Unmarried Citizens: బ్రహ్మచారులకు గుడ్ ‌న్యూస్.. త్వరలో పెళ్లి కాని వాళ్లకు పెన్షన్‌.. రాష్ట్ర ప్రభత్వం కీలక నిర్ణయం

పెళ్లి కాని వాళ్లకు పెన్షన్‌ మంజూరు చేయబోతోంది హరియాణా రాష్ట్రం. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టార్‌ స్వయంగా చెప్పారు. మంత్రివర్గంలో చర్చించి ఈ విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.

  • Written By:
  • Publish Date - July 4, 2023 / 11:35 AM IST

Unmarried Citizens: వృద్ధులకు, వితంతువులకు చాలా రాష్ట్రాలు పెన్షన్లు మంజూరు చేస్తున్నాయి. ప్రతి నెలా ఆర్థిక సహాయం అందిస్తూ మేమున్నామంటూ చేయూతనిస్తున్నాయి. అయితే ఒక్క రాష్ట్రం మాత్రం ఇప్పటి వరకూ ఎవరూ తీసుకురాని కొత్త పథకాన్ని తీసుకురాబోతోంది. పెళ్లి కాని వాళ్లకు పెన్షన్‌ మంజూరు చేయబోతోంది. అదే హరియాణా రాష్ట్రం.

ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టార్‌ స్వయంగా చెప్పారు. మంత్రివర్గంలో చర్చించి ఈ విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. నెల రోజుల్లో మార్గదర్శకాలు కూడా జారీ చేస్తామన్నారు. రీసెంట్‌గా నిర్వహించిన ఓ సమావేశంలో 60 ఏళ్ల పెళ్లికాని వ్యక్తి సీఎంను ప్రశ్నించాడు. తనకు ఎలాంటి పెన్షన్‌ రావడంలేదని వాపోయాడు. దీంతో 45 ఏళ్లు పైబడి పెళ్లి కానివాళ్లకు పెన్షన్‌ ఇచ్చేలా కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో అలాంటి వాళ్లు ఎంతమంది ఉన్నారో లెక్కింపు కూడా చేపడుతామంటూ చెప్పారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందంటూ చెప్పారు. మనోహర్‌ లాల్‌ ఖట్టార్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇప్పుడిప్పుడే విదేశాల్లో కూడా ఇలాంటి పథకాలు వస్తున్నాయి. రీసెంట్‌గా ఇంట్రోవర్ట్‌లకు ఓ దేశం పెన్షన్‌ మంజూరు చేసే పథకాన్ని తీసుకువచ్చింది. ఆ పెన్షన్‌ డబ్బులతో వాళ్లు బయటి ప్రపంచంలోకి వచ్చి దేశాభివృద్ధికి ఉపయోగపడతారనేది పథకం ఉద్దేశం. ఇప్పుడు హరియాణాలో కూడా ఇలాంటి పథకం రావడం హాట్‌ టాపిక్‌గా మారింది. సీఎం తీసుకున్న నిర్ణయంతో పెళ్లి కాని మధ్య వయస్కులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.