Chandrayaan-3: ఇస్రో టెక్నాలజీపై అమెరికా కన్ను.. చంద్రయాన్ టెక్నాలజీ కావాలన్న అగ్రరాజ్యం..!

చంద్రుడిపైకి వ్యోమనౌకను పంపి, విజయవంతం చేసింది ఇస్రో. అది కూడా అతి తక్కువ ఖర్చుతో. దీంతో అమెరికాసహా ఇతర దేశాలు భారతీయ సాంకేతికతను చూసి ఆశ్చర్యపోయాయి. అయితే, ఈ సాంకేతికతే నచ్చిన అమెరికా ఈ టెక్నాలజీని తమతో పంచుకోవాలని అడిగినట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు.

  • Written By:
  • Publish Date - October 15, 2023 / 08:12 PM IST

Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రలో చంద్రయాన్-3 ఒక మైలురాయి. చంద్రుడిపైకి వ్యోమనౌకను పంపి, విజయవంతం చేసింది ఇస్రో. అది కూడా అతి తక్కువ ఖర్చుతో. దీంతో అమెరికాసహా ఇతర దేశాలు భారతీయ సాంకేతికతను చూసి ఆశ్చర్యపోయాయి. అయితే, ఈ సాంకేతికతే నచ్చిన అమెరికా ఈ టెక్నాలజీని తమతో పంచుకోవాలని అడిగినట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. చంద్రయాన్ 3 విజయానికి ముందే అమెరికా స్పేస్ నిపుణులు ఈ సమాచారాన్ని కోరినట్లు తెలిపారు.

అయితే, ప్రస్తుతం కాలం మారిందని, భారత్ ఒకప్పటిలా లేదని, ఇప్పుడు భారత్‌ కూడా అత్యుత్తమ పరికరాలు, రాకెట్‌లను తయారు చేయగలదని తేల్చి చెప్పారు. అందుకే ప్రధాని మోదీ భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటుకు అవకాశాలు కల్పించారన్నారు. తమిళనాడులోని చెన్నైలో డా.ఏపీజే అబ్దుల్‌ కలాం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సోమనాథ్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రయాన్ 3 విజయం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై మాట్లాడారు. “చంద్రయాన్ 3 వ్యోమనౌకను తయారు చేసిన తర్వాత అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ ఎక్స్‌పర్ట్స్‌ను ఇస్రో ఆహ్వానించింది. చంద్రయాన్ 3 ప్రయోగం గురించి పూర్తిగా నాసా నిపుణులకు వివరించాం. అసలు ఈ చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఎలా రూపొందించాం.. చంద్రుడిపై ఏ విధంగా సేఫ్ ల్యాండింగ్ చేయనున్నాం వంటి విషయాలను వారితో పంచుకున్నాం.

ఇస్రో చాలా తక్కువ ఖర్చుతో టెక్నికల్ డివైజ్‌లను తయారు చేసిందని వాల్లు ప్రశంసించారు. అయితే ఈ టెక్నాలజీని అమెరికాతో ఎందుకు పంచుకోకూడదు అని వారు అడిగారు. చంద్రయాన్‌ 10 ప్రయోగంలో ఇక్కడ పని చేసే వారిలోని ఒకరు రాకెట్‌లో చంద్రుడిపైకి వెళ్తారు. బహుశా అందులో మహిళ వ్యోమగామే ఉండొచ్చు. చెన్నైలో అగ్నికుల్‌, హైదరాబాద్‌లో స్కైరూట్‌ సహా దేశంలో 5 కంపెనీలు రాకెట్లు, శాటిలైట్లను తయారు చేస్తున్నాయి. స్పేస్ టెక్నాలజీలో పని చేసేందుకు ప్రజలను కూడా ఆహ్వానిస్తున్నాం” అని సోమనాథ్ అన్నారు.