Aadhaar Update : ఆధార్ కార్డులో వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. అడ్రస్ లాంటి వివరాలను అధికారిక వెబ్ పోర్టల్ లో ఆన్ లైన్ లో సొంతంగానే ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ గడువు 2024 మార్చి 14 వరకు పొడిగించింది UIDAI. ఆధార్ కలిగిన ప్రతి ఒక్కరూ ఆ కార్డు పొందిన పదేళ్ళ గడవులో ఒక్కసారైనా అడ్రెస్ తదితర వివరాలను ఖచ్చితంగా అప్డేట్ చేయాల్సి ఉంటుందని అధికారులు గతంలో తెలిపారు.
ఆధార్ కార్డును ప్రభుత్వం పరంగా అన్ని కార్యక్రమాల్లో వాడుతుంటారు. ఇందుకోసం వినియోగదారుడి పాత సమాచారంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే అప్డేషన్ కు అవకాశం ఇచ్చారు. సాధారణ రోజుల్లో ఈ అప్డేషన్ కోసం నిర్ణీత ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు 2024 మార్చి 14 దాకా ఉచితంగా పొందవచ్చు. అందుకోసం ఎలాంటి ఫీజులు వసూలు చేయరు. అది కూడా ఇంట్లో నుంచే ఆన్ లైన్ లో UIDAI వెబ్ పోర్టల్ (Web portal) లో తాజా వివరాలను పొందుపరచవచ్చు.