Tik Tok dispute : అమెరికా – చైనా మధ్య టిక్ టాక్ చిచ్చు !

ఉప్పూ నిప్పూలాగా ఉండే అమెరికా – చైనా (America – China) మధ్య ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. టిక్ టాక్ ను అమెరికాలో బ్యాన్ చేయాలన్న నిర్ణయంపై చైనా మండిపడుతోంది. చైనాలోని బైట్ డ్యాన్స్ కంపెనీకి చెందిన టిక్ టాక్ ను అమెరికా కూడా నిషేధించబోతోంది.

 

 

 

ఉప్పూ నిప్పూలాగా ఉండే అమెరికా – చైనా (America – China) మధ్య ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. టిక్ టాక్ ను అమెరికాలో బ్యాన్ చేయాలన్న నిర్ణయంపై చైనా మండిపడుతోంది. చైనాలోని బైట్ డ్యాన్స్ కంపెనీకి చెందిన టిక్ టాక్ ను అమెరికా కూడా నిషేధించబోతోంది. ఈ యాప్ బ్యాన్ (App Ban) కు US ప్రతినిధుల సభలో ఆమోదం లభించింది. బైట్ డ్యాన్స్ కంపెనీ చైనాతో సంబంధం లేకుండా ఈ యాప్ ను US బేస్డ్ సంస్థలకు అమ్మాలనీ అప్పుడే అనుమతిస్తామని అంటోంది అమెరికా. బైట్ డాన్స్ సంస్థ ఆస్తులతో పాటు టిక్ టాక్ కు సంబంధించిన ఆల్గారిథమ్స్ కూడా అమ్మాలని కండీషన్ పెడుతోంది. టిక్ టాక్ లోని డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందనీ, మేథోపరమైన హక్కుల దొంగతనాలు కూడా జరుగుతాయిన అమెరికా వాదిస్తోంది.

టిక్ టాక్ కంపెనీ మాత్రం తమకు చైనా ప్రభుత్వంతో ఎలాంటి సంబంధాలు లేవనీ… అమెరికన్ల డేటాకు భద్రత ఉందని కాంగ్రెస్ లో తన వాదనలు వినిపించింది. ప్రాజెక్ట్ టెక్సాస్ పేరుతో అమెరికన్ల డేటాను ఇక్కడ భద్రపరుస్తున్నామనీ… అందుకోసం 1.5 బిలియన్ల డాలర్లను ఖర్చు చేసినట్టు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. కానీ అమెరికా నిఘా సంస్థ FBIతో పాటు చట్ట సభల సభ్యులు కూడా టిక్ టాక్ కంపెనీ చెబుతున్న వాదనను ఒప్పుకోవడం లేదు. చైనా మాత్రం టిక్ టాక్ ను అమ్మాలని అమెరికా బెదిరించడం… పట్టపగలే దోపిడీకి పాల్పడినట్టుగా ఉందని విమర్శిస్తోంది.