Future Jobs: వచ్చే ఐదేళ్లలో ప్రపంచాన్ని శాసించే ఉద్యోగాలు ఇవే..!

మీరు కాలేజ్ స్టూడెంటా..? లేక కొత్తగా కాలేజీలో చేరబోతున్నారా ? పోనీ చేస్తున్న ఉద్యోగం వదిలేసి మరో రంగం వైపు వెళ్లే ఆలోచన ఉందా ? అయితే ఈ న్యూస్ మీ కోసమే.

  • Written By:
  • Publish Date - May 2, 2023 / 04:29 PM IST

మీరు కాలేజ్ స్టూడెంటా..? లేక కొత్తగా కాలేజీలో చేరబోతున్నారా ? పోనీ చేస్తున్న ఉద్యోగం వదిలేసి మరో రంగం వైపు వెళ్లే ఆలోచన ఉందా ? అయితే ఈ న్యూస్ మీ కోసమే. చాలా కోర్సులు, ఉద్యోగాలు భవిష్యత్తుపై అంచనాలు పెంచవచ్చు. ఆరంకెల శాలరీతో కలర్‌ఫుల్ లైఫ్‌ను కళ్లముందే కనిపించవచ్చు. కానీ ప్రపంచ వ్యాప్తంగా జాబ్ మార్కెట్ వేగంగా మారిపోతోంది. ఇవాళ మార్కెట్‌ను శాసిస్తున్న ఉద్యోగం రేపు ఉంటుందో ఊడుతుందో తెలియని అస్థిర పరిస్థితులు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. చేస్తున్న ఉద్యోగానికి భరోసా లేని పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పింక్ స్లిప్స్ టైమ్ నడుస్తోంది. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు వేలాదిగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. ద్రవ్యోల్బణం , మాంద్యం పరిస్థితులను బూచిగా చూపి ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి.
ఇండియన్ జాబ్ మార్కెట్ ఎలా ఉండబోతోంది ?
వరల్డ్ ఎకనమిక్ ఫోరం విడుదల చేసిన నివేదిక ప్రకారం వచ్చే ఐదేళ్లలో ఇండియన్ జాబ్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోబోతోంది. రానున్న ఐదేళ్లలో భారత్‌లో 22 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 14 మిలియన్ ఉద్యోగాలు ప్రమాదంలో పడబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , రోబోటిక్ వంటి టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో కంపెనీలు కూడా ఏ ఉద్యోగం అవసరం… ఏ ఉద్యోగం అనవసరం అన్న క్లారిటీకి వచ్చేశాయి. అందుకు తగ్గట్టే… ఇప్పటి వరకు ఉన్న ఉద్యోగాల్లో కోత పెట్టి.. కొత్త టెక్నాలజీతో అవసరమైన ఉద్యోగాలపై దృష్టి సారించాయి.
ఎన్ని పోతాయ్… ? ఎన్ని వస్తాయ్..?
ఉన్న ఉద్యోగాలను తొలగించడం…కొత్త ఉద్యోగాలను సృష్టించడం… వీటి మధ్య వ్యత్యాలను చూస్తే పరిస్థితి కొంత ఆందోళనకరంగానే కనిపిస్తుంది. 2027 నాటికి 83 మిలియన్ ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో కలిపోనున్నాయి. అదే సమయంలో కొత్తగా 69 మిలియన్ ఉద్యోగాలు అందుబాటులోకి రాబోతున్నాయి. అందుకనే భవిష్యత్తులో ప్రపంచాన్ని ఏ ఉద్యోగాలు ఏలబోతున్నాయో…ఆ ఉద్యోగాలకు సంబంధించి కోర్సులపైనే ఇప్పటి నుంచే దృష్టిపెడితే ఆయా రంగాల్లో దూసుకుపోయే అవకాశముంటుంది. కెరీర్ కూడా ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగుతుంది.
వచ్చే ఐదేళ్లలో వీళ్లకే డిమాండ్
లోకం మారింది.. వ్యాపారం కూడా మారుతోంది. ఇప్పటి వరకు ఇవే తోపు అనుకున్న రంగాలు కుదేలైపోతున్నాయి. దూసుకొస్తున్న కొత్త టెక్నాలజీ బిజినెస్ తీరునే మార్చేస్తోంది. గ్లోబల్ వార్మింగ్‌కు చెక్ పెట్టే గ్రీన్ జాబ్స్, టెక్నాలజీ రూపురేఖలను మార్చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పటి అవసరాల కోసం భవిష్యత్తు తరాలను నాశనం చేయకుండా జరిగే స్థిరమైన అభివృద్ధి…ఇలా కొన్ని రంగాలు ఫ్యూచర్ జాబ్ మార్కెట్‌ను రూల్ ‌చేయబోతున్నాయ్. మొత్తం మీద 7 రంగాలకు చెందిన నిపుణులకు ఫ్యూచర్ వండర్ ఫుల్‌గా ఉండబోతోంది. ఈ రెండు రంగాలు వరల్డ్ బిజినెస్‌ను కూడా శాసించబోతున్నట్టు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ చెబుతోంది…

ఇంతకీ ఆ ఉద్యోగాలు ఏంటంటే ?

1. Electric vehicle specialist : ట్రాన్స్‌పోర్టు ఇండస్ట్రీ కి ఇప్పుడు EV అన్నది తారకమంత్రంగా మారింది. ఓవైపు చమురు ధరలు ఆకాశానికి అంటుతున్న సమయంలో… పర్యావరణ హితంగా మార్కెట్లను ముంచెత్తుతున్నాయి Electric vehicles. టూ వీరల్స్ నుంచి ఫోర్ వీలర్స్ వరకు భవిష్యత్తు మొత్తం ఎలక్ర్టిక్ వెహికల్స్ దే. Electric vehicle specialistలకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందంటున్నారు నిపుణులు. ఈవీ వెహికల్స్ తయారీ నుంచి మార్కెటింగ్ వరకు అన్‌లిమిటెడ్ డిమాండ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2. AI/MACHINE LEARNING EXPERTS :
ఈ మధ్య కాలంలో ఎవర్ని పలకరించినా ఎవరి నోట విన్నా వినిపిస్తున్న ఏకైక మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనిషి ఆలోచనలతో సంబంధం లేకుండా… కృత్రిమ మేథస్సు… అన్ని రంగాల్లోకి దూసుకొచ్చింది. ప్రశ్న ఎలాంటిదైనా.. సమాధానాన్ని వెంటనే అందించే చాట్ జీపీటీ ఇప్పటికే తన సత్తా చాటుతోంది. స్క్రిప్ట్స్ రాయడం నుంచి వీడియోలు జనరేట్ చేయడం వరకు AI చేయని పని అంటూ లేదు. AI పుణ్యమా అవుట్ డేటెడ్ ఉద్యోగాలు పోతుంటే.. కొత్త ఉద్యోగాలు మాత్రం వేగంగా పుట్టుకొస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని తమ బిజినెస్ మోడల్స్ కు అనుసంధానం చేస్తున్న కంపెనీలు… వాటిని నిర్వహించేందుకు ఏఐ ఎక్స్‌పర్ట్స్‌ను నియమించుకుంటున్నాయి. MACHINE LEARNINGకు కూడా ఇదే స్థాయి డిమాండ్ భవిష్యత్తులో ఉండబోతోంది.
3. Environmentalist : ఆధునికత పేరుతో మనిషి ఇప్పటికే పర్యావరణాన్ని సర్వనాశనం చేసి పెట్టేశాడు. ప్రకృతికి భిన్నంగా ప్రయాణాన్ని సాగిస్తూ మనుగడకే ముప్పుతెచ్చుకున్నాడు. ఏరంగమైనా సరే పర్యావరణహితంగా ఉంటేనే ప్రస్తుత తరాలతో పాటు భవిష్యత్తు తరాల ప్రజలు భరోసాతో బతకగలరు. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా గో గ్రీన్ నినాదాన్ని అందుకుంది. ప్రపంచ పర్యావరణాన్ని కాపాడే Environmentalistలకు డిమాండ్ క్రమేపీ పెరుగుతుంది. ఎలాంటి రంగంలోనైనా పర్యావరణహితంగా విధానాలను రూపొందించడం, కాలుష్య కారకాల నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించడం ఇలా Environmentalistలు భిన్నమైన పాత్రలను పోషించబోతున్నారు. ఈ రంగాన్ని ఎంచుకున్న వారికి ఊహించని స్థాయిలో అవకాశాలు రాబోతున్నాయి.
4.Sustainability experts:
సుస్థిర అభివృద్ధి అన్నది ప్రపంచానికి చాలా అవసరం. ప్రకృతి ధర్మాలను కాపాడుతూ శాంతిసౌభ్రాతృత్వంతో ఉండేలా విశ్వజనీయమైన ప్రపంచ విధానం కోసం చేసే పోరాటమే సుస్థిర అభివృద్ధి. మనిషి స్వార్థ్యానికి ఎవరూ బలైపోకుండా దీని ద్వారా చేయవచ్చు. Sustainable Development Goals పేరుతో ఇప్పటికే ఐక్యరాజ్య సమితి ప్రపంచం ముందు బ్లూ ప్రింట్‌ను కూడా ఉంచింది. ఈ లక్ష్యాలను సాధించాలంటే ప్రపంచవ్యాప్తంగా Sustainability experts అవసరం ఎంతో ఉంది. రానున్న ఐదేళ్లలో ఈ రంగంలో ఉద్యోగవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి
5.FINTECH EXPERTS :
ఆర్థికరంగంలో టెక్నాలజీ సేవలు అందించే వారికి రానున్న కాలంలో పుష్కలంగా ఉద్యోగవకాలు ఉండబోతున్నాయి. బ్లాక్‌చెయిన్ డెవలపర్, ఫైనాల్షియల్ అనలిస్ట్, డేటా సైంటిస్ట్ , ప్రొడక్ట్ మేనేజర్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్, యాప్ డెవలపర్ ఇలా ఎన్నో అవకాశాలు తలుపు తడుతున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా సేవలు విస్తరించడంతో అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.
6.DATA ANALYST:
ప్రపంచమంతా అంకెలమీదే నడుస్తోంది. ఏ కంపెనీకైనా డేటా అన్నది కీలకంగా మారిపోయింది. డేటాను విశ్లేషించి కంపెనీల కోసం భవిష్యత్ వ్యూహాలను రచించే DATA ANALYSTలకు విపరీతంగా డిమాండ్ ఉంది. DATA ANALYSTలుగా కెరీర్‌ను ప్రారంభిస్తే ఫ్యూచర్‌కు తిరుగుండదన్నది నిపుణుల మాట.
7. ROBOTIC ENGINEERS:
మైనింగ్ , మ్యానిఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్ , సర్వీస్ సెక్టార్ వంటి రంగాలకు కావాల్సిన రోబోటిక్ టెక్నాలజీలను రూపొందించే రోబోటిక్ ఇంజినీర్లకు కూడా రానున్న ఐదేళ్ల పాటు డిమాండ్ బాగా ఉంటుంది. ఈ ఏడు రంగాలు రానున్నా కాలంలో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలను సృష్టించబోతున్నాయి. వీటిని ఎంచుకున్న వారికి కూడా అదే స్థాయిలో మంచి భవిష్యత్తు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.