New Fertility Lab In Japan: ల్యాబ్ లే తల్లిగర్భాలుగా బిడ్డకు జన్మనిచ్చేందుకు జపాన్ సరికొత్త ప్రయోగం.!

అమ్మ ఈ రెండు పదాలు ప్రపంచాన్ని నిద్రపుచ్చుతాయి. తల్లి స్పర్శకు నోచుకోని దేహమైనా దేశమైనా నిరుపయోగమే. సాధారణంగా మాతృత్వాన్ని కలగడం అంటే స్త్రీమూర్తి గర్భంలోని అండాలు.. పురుష వీర్యంతో ఫలదీకరణం చెందడం. తద్వారా నవమాసాలు ఆ పిండాన్ని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకొని గర్భంలోనుంచి బిడ్డను బయటకుతీయడం. ఇలా చేయడం వల్ల స్త్రీ ఒక జీవికి ప్రాణం పోస్తుంది. అలాగే సృష్టిలో మరో జీవికి ప్రతి సృష్టిచేసినదిగా చరిత్ర పుటల్లో చెరిగిపోని ముద్ర వేసుకుంటుంది. అయితే ఈ ప్రక్రియకు భిన్నంగా తల్లి తనాన్ని తన కడుపులో నవమాసాలు మోసే ప్రక్రియకు స్వస్థి చెబుతూ జపాన్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

  • Written By:
  • Publish Date - June 1, 2023 / 02:10 PM IST

లోకంలో గర్భం దాల్చడం సర్వసాధారణమైన చర్య. అయితే ఇందులో చాలా రకాలా సరికొత్త పద్దతులు మార్పు చెందుతూ వచ్చాయి. స్వయంగా తన బిడ్డను తానే తొమ్మిది నెలలు మోసి జన్మనివ్వడం. ఇలా కాకుండా తన బిడ్డను మరొకరి గర్భంలో స్థానం కల్పించి ఆ జీవి బయటకు వచ్చిన తరువాత సొంత తల్లికి అప్పగించడం. దీనినే సరోగసీ అంటారు. అద్దె గర్భాలు అనమాట. ఈ విధానం ద్వారా మన దేశంలో ఇప్పటికే చాలా మంది పిల్లలను పొందారు. ఇక ఆధునిక యుగంలో టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లలను ఉత్పల్లి చేయడం కూడా చూశారు. వీటన్నిటికీ భిన్నంగా సరికొత్తగా పిల్లలను జన్మనిచ్చేందుకు తన ప్రయోగాన్ని మొదలు పెట్టింది జపాన్.

ఇకపై పిల్లలు పొందడం సులువే

రానున్న యాంత్రిక ప్రపంచంలో స్త్రీపురుషులతో సంబంధంలేకుండా ఒక లేబరేటరీలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఇలా జన్మించిన శిశువును తల్లిదండ్రలకు అందించే అద్భుతమైన పద్దతిని కనుగొనబోతుంది. పిల్లలు కావాలనుకున్న వారు వారి అండాలను,వీర్యకణాలను ఈ శాస్త్రవేత్తలకు అందించాల్సి ఉంటుంది. వారు ల్యాబ్ లో పరిశీలించి వీటికి జీవరూపాన్ని అందించేందుకు ప్రయోగాలు చేస్తారు. ప్రస్తుతం వీరి ప్రయోగం ఎలుకల మీద కొనసాగుతోంది. రానున్న రోజుల్లో మనుషులపై చేసేందుకు సర్వశక్తులు వండుతుంది.

ఎలుకల ద్వారా ప్రయోగం

మగ ఎలుకల చర్మకణాలను తీసుకొని ప్లూరిపోటెంట్ మూలకణంగా మార్చనున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడించారు. ఇలా చేయడం వల్ల వివిధ రకాలా కణాలు, కణజాలాలుగా అభివృద్ది చెందుతాయట. ఇలా వృద్ది చెందిన తరువాత మగ ఎలుకల మూలకణాలకు ఆడకణాలుగా మార్చే ఒక ఔషదాన్ని అందిస్తారు. ఇలా చేయడం వల్ల మగ కణాలు ఆడకణాలుగా ఎక్కువ సంఖ్యలో వృద్దిచెందుతాయి. తద్వారా అధికంగా అండాలను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. ఈ వృద్ది చెందిన అండాలను నవజాత మగ ఎలుకలతో ఫలదీకరిస్తారు.

ఫలించిన పరిశోధన

తాజాగా క్యూషు విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు దాదాపు 630 పిండాలతో ప్రయోగం చేసినట్లు తెలిపారు. అందులో ఏడు సజీవ ఎలుక పిల్లలుగా మారాయి. అంటే ఈప్రయోగంలో మరిన్ని మార్పులను చేసి ఉత్పత్తి సంఖ్య పెరిగేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఎలుకల ద్వారా ప్రయోగాన్ని విజయవంతం చేసి మానవులలో ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు చెబుతున్న మాట. నేరుగా మానవులతో ప్రయోగం చేస్తే చాలా పెద్ద చిక్కులు వచ్చి పడే ప్రమాదం ఉందని అక్కడి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

2028 లక్ష్యంగా అడుగులు

ఈ అత్యంత అధునాతనమైన భవిష్యత్ ప్రయోగం వల్ల ఉపయోగాలు చాలా ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం చాలా మందిలో తీవ్రంగా కలిచివేసే సమస్య సంతానలేమి. దీని ద్వారా ఈ చింతనకు చెక్ పెట్టచ్చు. అలాగే జననలోపాలను అధిగమించేందుకు కూడా ఈ ప్రయోగం దోహదపడుతుందని చెబుతున్నారు. ఈ ప్రయోగాన్ని 2028 నాటికి విజయవంతం చేసి మానవుని ప్రమేయం లేకుండా బిడ్డలను ఉత్పత్తి చేసే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలు జపాన్ ప్రదాన స్రవంతి మీడియా జర్నల్ నేచర్ లో ప్రచురితం అయ్యాయి.

 

T.V.SRIKAR