Macho Restaurant: నోట్లో నోరు పెట్టి తినిపించే వెయిటర్లు.. ఈ వింతైన రెస్టారెంట్ ఎక్కడో తెలుసా..?

సాధారణంగా హూటల్స్, రెస్టారెంట్స్ లో మంచిగా వ్యాపారం జరగాలంటే కొన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ ఉంటారు. మరి కొన్ని రెస్టారెంట్లలో సర్వీస్ అద్భుతంగా అందించి కస్టమర్లను ఆకర్షిస్తారు. కానీ చైనాలోని ఓ రెస్టారెంట్లో ఏకంగా కస్టమర్ల నోట్లో నోరు పెట్టి తినిపించే వింత ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దీని గురించి పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - August 1, 2023 / 10:21 AM IST

చైనాదేశంలోని బీజింగ్ నగరంలో ఈ వింతైన పరిణామం చోటు చేసుకుంది. యునాన్‌ ప్రావిన్స్‌ జిషువాంగ్‌బన్న దాయ్‌ అటానమస్‌ ప్రిఫెక్షర్‌లోని ఒక రెస్టారెంట్ కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా వికృత చర్యలకు పాల్పడింది. మంచి దేహదారుడ్యం కలిగి, ఎత్తుగా ఉండే మగవారిని వెయిటర్లుగా నియమించుకుంది. వారితో డ్యాన్సులు చేయిస్తూ మహిళా కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. దీంతో మహిళా కస్టమర్ల తాకిడి విపరీతంగా పెరిగింది. ఇంతటితో ఆగకుండా సియామీ థీమ్ ను ప్రచారం చేసింది. అంటే మగవారు షర్ట్ లేకుండా, అర్థనగ్నంగా తిరుగుతూ.. తమ దేహ సౌందర్యాన్ని చూపిస్తూ స్త్రీలను ఆకర్షించే వారు.

ఈ క్రమంలో అక్కడ జరిగే దృశ్యాలను రెస్టారెంట్ కి వచ్చిన కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట చేశారు. దీనిని చూసి కస్టమర్ల తాకిడి మరింత పెరిగింది. ఆశ మహాచెడ్డది అని ఆలోచించని రెస్టారెంట్ యాజమాన్యం కస్టమర్లని మరింత రెచ్చగొట్టేలా రాడ్ లికింగ్ అనే పోల్ డ్యాన్స్ నృత్యాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఒకరకంగా చెప్పాలంటే కామోద్వేగాన్ని రగిలించేలా ఉంటుంది. ఇలా వెయిటర్లు డ్యాన్సులు చేస్తూ తమ నోటితో కస్టమర్లకు తినిపించే వారు. ఇందులో షోల్డర్ మజాస్ కూడా అందుబాటులో తీసుకొచ్చి ఆసక్తి తోపాటూ అవసరమైన వారికి చేసేవారు. చైనాలో ఇలాంటి అశ్లీల చర్యలు చట్టరిత్యా నేరం. ఇలాంటి సినిమాలు, పోస్టర్లు ప్రదర్శించినందుకు గతంలో పెద్ద పోరాటమే జరిగింది.

Ripped male waiters

ఈ విష‍యం ఆనోట ఈనోట పాకి చివరకు అధికారుల దృష్టికి చేరింది. దీంతో ఆ రెస్టారెంట్ పై తనిఖీలు నిర్వహించారు. సామాజిక విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు, చట్టాలకు గౌరవం ఇవ్వకుండా ఇలాంటి చర్యలకు పాల్పడిన రెస్టారెంట్ యాజమాన్యం పై తగు చర్యలు తీసుకున్నారు. ఈ రెస్టారెంట్ కు ఏప్రిల్ నుంచి జూలై మధ్య విపరీతంగా సందర్శకుల తాకిడి పెరిగినట్లు పరిశోధనలో గుర్తించారు. ఇప్పటి వరకూ ఎంత సంపాదించారో లెక్కలు బయటకు తీసి దానికి పది రెట్లు జరిమానా విధించారు. చివరకు ఈ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేశారు.

T.V.SRIKAR