Truth GPT: చాట్‌ జీపీటీకి పోటీగా ట్రూత్‌ జీపీటీ.. మస్క్‌ మామ మామూలు ప్లాన్ వేయలేదుగా..!!

ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది చాట్‌జీపీటీ గురించే ! అది చెప్తున్న ఆన్సర్లు విని ఆశ్చర్యం.. దానివల్ల ఏం జరుగుతుందో అన్న ఆందోళన.. చాట్‌జీపీటీతో ప్రమాదం తప్పదన్న హెచ్చరికలతో భయం.. మిక్స్‌డ్‌ ఫీలింగ్ కనిపిస్తోంది వాల్డ్‌వైడ్‌గా ! ముఖ్యంగా టెక్కీ నిపుణులు వర్గాలు.. చాట్‌జీపీటీతో ప్రమాదం తప్పదని వార్నింగ్ ఇస్తున్నాయ్.

  • Written By:
  • Updated On - April 18, 2023 / 02:07 PM IST

ఎలన్ మస్క్ (Elon Musk) అయితే ఇదే మాట చెప్తున్నారు పదేపదే ! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో (Artificial Intelligence) మానవాళికి ముప్పు పొంచి ఉందని మస్క్‌ మరోసారి హెచ్చరించారు. చాట్‌జీపీటీ (Chat GPT) తరహా చాట్‌బాట్‌లు (Chatbot) వన్‌సైడెడ్‌గా వ్యవహరించే ప్రమాదం ఉందని అంటున్నాడు. ఇలాంటి వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు.. తాను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్‌ చాట్‌బాట్‌ను తీసుకువస్తున్నట్లు వెల్లడించాడు. ట్రూత్‌జీపీటీ (Truth GPT) పేరుతో తాను తీసుకురాబోయే AI చాట్‌బాట్‌.. ప్రకృతి తత్వాన్ని అర్థం చేసుకుని వ్యవహరిస్తుందని మస్క్ అంటున్నాయ్.

మానవాళిని అర్థం చేసుకునే AI వల్ల ఎలాంటి ముప్పు ఉండదని ధీమాగా చెప్తున్నాయ్. చాట్‌జీపీటీకి సరైన పద్ధతిలో శిక్షణనివ్వడం లేదని.. దీంతో అది పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందన్నది మస్క్ ప్రధాన ఆరోపణ. AI టెక్నికల్ డెవలప్‌మెంట్‌ కోసం X.AI కార్ప్‌ పేరుతో మస్క్‌ ఓ సంస్థను కూడా రిజిస్ట్రేషన్‌ చేసినట్లు నెవాడా బిజినెస్‌ ఫైలింగ్‌ ద్వారా తెలుస్తోంది. దీనికి ఆయన డైరెక్టర్‌గా, ఆయన సలహాదారు జేర్డ్‌ బిర్చల్‌ సెక్రటరీగా వ్యవహరించనున్నారు.

AIపై మార్క్‌ జుకర్‌బర్గ్‌, బిల్‌గేట్స్‌ వంటి టెక్‌ దిగ్గజాలతో పోలిస్తే మస్క్‌ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ AIలో తొలినాళ్లలో ఇన్వెస్ట్ చేసినవాళ్లలో మస్క్‌ కూడా ఒకరు. 2018లో దాని నుంచి ఆయన పూర్తిగా బయటకు వచ్చేశాడు. కంపెనీని నడిపిస్తున్న వారితో విభేదాలు, టెస్లాలో కొన్ని కీలక పనులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉండడం వల్లే తాను ఓపెన్‌ AI నుంచి బయటకు వచ్చినట్లు చెప్పాడు. మస్క్‌ ఏది చేసినా సంచలనమే అవుతోందిప్పుడు.. చాట్‌జీపీటీకి పోటీగా అంటే.. అందులో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయ్. మస్క్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.