ప్రధాని మోదీ (PM Modi) లక్ష్యద్వీప్ (Lakshadweep) పర్యటన తర్వాత.. బ్యాన్ మాల్దీవ్స్ ( Ban Maldives) హ్యాష్‌ట్యాగ్ (Hashtag) ట్రెండ్ అయింది. లక్ష్యద్వీప్ ప్రాముఖ్యత గురించి మోదీ వివరిస్తూ.. ఓ సోషల్ మీడియా పోస్ట్ చేయడం.. ఆ తర్వాత మోదీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. జాత్యహంకార దాడులకు దిగుతూ.. మాల్దీవుల మంత్రులు కామెంట్ చేయడంతో మొదలైన రచ్చ.. ఆ తర్వాత అనుకోని మలుపులు తిరిగింది. మాల్దీవుల మంత్రుల తీరుపై.. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అయితే చిన్నపాటి యుద్ధమే జరిగింది. దీంతో బ్యాన్ మాల్దీవ్స్ అంటూ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది. అంతే కాదు.. మాల్దీవులకు చాలామంది తమ టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు. పదివేలకు పైగా హోటల్ బుకింగ్ క్యాన్సిల్ కాగా.. 8వేలకు పైగా ఫ్టైట్ టికెట్లు రద్దు చేసుకున్నారు.
పర్యాటకం మీదే ఆధారపడే మాల్దీవుల ప్రభుత్వం వణికిపోయింది. మోదీ దెబ్బకు దిగొచ్చింది. మోదీ మీద కామెంట్ చేసిన ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించింది. ఇక వివాదం ముగిసినట్లే అనుకుంటున్న సమయంలో.. తన కుక్క తోక బుద్ధి చూపించింది మాల్దీవుల ప్రభుత్వం. ఈ వివాదం తర్వాత.. చైనాలో పర్యటించిన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు.. తాము చిన్నవాళ్లమే కావొచ్చు కానీ.. తమను బెదిరించే లైసెన్స్ ఎవరికీ లేదు అంటూ.. భారత్ మీద పరోక్షంగా కామెంట్ చేశారు. ఇక్కడితో ఆగారా అంటే.. మళ్లీ తమ మదం ఏంటో చూపించాడు ముయిజ్జు. భారత్‌కు వార్నింగ్ ఇచ్చాడు. మాల్దీవుల్లో ఉన్న సైనికుల కుటుంబాలు.. ఖాళీ చేసి వెళ్లాలంటూ ఆదేశాలు ఇచ్చాడు.
అధ్యక్ష కార్యాలయం నుంచి నోటిఫికేషన్ కూడా వచ్చింది. మాల్దీవుల్లో భారత సైనికులు ఉండకూడదన్నది తమ పాలసీ అని.. ప్రెసిడెంట్ ఆఫీస్ నోటీసులో ఉంది. మార్చి 12లోపు మాల్దీవుల్లో ఉన్న భారతీయ సైనికులంతా.. దేశం విడిచి వెళ్లిపోవాలని డెడ్‌లైన్ విధించారు. ఇప్పుడీ నోటీసులు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయ్. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ తర్వాత.. ముయిజ్జు ఇలాంటి కామెంట్లు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. దరిద్రపు వేషాలకు కేరాఫ్ అయిన డ్రాగన్.. ముయిజ్జుతో కావాలని ఇలాంటి మాటలు చెప్పించిందని.. మరోసారి చైనా దగుల్బాజీ బుద్ది బయటపడిందనే కామెంట్లు వినిపిస్తున్నాయ్.