TTD: 21 నిమిషాల్లోనే 2.25 లక్షల టిక్కెట్ల అమ్మకం.. వైకుంఠ ఏకాదశికి టీటీడీ రికార్డు..

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక దర్శనం ఉంటుందనే సంగతి తెలిసిందే. తిరుమల లో డిసెంబ‌రు 23 నుంచి జ‌న‌వ‌రి 1 వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి సంబంధించి రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు, శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లు, గ‌దుల కోటాను శుక్రవారం టీటీడీ విడుదల చేసింది.

  • Written By:
  • Updated On - November 10, 2023 / 03:08 PM IST

TTD: పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) సంబంధించి వైకుంఠ ఏకాదశి టిక్కెట్లు నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. ఆన్‌లైన్‌లో విడుదలైన 2.25 లక్షల దర్శన టిక్కెట్లు 21 నిమిషాల వ్యవధిలోనే అమ్ముడవ్వడం రికార్డు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక దర్శనం ఉంటుందనే సంగతి తెలిసిందే. తిరుమల (Tirumala)లో డిసెంబ‌రు 23 నుంచి జ‌న‌వ‌రి 1 వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Siri Hanumanth: రెమ్యునరేషన్‌లో రష్మీని దాటేసిన సిరి.. ఎంతో తెలిస్తే షాకే..!

ఇందుకు సంబంధించి సంబంధించి రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు, శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లు, గ‌దుల కోటాను శుక్రవారం టీటీడీ విడుదల చేసింది. 2.25 లక్షల టికెట్లు విడుదల చేయగా, 21 నిమిషాల్లోనే పూర్తయ్యాయి. మొత్తం పది రోజుల పాటు ఈ టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. వీటి ద్వారా టీటీడీకి రూ 6.75 కోట్ల ఆదాయం సమకూరింది. పది రోజుల పాటు రోజుకు 2 వేలు చొప్పున ఈ టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. అదే విధంగా శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు, గ‌దుల కోటాను సాయంత్రం 5 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయనున్నారు. మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 12న‌ ‘దీపావళి ఆస్థానాన్ని’ టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. దీపావళి రోజు ఉదయం 7 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది.

ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ వేగంగా పూర్తి చేస్తోంది.