స్టోన్‌మ్యాన్ విల్లీ గురించి ప్రపంచానికి చాలా తక్కువగా తెలుసు. అతను ఈ మమ్మీ ఈ కాలం వ్యక్తి అయితే కాదు.. ఎందుకంటే అతను 19వ చివరి శతాబ్దపు మమ్మీ గా పిలుస్తారు. 19వ శతాబ్దపు చివరిలో అనుకోకుండా మమ్మీ చేయబడి. 128 సంవత్సరాలుగా ప్రదర్శనలో ఉంచబడిన పెన్సిల్వేనియా వ్యక్తి చివరకు అక్టోబరు 7న అంత్యక్రియలు చేయనున్నారు. సంవత్సరాలుగా, అతని గుర్తింపు ఎవరికి తెలియదు. ప్రస్తుతం పెన్సిల్వేనియా లోని నివాసి ప్రజలు అతడిని పెన్సిల్వేనియా హీరోగా పిలుచుకుంటారు.
ఎవరు ఈ స్టోన్‌మ్యాన్ విల్లీ..?
అమెరికాలోని పెన్సిల్వేనియా జైలులో స్టోన్‌మ్యాన్ విల్లీ ని చిన్న దొంగతనం ఆరోపణలపై బెర్క్స్ కౌంటీ జైలులో ఖైదీగా ఉంచబడ్డాడు. స్టోన్ మ్యాన్ మద్యానికి బానిస అయినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం అతనికి కిడ్నీలు పూర్తిగా పాడై, మూత్రపిండాంలో ఇన్ఫెక్స్ వచ్చి 1895 నవంబర్ 19న చనిపోయాడు. అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు జైలు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అతను జైలులో ఖైదీగా ఉన్న సమయంలో తన పేరును జేమ్స్ పెన్ అని జైలులో తప్పుగా చెప్పాడు. తన కుటుంబ సభ్యుల పరువు మర్యాదలను దృష్టిలో పెట్టుకొని వారి పేరును కాపాడటానికి నకిలీ పేరు చెప్పినట్లు జైలు అధికారులు గుర్తించారు.
128 ఏళ్లుగా అంత్యక్రియలు కాని మమ్మీ
స్టోన్‌మ్యాన్ విల్లీ అనే వ్యక్తి మృతదేహాన్ని అధికారులు అతని కుటుంబ సభ్యులకు అప్పగించడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది కారణం.. స్టోన్ మ్యాన్ ఎందుకంటే జైలులో ఖైదీగా ఉన్నప్పుడు తప్పుగా నమోదు చేసిన పేరుతో స్టోన్‌మ్యాన్ విల్లీ కుటుంబాన్ని గుర్తించలేకపోయారు జైలు అధికారులు. అతను పెన్సిల్వేనియాలోని రీడింగ్ లోని ఔమాన్స్ ఫ్యూనరల్ హోమ్‌కి విడుదల జైలు అధికారులు మార్చారు. ఎంబామింగ్ పద్ధతులతో చేసిన ప్రయోగంలో, అతని శరీరం అనుకోకుండా మమ్మీ మారిపోయింది. అధికారుల అనుమతితో ఎంబామింగ్ టెక్నిక్ ప్రభావాలను పర్యవేక్షించడానికి ( అతని శరీరాన్ని మమ్మీ శరీరాన్ని ప్రదర్శనలో ఉంచారు. ఆశ్చర్య విషయం ఏమిటంటే అతని జుట్టు, దంతాలు నేటికి చెక్కుచెదరకుండా ఉన్నాయి. శరీరం పై ఉన్న చర్మం తోలు గా మారిపోయి ఎముకలకు అత్తుకొని మెరుస్తుంది. నేటికి 128 సంవత్సరాలుగా ప్రదర్శనతో ఉంచబడ్డారు.
రీడింగ్ లోని ఔమాన్స్ ఫ్యూనరల్ హోమ్ అధికారి.. “అతను మా స్నేహితుడు”
అంత్యక్రియల డైరెక్టర్ కైల్ బ్లాంకెన్‌బిల్లర్ మాట్లాడుతూ “మేము అతన్ని మమ్మీగా సూచించాము. అప్పటి నుంచి మేము అతనిని మా స్నేహితుడు విల్లీ అని పిలుస్తాము.
“స్టోన్‌మన్ విల్లీ”ని ఇప్పుడు ఎందుకు ఖననం చేస్తున్నారు?
అంత్యక్రియల గృహం 2023 అక్టోబర్ 7న అనగా ఈరోజు అతని అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసినందుకు ప్రభుత్వం ఇప్పుడు ఈ మమ్మీని ఖననం చేస్తున్నారు. అతని అసలు పేరు ఏంటి అనేది అతని ఖననం పూర్తి అయ్యాక అధికారికంగా ప్రకటిస్తారు. అతనిని చివరిసారి చూడటం కోసం భారీగా ప్రజలు తరలివచ్చారు.
128 ఏళ్ల నాటి మమ్మీ కి అక్టోబర్ 7న చివరి ప్రదర్శన.
అక్టోబర్‌లో స్టోన్‌మ్యాన్ విల్లీని చివరిగా పబ్లిక్ కి చూసేందుకు ప్రదర్శనలో పెట్టి స్టోన్ మ్యాన్ విల్లీకి సత్కరించి వీడ్కోలు పలుకుతున్నారు.. రీడింగ్ లోని ఔమాన్స్ ఫ్యూనరల్ హోమ్ అధికారులు. స్టోన్‌మ్యాన్ విల్లీ 19వ శతాబ్దపు ఫ్యాషన్ నుండి ప్రేరణ పొందిన దుస్తులను తిరిగి ఆ మమ్మీకి ధరించారు.
S.SURESH