Traffic Police: కారులో హెల్మెట్‌ పెట్టుకోలేదని రూ.1000 ఫైన్‌.. చివరికి ఏమైందంటే..

ట్రాఫిక్‌ రూల్స్‌ విషయంలో పోలీసులు కఠినంగా ఉండటం బెటరే. కానీ ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎలాంటి తప్పులకు ఫైన్‌ వెయ్యాలో అలాంటి తప్పులకే ఫైన్‌ వెయ్యాలి. చేతిలో ట్యాబ్‌ ఉంది కదా అని దేనికి పడితే దానికి ఫైన్‌ వేస్తామంటే కుదరదు. కానీ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ముస్కారా టౌన్‌ ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం ఓ వ్యక్తికి దారుణమైన ఫైన్‌ వేశారు.

  • Written By:
  • Publish Date - April 22, 2023 / 02:15 PM IST

కారులో హెల్మెట్‌ పెట్టుకోలేదని వెయ్యి రూపాయలు చలాన్‌ వేశారు. లోకల్‌గా న్యూస్‌ పేపర్‌ డిస్ట్రిబ్యూటర్‌గా పని చేస్తున్న వపన్‌ కుమార్‌ అనే వ్యక్తి పేపర్స్‌ సప్లై చేసి ఇంటికి రిటర్న్‌ అయ్యాడు. మధ్యలో ట్రాఫిక్‌ పోలీసులు కారు ఆపారు. అన్ని డాక్యుమెంట్స్‌ సవ్యంగానే ఉన్నాయి కదా అని పవన్‌ కారు ఆపాడు. అన్నీ చెక్‌ చేసిన పోలీసులు వెయ్యి రూపాయలు చలాన్‌ వేశారు. వెంటనే పవన్‌ మొబైల్‌కు మెసేజ్‌ కూడా వచ్చింది. హెల్మెట్‌ పెట్టుకోలేదని చలాన్‌ వేసినట్టు ఇన్వాయిస్‌లో ఉంది.

కారులో హెల్మెట్‌ ఏంటని అడిగినా.. వాళ్లు పవన్‌కు సమాధానం చెప్పలేదు. వెంటనే ఇదే విషయాన్ని హైయర్‌ అఫిషియల్స్‌కు చెప్పాడట పవన్‌. ఇన్వాయిస్‌ను వాళ్లకు పంపించాడట. వాళ్లు వెరిఫై చేసి చలాన్‌ రిమూవ్‌ చేస్తామని హామీ ఇచ్చారట. కానీ పవన్‌ చలాన్‌ పెండింగ్‌లోనే ఉండటంతో వేరే దారి లేక చలాన్‌ కట్టేశాడట. పోలీసులు చేసిన పనికి నిరసన తెలిపేందుకు ఇలా కారులో హెల్మెట్‌ పెట్టుకుని తిరుగుతున్నాడు పవన్‌.

హెల్మెట్‌తో కారులో వెళ్తున్న ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. విషయమేంటని నెటిజన్స్‌ ఆరా తీయడంతో ట్రాఫిక్‌ పోలీసులు ఘనకార్యం బయటపడింది. కారులో హెల్మెట్‌ పెట్టుకోలేదని ఫైన్‌ వేసిన ట్రాఫిక్ సిబ్బందిపై నెటిజన్లు మండిపడుతున్నారు. జస్ట్‌ చలాన్స్‌ వసూలు చేయాలనే చూస్తున్నారు తప్ప ప్రొటెక్షన్‌ ఇవ్వడంలేదని లెఫ్ట్ అండ్‌ రైట్‌ ఇచ్చేస్తున్నారు. చలాన్‌ వేయడంమీద పెట్టిన ఇంట్రెస్ట్‌ రోడ్లు బాగు చేయడం మీద కూడా పెట్టింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.