Joan Rogue In France: ఇక్కడ గాలి, నేల, నీరు అంతా విషమే.. ఎందుకో తెలుసా..?

మన చుట్టూ అనంతమైన విశ్వం ఉంది. ఇందులో మనకు ప్రశాంతతను ఇచ్చే ప్రదేశాలు కొన్ని ఉంటే.. మరికొన్ని నివాసానికి యోగ్యమైనవి ఉంటాయి. కొన్ని కాలుష్య కోరల్లో చిక్కుకొని తీవ్రమైన అనారోగ్యాలకు కారణం అవుతూ ఉంటాయి. అయితే వీటన్నింటికీ భిన్నంగా ఒక ప్రాంతం ఉంది. అక్కడి గాలి పీల్చినా.. నీరు తాగినా అంతే సంగతులు. ప్రాణాలు అదే భూమిలో కలిసి పోతాయి. ఇంతకు అలాంటి ప్రదేశం ఎక్కడుందో తెలుసుకోవాలని ఆసక్తికరంగా ఉంది కదూ. అయితే పూర్తి వివరాలు చూసేయండి.

  • Written By:
  • Publish Date - August 24, 2023 / 08:41 AM IST

ఇది ఫ్రాన్స్ పట్టణానికి చాలా కొద్ది దూరంలో ఉంది. ఒకప్పుడు ఈప్రాంతం మొత్తం జనావాసాలతో కిటకిటలాడుతూ సందడిగా ఉండేది. అనేక వ్యాపార సముదాయాలు, రవాణాకు అనువైన రోడ్లు ఉండేవి. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మొత్తం విషపూరితంగా మారిపోయింది. ఇలా అవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. దీనిపై శాస్త్రవేత్తలు అనేక అధ్యయనాలు చేశారు. నివేదికలు కూడా వెలువరించారు. వాటిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఏమి తిన్నా అంతే సంగతులు

ఫ్రాన్స్ లోని ఈ విషపూరితమైన ప్రదేశానికి జోన్ రోగ్ అని పేరు ఉంది. అక్కడి చుట్టుపక్కల ఉండే స్థానికులు డేంజర్ జోన్ అని కూడా పిలుస్తారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవరూ నివసించడం లేదని తాజాగా ఒక పరిశోధనలో తెలిసింది. దీనికి కారణం ఆక్కడి భూభాగంలోని మట్టి మొత్తం విషపూరితంగా మారిపోవడం. ఆ మట్టి గాలి పీల్చినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని అంటున్నారు కొందరు పరిశోధకులు. అలాగే ఈ భూమిలో పండిన ఆహారా పదార్థాలను తింటే కూడా ఆవిషం మన నోటి ద్వారా కడుపులోకి వెళ్లి చనిపోతారు అంటున్నారు. అందుకే ఈ ప్రాంతంలో ఎవరూ నివసించేందుకు వీలు లేదని ఫ‌్రాన్స్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక్కడికి ఎవరూ రాకుండా భద్రతా ఏర్పాట్లు చేసింది.

విషపూరితానికి గల కారణాలు

ఇంత భయంకరమైన ప్రదేశం భూమి మీద ఉండటానికి గల కారణం ఒక్కటే. ప్రపంచ యుద్ద సమయంలో తీవ్రమైన అణుబాంబులతో ఈ ప్రదేశం మొత్తం ధ్వంసమైంది. అవసరానికి మించిన బాంబులను ఈ నేలపై ప్రయోగించారు. వాటిలోని రసాయనాలు భూ గర్భంలోకి చొచ్చుకొని పోయాయి. అందుకే అక్కడి గాలి, మట్టి కలుషితంగా చెబుతారు. ఇదిలా ఉంటే తాజాగా జర్మన్ కి చెందిన శాస్త్రవేత్తలు మరిన్ని కీలమైన సమాచారం సేకరించడం కోసం పరిశోధనలు చేశారు. ఈ సందర్భంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మన్నటి వరకూ గాలి, మట్టి మాత్రమే కలుషితం అనుకున్నారు. కానీ ఈప్రాంతంలోని నీటిలో ఆర్సెనిక్ అనే మూలకం ఎక్కువగా ఉందని గుర్తించారు. ఈ రసాయనం కలిగిన నీటిని తాగడం వల్ల కూడా చనిపోవడం తద్యం అని తేలింది.

ప్రకృతిని కాపాడుకుంటే మానవజాతి మనుగడ సజావుగా సాగుందని లేకుంటే తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని ఈ సంఘటన ద్వారా మరోసారి రుజువైంది.

T.V.SRIKAR