Republic Day 2024 Highlights : ఈసారి చీరల ఉత్సవం హైలెట్… రిపబ్లిక్ డే వేడుకలు మిస్ అవ్వకండి!

2024 గణతంత్ర దినోత్సవంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈసారి చీరల ఉత్సవం హైలెట్ గా నిలవబోతోంది. మహిళలతో త్రివిధ దళాల బృందం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శకటంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శకటాలు కూడా ప్రత్యేక ఆకర్షణ గా ఉండబోతున్నాయి.

2024 గణతంత్ర దినోత్సవంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈసారి చీరల ఉత్సవం హైలెట్ గా నిలవబోతోంది. మహిళలతో త్రివిధ దళాల బృందం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శకటంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శకటాలు కూడా ప్రత్యేక ఆకర్షణ గా ఉండబోతున్నాయి.

1. చీరల ఉత్సవం
ఈ రిపబ్లిక్ డే పెరేడ్ లో చీరల ఉత్సవం ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. ఈ పెరేడ్ లో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన చీరలను ‘అనంత్ సూత్ర’ ఎగ్జిబిషన్ పేరుతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రదర్శించనుంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 1,900 చీరలను ఇక్కడ ప్రదర్శిస్తారు. వీటిని కర్తవ్య పథ్ లో చెక్క ఫ్రేమ్ లపై అందంగా అమర్చారు. వీటిలో ప్రతి చీరపై ప్రత్యేక క్యూఆర్ కోడ్ కూడా ది. ఆ కోడ్ స్కాన్ చేసి ఆ చీర నేత, ఎంబ్రాయిడరీ పద్ధతులు లాంటి వివరాలు తెలుసుకోవచ్చు.

2. కృత్రిమ మేథ శకటం
ఈ పెరేడ్ లో కృత్రిమ మేధ (Artificial Intelligence) అవసరాన్ని గుర్తు చేస్తూ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ శకటం ప్రదర్శిస్తోంది. ఈ శకటంతో AI గురించి ప్రాక్టికల్ గా తెలుసుకోవచ్చు. పిల్లలకు చదువులు చెప్పడానికి ఓ టీచర్ VR హెడ్ సెట్ ను వాడే సన్నివేశాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా… లాజిస్టిక్స్, పశువుల నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఎలా ఉపయోగించవచ్చో వివరిస్తుంది.

3. మహిళా త్రివిధ దళాల బృందం
మొదటిసారిగా మేజర్ జనరల్ సుమిత్ మెహతా ఆధ్వర్యంలో మహిళా త్రివిధ దళాల బృందం పెరేడ్ లో పాల్గొంటోంది. ఈ బృందంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలకు చెందిన మహిళా సైనికులు ఉంటారు.

4. చంద్రయాన్ 3
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రదర్శించే శకటం ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. ఇందులో చంద్రయాన్ -3 మిషన్ సాధించిన విజయాలను ఇస్రో వివరించనుంది. చంద్రయాన్-3 ప్రయోగం, అది విజయవంతంగా చంద్రుడిపై దిగడం లాంటి వివరాలు ఇందులో ఉన్నాయి.

4. రిపబ్లిక్ డే పరేడ్ లో ఫ్రెంచ్ బృందం
2024 రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. అందుకే ఈ ఉత్సవాల్లో 95 మంది ఉన్న ఫ్రాన్స్ బృందం, 33 మంది ఉన్న బ్యాండ్ బృందం, రెండు రాఫెల్ యుద్ధ విమానాలు, ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ బస్ A330, మల్టీ రోల్ ట్యాంకర్ రవాణా విమానం వేడుకల్లో పాల్గొంటున్నాయి.

5. ఫ్రెంచ్ మిలటరీ బృందంలో ఆరుగురు ఇండియన్స్
75వ రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొంటున్న ఫ్రెంచ్ సైనిక బృందంలో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నారు. కమాండర్ కెప్టెన్ నోయల్ లూయిస్ ఆధ్వర్యంలోని ఫ్రెంచ్ బృందంలో వీళ్ళు ఆరుగురు ఉంటారు. వీళ్ళల్లో సీసీహెచ్ సుజన్ పాఠక్, సీపీఎల్ దీపక్ ఆర్య, సీపీఎల్ పర్బిన్ తాండన్, గురువచన్ సింగ్, అనికేత్ ఘర్తిమాగర్, వికాస్ దాస్ ఉన్నారు.

8. ప్రత్యేక ఆహ్వానితులు
ఈ రిపబ్లిక్ డే వేడుకలోల వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు… ఇలా దాదాపు 13 వేల మందిని ప్రత్యేక అతిథులను పరేడ్ కు ఆహ్వానించారు. ప్రధాని ఆవాస్ యోజన, పీఎం ఉజ్వల యోజన, పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, పీఎం కృషి సించాయి యోజన, పీఎం ఫసల్ బీమా యోజన తదితర పథకాలతో లబ్ధి పొందిన వారు వీళ్ళల్లో ఉన్నారు.