Beggar Bharat Jain : ఈ బిచ్చగాడు ప్రపంచలోనే చాలా రిచ్‌..

ప్రపంచంలోనే రిచ్‌ బిజినెస్‌ మ్యాన్‌. ప్రపంచంలోని రిచ్‌ సినిమా యాక్టర్‌. ప్రపంచంలోనే రిచ్‌ స్పోర్ట్స్‌ స్టార్‌. ఇలాం చాలా మంది గురించి మనం విన్నాం. కానీ ప్రపంచంలోనే రిచెస్ట్‌ బెగ్గర్‌ గురించి ఎప్పుడైనా విన్నారా. వినకపోతే ఇప్పుడు వినండి.

ప్రపంచంలోనే రిచ్‌ బిజినెస్‌ మ్యాన్‌. ప్రపంచంలోని రిచ్‌ సినిమా యాక్టర్‌. ప్రపంచంలోనే రిచ్‌ స్పోర్ట్స్‌ స్టార్‌. ఇలాం చాలా మంది గురించి మనం విన్నాం. కానీ ప్రపంచంలోనే రిచెస్ట్‌ బెగ్గర్‌ గురించి ఎప్పుడైనా విన్నారా. వినకపోతే ఇప్పుడు వినండి. బిక్షాటనతో కోట్లు సంపాదించిన వరడ్స్ రిచెస్ట్‌ బెగ్గర్‌ మన భారత్‌ లోనే ఉన్నాడు. ముంబైలో ఉండే భరత్‌ జైన్‌ ప్రపంచంలనే అత్యంత సంపన్నుడైన బెగ్గర్‌గా నిలిచాడు. దాదాపు 30 ఏళ్ల నుంచి భరత్‌ భిక్షాటన చేస్తున్నాడు. వచ్చిన ప్రతీ రూపాయినీ దాచుకుని కోట్లు సంపాదించాడు. ముంబైలోనే రిచ్‌ ఏరియాగా పేరున్న బాంద్రాలో రీసెంట్‌గానే కోటిన్నర విలువ చేసే రెండు ఫ్లాట్లు కొన్నాడు. అవి కాకుండా మరో రెండు కమర్షియల్‌ షాపులు కూడా భరత్‌కు ఉన్నాయి. వీటి నుంచి ప్రతీ నెలా దాదాపు లక్షపైనే రెంట్లు భరత్‌కు వస్తాయి. కేవలం భిక్షాటన ద్వారానే ఈ ఆస్తులు సంపాదించుకున్నాడు భరత్. ఆస్తి వచ్చింది కదా అని తన వృత్తిని మాత్రం విడిచిపెట్టలేదు. ఇప్పటికీ భిక్షాటన చేస్తూనే ఉన్నాడు. ఛత్రపతి శివాజీ టర్మినల్స్‌, ఆజామ్‌ మైదాన్‌. ఈ రెండు భరత్ ప్లేస్‌లు. రెగ్యులర్‌గా ఇక్కడే భిక్షాటన చేస్తుంటాడు. అటు వ్యాపారమే కాకుండా.. ఇటు భిక్షాటన ద్వారా కూడా నెలకు 70 వేలు సంపాదిస్తున్నాడట భరత్‌ జైన్‌. ఈ న్యూస్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించుకునేబదులు ఇదేదో చాలా బెటర్‌ ఆప్షన్‌లా ఉందే అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.