Sea Floating City : సముద్రంలో తేలియాడే నగరం..

ప్రపంచ దేశాల ముందు దెబ్బ తిన్న జపాన్.. ఇప్పుడు ఓ పెద్ద సాహసమే చేయబోతుంది. ఏకంగా సముద్ర మధ్యలో ఒక కృత్రిమ నగరమే కట్టబోతుంది జపాన్..

జపాన్ ఈ పేరు గురించి ప్రతి పిల్లవాడిని అడిగినా చెబుతాడు. ఆ దేశం ఒక్కడ ఉంది అని కొన్ని ఏళ్ల క్రితం ఏలా ఉండేది అని.. ఇప్పుడు ఏలా ఉంది అని..

అమెరికా, హిరోషిమా, నాగసాకి నగరాలు అణుబాంబు సృష్టించిన విధ్వంసం ఇప్పటికి ఆనవాళ్లు జపాన్ కనిపిస్తుంటాయి. అలాంటి నగరం ఇప్పుడు ఎవరు అందుకోలేని విధంగా ఎవరూ చేరుకోలేని విధంగా ఎదుగుతు టెక్నాలజీని వాడుకుంటూ అగ్రదేశాలు తనకు సాటి రానట్టుగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మరో సహసం చేయబోతుంది జపాన్.

 

పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న జపాన్ దేశంలో మూడు వేల పైగా సహజ దీవులు ఉన్నాయి. ఇప్పుడు జపాన్ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎవరు చేయలేని సాహసం చేయబోతోంది. అదే కృత్రిమ ద్వీపం. అందులో పూర్తి మానవ నివాసయోగం ఉన్నటువంటి నివాసాలను నిర్మించి.. ఏక్కంగా సముద్ర మధ్యలో ఒక చిన్న నగరనే నిర్మిస్తోంది జపాన్.

N-Ark  సంస్థ ..

సముద్రంలో తేలియాడే నగరాన్ని జపాన్ కు చెందిన ఎన్-ఆర్ సంస్థ నిర్మిస్తోంది. మూడు భాగాల సమ్మేళనంగా నలభైవేల జనాభాకు ఆవాసం కల్పించేలా ఎన్-ఆర్ నిపుణులు ఈ నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఎటువైపు ఉన్న వర్తుల భాగంలో స్థిర నివాస భవనాలు ఉండేటట్లు భారీ ప్రణాళిక ను రూపోందిస్తుంది. ఇక దీనికి డోజెన్ సిటీ గా పేర్కొన్నారు.

N-Ark ఫ్లోటింగ్ సిటీ ప్రణాళికను అంచనా..

ఈ నగరం నిర్మించాక.. సంవత్సరానికి దాదాపు 2 మిలియన్ లీటర్ల.. నీటి వినియోగం ఉంటుందని, అంతేకాకుండా ఫ్లోటింగ్ సిటీ నుంచి 3,288 టన్నుల వార్షిక చెత్త (వ్యర్థలు) ఏర్పడుతుంది. ఫ్లోటింగ్ సిటీ లో దాదాపు 7,000 టన్నుల ఆహారం ఉత్పత్తి చేయబడుతుంది. ఈ నగరం నుంచి 22,265,000 kW శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇలా ముందుగా అంచనా వేసి జపాన్ ప్రభుత్వానికి అందించింది N-Ark సంస్థ.

“డోజెన్ సిటీ” లో ఉండే సౌకర్యాలు ..

ఇతర నగరాల్లో ఉండేట్లు.. అనేక పచ్చదనం, పాఠశాల, క్రీడా ప్రాంతాలు, ఆసుపత్రులు, పార్కులు, స్టేడియంలు, హోటళ్లు వివిధ రకాల కార్యాలయాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా ఇందులో N-Ark రాకెట్ రవాణా కోసం కొన్ని రకాల లాండింగ్, ల్యాండింగ్ సైట్‌తో సహా డోజెన్ సిటీని నిర్మించాలని జపాన్ యోచిస్తుంది. ఈ నగరలో ప్రధామంగా హెల్త్‌కేర్ పై ఎక్కువ దృష్టిగా పెట్టనుంది. ఈ వైద్య సదుపాయాల కోసం ప్రత్యేకించి టెక్నాలజీతో రూపొందించిన రోబోటిక్ లను వినియోగించుకోనున్నారు. అంతేకాకుండా వాటితో సర్జరీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు జపాన్ ప్రభుత్వం. ఈ ప్రాజెక్ట్ లో తేలియాడే ప్రార్థనాలయాలు, హోటళ్లు, శ్మశాన వాటికలు కూడా ఉంటాయి. నీటి ఉపరితలం పైన కాకుండా నీటి అడుగున డేటా సెంటర్, వైద్య పరిశోధన కేంద్రాలను, ల్యాబ్ లను నిర్మించాలి జపాన్ ప్లాన్.

N-Ark ఇవన్నీ ఆఫ్-షోర్‌లో ఎందుకు డిజైన్ చేసింది..?  సునామీలను తట్టుకోగలదా.. ?

డోగెన్ సిటీ నిర్మించడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాల అనుగుణంగా వాటికి లోబడి నిర్మిస్తుంది. అంటే సముద్రంలో తూఫాన్, సూనామీ రావడం వట్టివి జరుగుతాయి. అప్పుడు ఈ నగరం పరిస్థితి ఎం అవుతుంది. అనే ప్రశ్న తలెత్తవచ్చు.. అందుకు అనుగుణంగానే అలాంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని సముద్రం నీటి మట్టం పెరుతుంటే ఆటోమేటింగా.. ఈ నగర కూడా నీటి మట్టంతో పాటు సముద్రంలో తేలుతుంది. ‘వాతావరణ మార్పు’ నగరాన్ని సృష్టించాలనుకుంటున్న. కాబట్టి, సముద్ర మట్టాలు పెరిగే కొద్దీ, నగరం వాటితో పెరుగుతుంది. అప్పుడు ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగదు.

జపాన్ ముఖ్య ఉద్దేశం/లక్ష్యం..

అత్యాధునిక టెక్నాలజీ కి వాడుకుంటూ డోగెన్ సిటీ ‘వ్యవసాయ అభివృద్ధి చేసి దానితో వ్యాపారం చేయాలని జపాన యోచిస్తోంది.నిత్య జీవనం కోసం ప్రజల అవసరాలకు పంటలు పండించుకునే చిన్న చిన్న పొలాలు, తోటలు ఉడనున్నాయి. వారు ప్రతి సంవత్సరం 7,000 టన్నుల ఆహారాన్ని ఉత్పత్తి చేయాలని, సముద్రగర్భ శక్తి వినియోగ కేంద్రం ఏర్పాటు చేసి దాన్ని నుంచి 22,000,000 kW కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

2030..లో పట్టాలెక్కనున్న “డోజెన్ సిటీ” ప్రాజెక్టు..

ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మిస్తున్నట్లు ఇంకా ఎలాంటి సమాచారం లేదు.. అంతేకాకుండా ఈ భారీ ప్రాజెక్టుకు ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుంది అనేది కూడా ప్రభుత్వం వెల్లడించలేదు.
అయితే N-Ark మాత్రం ఈ ప్రాజెక్టును 2030 నాటికి ఉపయోగంగా ఉంటుందని ఊహించింది. కానీ ఇప్పటికీ ఇది డిజైన్ దశలోనే ఉంది.

 S.SURESH