MPhil admission: ఎంఫిల్‌కు గుర్తింపు లేదు.. కోర్సు తీసుకోవద్దంటున్న యూజీసీ

ఈ ఏడాదికి సంబంధించి ఎంఫిల్ అడ్మిషన్‌లు నిలిపివేయాలని అన్ని యూనివర్సిటీలకు డిసెంబర్ 27న యూజీసీ ఆదేశించింది. గుర్తింపు లేని ఎంఫిల్ చదువుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ కోర్సును ఎక్కడా పరిగణనలోకి తీసుకోరు.

  • Written By:
  • Publish Date - December 27, 2023 / 06:16 PM IST

MPhil admission: ఎంఫిల్ చదవాలనుకునే వారికి ముఖ్య గమనిక. ఈ కోర్సు తీసుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటోంది యూజీసీ (యూనివర్సీటీ గ్రాంట్స్ కమిషన్). ఎంఫిల్ డిగ్రీకి ఎలాంటి గుర్తింపు లేదని, అందువల్ల విద్యార్థులు ఎవరూ ఈ కోర్సులో చేరవద్దని సూచించింది. అంతేకాదు.. ఈ ఏడాదికి సంబంధించి ఎంఫిల్ అడ్మిషన్‌లు నిలిపివేయాలని అన్ని యూనివర్సిటీలకు డిసెంబర్ 27న యూజీసీ ఆదేశించింది. గుర్తింపు లేని ఎంఫిల్ చదువుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

RAVI TEJA: మాసోడి ఎంట్రీ.. హనుమాన్‌లో రవితేజ

ఈ కోర్సును ఎక్కడా పరిగణనలోకి తీసుకోరు. ఎంఫిల్ కోర్సు గురించి తాజాగా యూజీసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. “ఎంఫిల్ కోర్సులో అడ్మిషన్ కోసం పలు యూనివర్సిటీలు దరఖాస్తులు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఎంఫిల్ గుర్తింపు పొందిన డిగ్రీ కాదు. ఈ ప్రోగ్రామ్‌ను ఉన్నత విద్యా సంస్థలు అందించడానికి వీల్లేదు. ఈ విషయాన్ని యూజీసీ రూల్స్ 2022, రెగ్యులేషన్ నెంబర్ 14 స్పష్టంగా చెబుతోంది. అందువల్ల 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఫిల్‌లో ప్రవేశాల ప్రక్రియను నిలిపివేయాలని యూనివర్సిటీలను కోరుతున్నాం. విద్యార్థులు కూడా ఈ కోర్సులో అడ్మిషన్లు తీసుకోకూడదు” అని యూజీసీ పేర్కొంది. గుర్తింపు లేని యూనివర్సిటీల్లో, లేదా గుర్తింపు లేని కోర్సుల్లో చేరవద్దని విద్యార్థులకు యూజీసీ సూచించింది. ఎంఫిల్ డిగ్రీకి గుర్తింపు లేదన్న విషయం విద్యార్థులంతా గుర్తుంచుకోవాలని, అందువల్ల ఏ విభాగంలో కూడా ఎంఫిల్ కోర్సులో చేరవద్దని యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి సూచించారు.

ఎంఫిల్ కోర్సుల‌ను యూజీసీ ర‌ద్దు చేసింద‌ని, అయిన‌ప్ప‌టికీ కొన్ని యూనివ‌ర్సిటీలు ఎంఫిల్ కోర్సుల‌ను అందిస్తున్నాయ‌ని మనీష్ జోషి గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా అనేక కొత్త ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటవుతున్నాయి. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 140 వరకు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఇలా ప్రైవేటు యూనివర్సిటీల విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని యూజీసీ కోరింది.