Dominican Republic : డొమినికన్ రిపబ్లిక్ దేశం లో కూలిన సొరంగం గోడ.. 9 మంది దుర్మరణం.

డొమినికన్ రిపబ్లిక్ రాజధాని మధ్యలో రాకపోకలు సాగిస్తున్న వాహానాలు.. కాంక్రీట్ గోడ కూలిపోవడంతో నిలిపివేశారు. ఆ సమయంలోనే భారీ వరదలు సంభవించి నిలిచిపోయిన వాహనాలు అన్ని కూడా వరదల్లో కొట్టుకుపోయాయి.

డొమినికన్ రిపబ్లిక్ లో ఓ సొరంగం సిమెంట్ గోడ కూలి 9 మంది మృతి చెందారు.

ఈ ఘటన శాంటో డోమింగ్ ప్రాంతంలో జరిగింది. డొమెనికన్ రిపబ్లిక్ దేశంలో ప్రస్తుతం భారీ వర్షాలు, వరదలు ఆ దేశాన్ని ఉక్కిరి, బిక్కిరి చేస్తున్నాయి. ఉష్ణమండల నుండి వచ్చే ఎదురు గాలులతో భారీ తుఫాన్ గా మారి.. పెద్ద ఎత్తున్న వరదలు సంభవిస్తున్నాయి. దీంతో దేశంలోని కట్టడాలను కూడా తడిసి ముద్దయ్యాయి. తాజాగా ఎప్పుడు రద్దీగా ఉండే అవెన్యూ సొరంగంలో ఒక కాంక్రీట్ గోడ భారీ వర్షాలకు తడిసి కూలిపోయింది. అదే సమయంలో అటు నుంచి వెళుతున్న ప్రయాణికుల కార్లపై కాంక్రీట్ గోడ కూలిపోయింది. దీంతో కార్లులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చేందారు. ఈ ఒక్క ఘటనలోనే దాదాపు 9 మంది మరణించారు. ఇప్పటివరకూ 9 మృత దేహాలను బయటకు వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నట్లు చెప్పారు. మరి కొందరి కోసం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. దీనికి తోడు భారీ వర్షాలతో సొరంగంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలుగుతుంది.

డొమినికన్ రిపబ్లిక్ రాజధాని మధ్యలో రాకపోకలు సాగిస్తున్న వాహానాలు.. కాంక్రీట్ గోడ కూలిపోవడంతో నిలిపివేశారు. ఆ సమయంలోనే భారీ వరదలు సంభవించి నిలిచిపోయిన వాహనాలు అన్ని కూడా వరదల్లో కొట్టుకుపోయాయి. డొమినికన్ రిపబ్లిక్ పశ్చిమ భాగంలో వారదల దాటికి చాలా ఇళ్ళు నీటిలో మునిగిపోయాయి. గత 48 గంటల్లో సంభవించిన కుండపోత వర్షాలు, తుఫానులు వరదలకు దేశంలోని మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. వారంలో భారీ వర్షాలకు ముగ్గురు పిల్లలతో సహా కనీసం 21 మంది మరణించారని అధికారులు ఆదివారం తెలిపారు. ఈ భారీ విపత్తుకు దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 13, 000 కుటుంబాలు ఖాళీ చేశారు. అలాగే 32 ప్రాంతాలను అంత్య డెజర్ జోన్ గా ప్రకటించింది ఆ దేశ విపత్తు శాఖ దేశ చరిత్రలో “అత్యధిక వర్షపాతం నమోదు అయినట్లు అధ్యక్షుడు లూయిస్ అబినాడర్ అని పిలిచారు.

S.SURESH