వాడు మామూలోడు కాదు… వాడు ఒకరు ఇద్దరు కాదు… ఐదుగురితో రిలేషన్ పెట్టుకున్నాడు… వాళ్ళంతా గర్భవతులు అయ్యారు. ఆ ఐదుగురు ప్రెగ్నెంట్స్ తో కలసి ఓ ఫోటోకు ఫోజులు ఇచ్చాడు. అంతే కాదు… గ్రాండ్ గా షవర్స్ పార్టీ (Grand Shower Party) కూడా ఏర్పాటు చేశాడు. అమెరికాలో జరిగిన ఈ సంఘటనతో జనం ఆశ్చర్యపోతున్నారు.
న్యూయార్క్ కు చెందిన 22 యేళ్ళ జెడ్డీ విల్ అనే మ్యుజిషయన్… ఐదుగురి మహిళలతో రిలేషన్ పెట్టుకున్నాడు. ఆ ఐదుగురు మహిళలు గర్భం (5 WIFES PREGNANT) దాల్చారు. దాంతో వాళ్ళందరితో కలసి గ్రాండ్ గా పార్టీని నిర్వహించాడు. క్వీన్స్ లో వీళ్ళు షవర్ పార్టీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అదే మన దగ్గర సీమంతం లాంటి పార్టీ అది. ఆ ఐదుగురు గర్భిణీలతో… జెడ్డీ విల్ (Jeddy Will) ఫోటోలు కూడా దిగాడు. దీనికి లిటిల్ జెడ్డీ విల్స్ 1 OF 5 వెల్కమ్ అన్న పేరు పెట్టారు. తామంతా జెడ్డీ విల్ కు భార్యలమని ఆ ఐదుగురు మహిళలు బహిరంగంగానే చెప్పుకున్నారు. తమ పిల్లల కోసం ఓ పెద్ద కుటుంబంగా ఉండాలని నిర్ణయించుకున్నామనీ… ఇకపై తామంతా కలిసే ఉంటామని కూడా ప్రెగ్నెంట్స్ చెబుతున్నారు. తమ కుటుంబాలు కూడా ఒప్పుకున్నాయని అంటున్నారు.
ఐదుగురు గర్భవతులతో కలసి ఫోటోలు దిగాడు జెడ్డీ విల్. డ్యాన్స్ చేస్తూ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇదేం పోయే కాలం… ఒక్కడు ఐదుగురితో రిలేషన్ ఏంటని ఫైర్ అవుతున్నారు. అసలు సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్న ఇలాంటి రిలేషన్ ను ఆ మహిళలు, వాళ్ళ కుటుంబాలు ఎలా ఒప్పుకున్నయ్ అని ప్రశ్నిస్తున్నారు. ఇది నమ్మే విషయం కాదనీ… ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని మరికొందరు ఈ రిలేషన్ ను కొట్టిపారేస్తున్నారు.