లలే ప్రాణంగా బతకడం మొదలుపెట్టింది. పిల్లలను చదివించుకునేందుకు నానా కష్టం చేసింది. భవననిర్మాణ కార్మికురాలిగా పని చేస్తూ ముగ్గురు ఆడబిడ్డను సాకింది. బంగారమ్మ రెండో కూతురు రేవతి టెన్త్‌లో మంచి మార్కులు సాధించడంతో పుణ్యగిరి కాలేజ్‌ ఎండీ ఆమె ఇంటర్‌లో ఫ్రీ సీట్‌ ఇచ్చారు. అక్కడ మంచి మార్కులు సాధిస్తే పైచదువులు కూడా చదవిస్తానన్నారు. అదే మాటతో రేవతి ఇంటర్‌లో 984 మార్కులు సాధించి. ఎంసెట్‌లో ర్యాంక్‌ సాధించి గాయత్రి ఇంజనీరింగ్‌ కాలేజి నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసింది.

ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్‌ రాసి జోన్‌-1 పరిధిలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం RWS ఏఈఈగా జాబ్‌ కొట్టింది. ఇక రేవతి అక్క సరస్వతి ఏలూరు సచివాలయ ఉద్యోగిగా జాబ్‌ చేస్తోంది. చెల్లెలు పావని పీహెచ్‌డీ చేస్తోంది. చదువులో రాణిస్తూ పిల్లలు సాధిస్తున్న వరుస విజయాలతో బంగారమ్మ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఆడది బతకాలంటే మగాడి తోడు ఉండాల్సిన అవసరం లేదని నిరూపిస్తూనే కష్టం విలువ తెలియచేస్తున్న వీళ్ల కథ ప్రతీ ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తోంది.